కార్మికుల సంక్షేమం కోసం కృషి | Government working effectively for workers welfare | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమం కోసం కృషి

Published Sat, May 2 2015 2:26 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Government working effectively for workers welfare

కుత్బుల్లాపూర్: కార్మికుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేత చింతల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన మే డే ఉత్సవాల్లో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో చింతల నాగరాజు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన సంస్థల యాజమాన్యాలతో పోరాడి వారి హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేత కొలన్ హన్మంత్‌రెడ్డి, దేవగారి రాజేందర్‌రెడ్డి, చింతల యాదగిరి, నెహ్రు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు నాగరాజు ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement