పది జిల్లాల నుంచి 4000 మంది హాజరు
శామీర్‌పేట్ రూరల్: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి మొదటి రోజు అపూర్వ స్పందన లభించింది. మండలంలోని హకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో శుక్రవారం ఉదయం 5.30 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు డెరైక్టర్ యోగేశ్‌ముదాలియర్ మాట్లాడుతూ.. మొదటి రోజు నిర్వహించిన సోల్జర్ టెక్నికల్ పోస్టులకు తెలంగాణలోని 10 జిల్లాలనుంచి 4000 మంది యువకులు హాజరైనట్లు చెపాపరు.
విద్యా, శారీరక అర్హతలను పరిశీలించి వారిలో 1950 మందికి టోకెన్లు అందజేశామన్నారు. ఈ టోకెన్లు అందుకున్న వారికి శనివారం ఉదయం 5.30 నుంచి ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజా, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ వరలక్ష్మి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, పోలీసు ఉన్నతాధికారులు బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, పేట్‌బాషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, శామీర్‌పేట్ సీఐ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
నేడు సోల్జర్ క్లర్క్ దరఖాస్తులు స్వీకరణ
ఆర్మీ రిక్రూట్‌మెంటులో భాగంగా శనివారం ఉదయం నుంచి సోల్జర్ క్లర్క్‌లకు దరఖాస్తు ఫారాలు స్వీకరించనున్నారు. ఇందులో పాల్గొనే యువకులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో పాటు ఓ సెట్ జిరాక్స్ కాపీలు, 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అపూర్వ స్పందన
Published Fri, Aug 1 2014 11:52 PM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement