‘బంగారు’ చీర బహూకరణ | Golden saree gift to K V Ramana Chary | Sakshi
Sakshi News home page

‘బంగారు’ చీర బహూకరణ

Published Thu, Jan 1 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

‘బంగారు’ చీర బహూకరణ

‘బంగారు’ చీర బహూకరణ

సాక్షి, హైదరాబాద్: నగర చరిత్ర, విశిష్టతలను తెలిపే అపురూపమైన ఓ చీరను నగరానికి చెందిన ఓ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి బహూకరించింది. దాదాపు 350 ఏళ్ల కింద మల్‌మల్ వస్త్రంపై బంగారపు పూతతో రూపొందించిన ఈ చీర, తరతరాలుగా నగరానికి చెందిన గోపాల్ షా సోదరుల కుటుంబానికి వారసత్వ ఆస్తిగా సంక్రమిస్తూ వస్తోంది. రిటైర్డ్ పురాతత్వ శాఖ అధికారి నారాయణరావు ఆధ్వర్యంలో గోపాల్ షా బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు కేవీ రమణాచారిని కలసి ఈ చీరను కానుకగా సమర్పించారు.
 
 850 గ్రాముల బరువున్న ఈ చీరను 16వ శతాబ్దంలో తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటి చేనేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో ఈ చీరను రూపొందించారని కేవీ రమణాచారి తెలిపారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న తరుణంలో, రాష్ట్రానికి బంగారు తాపడం చేసిన చీరను బహూకరించిన గోపాల్ షా కుటుంబాన్ని ఆయన అభినందించారు.

Advertisement
Advertisement