రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నేడరిగొండ మండలంలోని తేజాపూర్‌లో పత్తి పంటలను పరిశీలించారు.
నకిలీ విత్తనాల వల్ల కలుగుతున్న నష్టంపై వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... తేమ శాతం పేరుతో పత్తి రైతులను దగా చేస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.