భూ..బకాసురులు
ఎర్రబల్లి(భీమదేవరపల్లి): కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. భీమదేవరపల్లి మండలం ఎర్రబల్లి, కొత్తకొండ, గట్లనర్సింగపూర్ తదితర గుట్టలను కొల్లగొట్టేందుకు ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు దరఖాస్తులు సమర్పించుకున్నారు. తాజా గా వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్, భీమదేవరపల్లి మండలం ఎర్రబల్లి గ్రామాల సరిహద్దులోని భూములును ఆక్రమించుకుంటున్నారు.
భీమదేవరపల్లి మండలం ఎర్రబల్లి, కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలం దామెరతో పాటు వరంగల్ జిల్లా ధర్మాసాగర్ మండలం దేవునూర్, నాగారం, సోమదేవరపల్లి గ్రామాల శివారులో వేలాది ఎకరాల భూముల్లో విలువైన ఇనుపరాతి గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఇనుపరాతి గుట్టలను విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. దాంతో ఆగ్రహించిన టీజేఏసీ నాయకులు ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో గతేడాది మండలంలోని ఎర్రబల్లి ఇనుపరాతి గుట్టల వద్ద నుంచి బస్సుయాత్ర చేపట్టారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం త మ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టింది.
ఇనుపరాతి గుట్టలను ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తారనే విష యం తెలువడంతో కొందరు బడా పారిశ్రామికవేత్తల చూపు ఈ గుట్టలపై పడింది. ఎర్రబల్లి, కొత్తపల్లి శివారులోని గుట్టల కింద గల వందలాది ఎకరాల భూముల ను తక్కువ ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి.. గుట్టల సమీపం వరకు ఆక్రమిస్తున్నా రు. ఇదే తరహా లో ఇటీవల మండలంలోని ఎర్రబల్లి, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ ప్రాంతాల్లోని సుమా రు 500 ఎకరాల భూమిలో వరంగల్‌కు చెందిన ఓ వ్యాపారి ట్రస్ట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇటీవలే ఆ భూమిని రాత్రికి రాత్రే జేసీబీతో చదును చేయించాడు.
విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి గ్రామస్తులు సర్పంచ్ కాలేరు చినబాబుకు చె ప్పడంతో ఆయన చదును చేసే పనులను నిలిపివేయిం చారు. అనంతరం తిరిగి చదును చేసే పనులు కొనసాగాయి. అయితే.. ఈ భూములను తాము కొనుగోలు చే శామని, ఇక్కడ ట్రస్ట్‌ను నెలకొల్పాతామని సద రు వ్యా పారి చెబుతున్నాడు. కానీ ఈ భూమి ఎక్కడిది, ఏ సర్వేనంబర్లది అనే విషయంపై ఇప్పటికీ రెవెన్యూ అధికారు లు విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తా విస్తోంది. సదరు వ్యాపారి చదును చేసింది పట్టా భూ ములా.. ప్రభుత్వ భూమాలా..? అనేది తేలాల్సింది.