క్షయ.. ప్రభుత్వానికేది దయ
క్షయ.. ప్రభుత్వానికేది దయ
Published Mon, Jul 3 2017 2:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
ప్రాణాంతకమైన జబ్బు అంటే.. అప్పటి రోజుల్లో గుండెజబ్బు లేదా క్షయ అని అనేవారు. క్షయ వస్తే.. ఇక చావే అన్నట్లు ఉండేది. అనంతరం క్షయకు చికిత్స వచ్చింది. తర్వాత తర్వాత కేన్సర్ వంటివి వచ్చాయి. దీంతో టీబీ గురించి పెద్దగా వినిపించడం తగ్గింది. అయితే, వ్యాధి ప్రబలడం మాత్రం తగ్గలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. పైగా.. మన దేశంలో 41 శాతం మంది టీబీ రోగులకు సరైన వైద్యం కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా క్షయ బారిన పడుతున్న వారిలో 27 శాతం మంది భారత్‌కు చెందినవారే కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. మొత్తం క్షయ మృతుల్లోనూ 29 శాతం మనవారే..
–సాక్షి, తెలంగాణ డెస్క్
ఏటికేడు క్షయ బారిన పడుతున్న వారు, మృతుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వాలు అశించినంతగా స్పందించడం లేదు. క్షయ వ్యాధి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నది స్వల్పమే. అలాగే వ్యాధి రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ పూర్తిగా విఫలమవుతోంది. ఏటా ఎక్కువ మంది ప్రాణాలను బలికొంటున్న వ్యాధుల జాబితాలో క్షయ టాప్–5లో ఉంది. మృతుల్లో 30 నుంచి 69 ఏళ్ల మధ్య వారే ఎక్కువ.
Advertisement