
ఉపాధ్యాయులు లేక ఆరుబయట కూర్చున్న విద్యార్థులతో ఎస్‌ఎంసీ చైర్మన్, ఇతరులు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : మండలంలోని జగ్గాసాగర్ ప్రాథమిక పాఠశాలకు బడిపంతులు శనివారం డుమ్మాకొట్టాడు. ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో తరగతి గదులకు తాళాలు తీసే వారులేక విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ డబ్బ రవి తన స్నేహితులతో కలిసి పాఠశాలను తెరిచారు. పాఠశాలలో హెచ్‌ఎం రవీంధ్రనాథ్, ముగ్గురు ఉపాధ్యాయులు శ్రీనాథ్, రాజేశం, రామకృష్ణ పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులకు 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
138 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ఒక్క డే నిర్వహిస్తున్నాడు. ఆయన పాఠశాలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటల వరకు రాలేదు. దీం తో ఎస్‌ఎంసీ చైర్మన్ రవి, అతని స్నేహితులు సామ రమేశ్, డబ్బ రమేశ్, ముదాం శ్రీనివాస్, పాలెపు రాజే ందర్, కట్లకుంట రాజేశ్ సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు భోదించారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈవో కనకతా రను వివరణ కోరగా ఆమె అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment