అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడికి ఆపరేషన్ కోసం రూ.లక్షలు అవసరమయ్యాయి. కానీ ఎవరిస్తారు? చదువుకునేందుకు డబ్బులు లేక సాయం చేసే దాతలు లేక చదువు మానేసి ఇంటిబాట పట్టిన వారూ ఉన్నారు. ఇటువంటి కష్టాలకు, సమస్యలకు చెక్ పెట్టే దిశగా సేవాహస్తాలు ముందుకొచ్చాయి. కష్టం ఏదైనా.. సమస్య ఎంత పెద్దదైనా సరే.. తాము నిధులు సేకరించి ఆదుకుంటున్నారు ‘గుడ్‌క్లాప్’ నిర్వాహకులు. వెబ్‌సైట్ రూపొందించి దాతలు ఇచ్చిన డబ్బులతో ఆపన్నహస్తం అందిస్తున్నారు.
హిమాయత్‌నగర్: నిజాంపేటకు చెందిన గండ్రపు శశాంక్ సీఏ చదువుకున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సాయం చేసేవారు లేక, చదువుకునే వారికి ఆర్థిక సాయం చేసేవారు లేక ఇబ్బందుల పాలవుతున్నవారిని గుర్తించి ఆదుకుంటున్నారు. సమస్యల్లో ఉన్న వారి కోసం నిధుల సేకరణ చేయాలనే ఆలోచనకు 2017లో శ్రీకారం చుట్టారు. స్నేహితుడు డాక్టర్ రాజ్‌కు విషయాన్ని వివరించారు శశాంక్. రాజ్ ప్రోత్సాహంతో 2018 మార్చిలో క్రౌండ్ ఫండింగ్‌ను మొదలుపెట్టారు. దీని కోసం ‘గుడ్‌క్లాప్’ పేరుతో కంపెనీని స్థాపించి అదే పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు.
క్లిక్ చేస్తే చాలు సాయం..
మీ ఇంట్లోని వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. చదువు కోసం ఫండింగ్ కావాలన్నా.. సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలన్నా.. డబ్బు కావాల్సిందే. మనవద్ద ఉన్న డబ్బు సరిపోని పరిస్థితుల్లో దాతల కోసం ఎదురు చూస్తుంటాం. ఇటువంటి వారు తమ ‘గుడ్‌క్లాప్’ని ఆశ్రయిస్తే తాము మధ్యవర్తిత్వం వహిస్తూ మీకు కావాల్సిన డబ్బును ఇస్తామంటున్నారు ఫౌండర్ శంశాంక్. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘స్టార్ట్ క్యాంపెయిన్’ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. ‘గుడ్‌క్లాప్’ నిర్వాహకులు మీకు కాంటాక్ట్‌లోకి వచ్చేస్తారు. ఇప్పటివరకు వీరు ఎంతో మందిని ఆదుకున్నారు ‘గుడ్‌క్లాప్’ సభ్యులు భార్గవ, పావని, రాజు, నితిన్, ఫణి. మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ తరువాత ఎక్కడైతే చికిత్స జరుగుతుందో..ఆ హాస్పిటల్‌కు వస్తారు. సంబంధిత డాక్టర్‌తో సంప్రదింపులు జరుపుతారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పరిశీస్తారు. వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత.. దీనికి సంబ«ంధించిన స్క్రిప్ట్‌ని తయారు చేస్తారు. స్క్రిప్ట్ చదివే వారికి నమ్మకాన్ని, కంటతడి పెట్టించేలా రాస్తారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన డబ్బులను హాస్పిటల్‌కే వెళ్లి చెల్లిస్తారు.
కమీషన్ 6శాతం..
ఇంత కష్టపడి టీం వర్క్ చేస్తూ ఫండ్ కలెక్ట్ చేస్తున్న వీరు వచ్చిన ఫండింగ్‌లో నుంచి 6శాతం కమీషన్ తీసుకుంటారు. ఈ కమీషన్‌తో సంస్థ ఉద్యోగుల జీతాలు, మెయింట్‌నెన్స్, స్క్రిప్ట్ సిద్ధం చేసిందుకు వాడతారు. సాయం చేసిన వారి వివరాలు ఫొటోతో సహా వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. తమకు ఈ విధమైన ప్రచారం వద్దనుకుంటే ఆప్షన్ హైడ్ చేస్తే సరిపోతుంది. మీరు సాయం చేసినా.. పబ్లిగ్గా మీ ఫొటో, మీ వివరాలు కనిపించవు. మీరు మాత్రమే చూసుకునే వెసులుబాటు ఉంటుంది.
వీరిని ఆదుకున్నారు..
♦ తమిళనాడు వేలూరులోని ‘సీఎంసీ’ హాస్పిటల్‌లో ‘రేర్ బ్లడ్ డిజార్డర్’తో బాధపడుతున్న స్రవంతి అనే యువతి రూ.15 లక్షలు అవసరమయ్యాయి. గుడ్‌క్లాప్ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటి వరకు రూ.2.41లక్షలు హాస్పిటల్‌కు చెల్లించారు.
♦ ఇండోసోల్ అనే కర్ణాటక వాళ్లు ఓ ఆల్బమ్ కోసం ఫండ్ కావాల్సి వచ్చింది. దీంతో గుడ్‌క్లాప్‌ను సంప్రదించారు. వారికి రూ.2.8 లక్షలు ముట్టాయి. దీనిద్వారా వాళ్ల ఆల్బమ్ రెడీ అయ్యింది.
♦ బెంగళూరుకు చెందిన నటరాజ్ అనే యువకుడు ఇంటర్నల్ బ్లీడింగ్‌తో చికిత్సలో ఉన్నాడు. దీనికి గాను రూ.10లక్షలు అవసరం. ఇప్పటి వరకు రూ.2లక్షలు నేరుగా హాస్పిటల్‌కు ఇచ్చారు.
♦ కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయాలనే దృక్పథంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ వాళ్లు ఫండ్‌కు రేజ్ చేశారు. ఇలా రూ.5.66 లక్షలను కేరళ వరద బాధితులకు ఇవ్వగలిగారు.
♦ హైదరాబాద్‌కు చెందిన వేణుకుమార్ భార్య ప్రసవించింది. పాప ఏడో నెలలో పుట్టడంతో ఇంక్యుబెటర్‌లో ఉంచాల్సి వచ్చింది. వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అవసరమయ్యాయి. ఆమెకు రూ.3.9లక్షలు అందించారు.
♦ అన్నపూర్ణ స్టూడియోకు చెందిన కొందరు యువకులు ‘నాన్‌దెవ్రూ’ అనే షార్ట్‌ఫిల్మ్ తీయడానికి రూ.2.20లక్షల సాయం కావాల్సి వచ్చింది. వీరికి రూ.2.23లక్షలు వచ్చాయి.
ఇదే స్టూడియోలో మరో టీం ‘అంతర్గత’ ‘ఫేక్ ప్రెగ్నెన్సీ’ పై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు రూ.1.49లక్షలు అవసరం కాగా..రూ.1.50లక్షలు వచ్చాయి.
♦ నగరానికి చెందిన రాజు తండ్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందారు. రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. రిబ్స్ విరిగిపోయాయి. ఇప్పుడు ఇతని చికిత్స కోసం రూ.7లక్షలు కావాలి. ప్రస్తుతం రూ.1.46లక్షలు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment