డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం.. | Government Of Telangana Warns RTC Employees To Withdraw Strike | Sakshi
Sakshi News home page

డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం..

Published Sat, Oct 5 2019 2:49 AM | Last Updated on Sat, Oct 5 2019 12:52 PM

Government Of Telangana Warns RTC Employees To Withdraw Strike - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న పువ్వాడ.. 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమ్మెను వీడి విధుల్లో చేరాలని, లేదంటే వారిపై వేటు తప్పదని హెచ్చరించింది. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేయాలని, అలా చేయని వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారి్మకులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కలి్పస్తామని పేర్కొంది. విధుల్లో చేరని వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఇకపై కారి్మక సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రద్దయిపోయింది. ఆగమేఘాల మీద రవాణా శాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియాను నియమించింది.  
(చదవండి : ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ కీలక నిర్ణయం)

సమ్మెపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. 
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బండా ప్రకాశ్, రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్‌.కె..జోíÙ, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ డీజీపీ జితేందర్, సీనియర్‌ అధికారులు సోమేశ్‌ కుమార్, సునిల్‌ శర్మ, రామకృష్ణారావు, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కారి్మక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదించారు. 

కారి్మకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినా కార్మిక సంఘాల నేతలు సమ్మెకే మొగ్గు చూపారని వివరించారు. ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే ఆరీ్టసీకి నష్టం తెచ్చేలా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంపై ప్రభుత్వం అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆరీ్టసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మె చేయడం చట్ట విరుద్ధమని అధికారులు అభిప్రాయపడ్డారు. 

కఠిన చర్యలే.. 
ఆర్టీసీ సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆర్టీసీ యూనియన్‌ నేతల ఉచ్చులో పడి, కారి్మకులు సంస్థకు నష్టం చేయొద్దని, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం హెచ్చరించారు. కారి్మకుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆరీ్టసీని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ కారి్మకులే ఆరీ్టసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆరీ్టసీని కాపాడటం కష్టమని అభిప్రాయపడ్డారు.  

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి.. 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారులు చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో 10 వేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2,100 అద్దె బస్సులేనని అధికారులు చెప్పారు. 5 వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. దీంతో 7 వేలకు పైగా బస్సులు నడిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆరీ్టసీలో మైలేజీ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని, శనివారమే ఇందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని, రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేటర్లపై ఉదారంగా ఉండాలని చెప్పారు. 

కారి్మకులు ఆలోచించాలి: మంత్రి పువ్వాడ 
సీఎంతో సమావేశం అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మతో కలసి ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం విభజనకు ముందు ఐదేళ్లలో రూ.1600 కోట్లు కేటాయిస్తే.. తాము విభజన అనంతరం ఐదేళ్లలో రూ.3300 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాం. కారి్మకులకు మునుపెన్నడూ లేనంత 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఐఆర్‌ 16 శాతం ప్రకటించాం. 4,768 కాంట్రాక్టు కారి్మకులను రెగ్యులరైజ్‌ చేశాం. ఆర్టీసీని రక్షించుకోవాలి. యూనియన్ల స్వలాభం కోసం అమాయక కారి్మకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మా విధానం కాదు.. మేం అసలు అలాంటి హామీలు ఇవ్వలేదు. మేం ఇవ్వని హామీని అమలు చేయాలనడం అసంబద్ధం. కారి్మకులకు ఇదే చివరి వార్నింగ్‌. దయచేసి సాయంత్రంలోగా విధుల్లో చేరండి’అని కోరారు.  

అడ్డుకుంటే కఠిన చర్యలు: సునీల్‌ శర్మ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి 
ఇప్పటి వరకు 7 వేల వాహనాలను సేకరించాం. 2,100 ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి. 2,600 అద్దె బస్సుల కోసం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఓలా, ఉబర్, సెట్విన్‌ సరీ్వసులను వాడుకుంటాం. చార్జీలు కూడా తగ్గిస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మె కారణంగా ప్రతి 5 నిమిషాల కోసం ఉండే రైలు, ప్రతి 3 నిమిషాలకోసారి తిరిగేలా చూడాలని కోరాం. 325 ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా తీసుకుంటాం. వి«ధుల్లో ఉన్నవారిని ఎవరైనా అడ్డుకుంటే.. కేసులతో పాటు తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. దాడులు చేసినా, అడ్డుకున్నా కఠినంగా వ్యహరిస్తాం. ప్రతి బస్సుకు పోలీసు బందోబస్తు ఉంటుంది. 97 డిపోలను కంట్రోల్‌రూమ్‌ ద్వారా పరిశీలన చేస్తున్నాం అని సునీల్‌శర్మ వివరించారు. 

ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు: ఆర్టీసీ జేఏసీ 
ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ ప్రకటనపై టీఎస్‌ ఆర్టీసీ జేఏసీ స్పందించింది. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, ఏ ఒక్క కారి్మకుడూ విధులకు హాజరు కాడని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘మా ఉద్యోగాలు పోయినా ఫర్వాలేదు, సమ్మె కచి్చతంగా చేసి తీరుతాం. పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సకల జనుల సమ్మె సమయంలో ఆయన పాత్రేంటి? తెలంగాణ కోసం మేం ఉద్యమం చేశాం. దేనికీ భయపడేది లేదు’అని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement