The workers
-
ఉపాధి కూలీల ఆందోళన
ఐదు నెలలుగా ఉపాధి హామి కూలి పనులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఎండీవో కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా జి.సిగడం మండల ఎండీవో కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. మండలంలోని చడ గ్రామానికి చెందిన ఉపాధీ కూలీలు గత ఐదు నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటివరకు వారికి బిల్లులు చెల్లించలేదు దీంతో గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు తమకు న్యాయం చేయాలని వెంటనే బిల్లులను ఇప్పించాలని కోరుతూ ధర్నాకు దిగారు. -
కూలిపనులకూ కోత
- 100 పనిదినాలు ఉత్తమాటే - ఏడాదిగా కొత్త జాబ్కార్డుల్లేవు - వలస బాటలో కూలీలు - జన్మభూమి కమిటీలదే పెత్తనం జాతీయ ఉపాధి హామీ పథకం ఓటుబ్యాంకు రాజకీయాలకు బలైపోతోంది. ఒక ప్పుడు అడిగిన వారందరికీ ఉపాధి చూపించే ఈ పథకం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం హయాంలో నీరుగారిపోతోంది. పనులు కల్పించే వాళ్లు మన వాళ్లేనా?..పనులు చేసే వాళ్లు మన వాళ్లేనా? అని చూసి మరీ పనులు కల్పించే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది.దీంతో ఏడాదిగా ఏ ఒక్కరికి కొత్తగా జాబ్‌కార్డుల ఇవ్వక పోగా..ఉన్న కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కూడా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం : జాతీయ ఉపాధి హామీ పథకం..జాతీయ ప్రయోజనాలతో ఏర్పడిన పథకం. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని తమకనుకూలంగా మల్చుకునేందుకు టీడీపీ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి పథకరచన చేస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పార్టీకి అనుకూలంగా పనిచేయ లేదనే సాకుతో కొంతమందిని పని గట్టుకుని మరీ సాగనంపింది. వారి స్థానంలో తమ తాబేదార్లకు నియమించేందుకు ఎంపిక బాధ్యతను పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టింది. ఇక ఉపాధి పనుల ఎంపిక బాధ్యతను కూడా ఈ కమిటీలకే అప్పగించింది. దీంతో ఏ గ్రామంలో తమకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి.. ఎక్కడ రాలేదు...అని బేరీజు వేసుకుంటూ మరీ పనుల గుర్తింపు జరుగుతోందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతుంది. ఇక కూలీలకు పనుల కల్పనలో కూడా ఇదే విధానం కొనసాగుతుందని కూలీలు ఆరోపిస్తున్నారు. పొట్టనింపని ‘ఉపాధి' విశాఖ గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 5.92 లక్షల జాబ్‌కార్డులుండగా, వాటిలో 13.43లక్షల మంది కూలీలున్నారు. వీటిలో 3.34 లక్షల యాక్టివ్జాబ్కార్డ్స్ ఉంటే 6.34లక్షల మంది కూలీలున్నారు. ప్రతి ఏటా డిసెంబర్లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సీజన్లో సరాసరిన నాలుగున్నర లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తుంటారు. ప్రతి ఏటా రెండు లక్షల వరకు పని దినాలు కల్పిస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు 87.32లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. ప్రతి కుటుంబానికి కేవలం 34 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. అదే టీడీపీ సర్కార్ రాక ముందు 60 రోజులకు పైగా పనిదినాలు కల్పించే వారు. వంద రోజుల పనిదినాలు 2012-13లో 73వేల మందికి కల్పిస్తే 2013-14లో 65,922 మందికి కల్పించారు. ఇక గతేడాది 59వేల మందికి కల్పిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1472 మందికి మాత్రమే కల్పించారు. కూలికీ బకాయిలు... ప్రస్తుత సీజన్లో సగటున కూలీలకు రూ.50లోపే వేతనం గిడితే.. గరిష్టంగా రూ.80కి మించి రావడం లేదు. మరొక పక్క కూలీలకు రూ.35కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక పక్క ఉపాధి పనులు, మరొక పక్క వ్యవసాయ పనుల్లేక పోవడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు వలసబాట పడుతున్నారు.అనకాపల్లి మండలం కూండ్రం పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది ఉపాధి కూలీలు చెన్నైకి వలస పోయారు. నర్సీపట్నం మండలం పెదఉప్పరగూడెంలో 100 కుటుంబాలు, బుచ్చెయ్యపేట , చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన 500 మంది చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. నాతవరం మండలం మాధవనగరం, బుచ్చంపేట, రావాన్నపాలెం గ్రామాల నుండి 600 మంది, గొలుగొండ మండలం పేటమాలపల్లి, జోగంపేట, పాతమల్లంపేట గ్రామాల నుండి 700 మంది వరకు వలస వెళ్తున్నారు. -
మండుటెండలో ఉపాధి
- సుర్రుమంటున్న ఎండలో కూలీల విలవిల - పని స్థలాల్లో కానరాని ప్రత్యేక వసతులు - పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బెంబేలు - షామియానాలు, హెల్త్కిట్లు మాయం - ఏప్రిల్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం ముకరంపుర : పొట్టకూటి కోసం మండుటెండల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండవేడిమి శాపంలా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూలీలు విలవిల్లాడుతుంటే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యంత్రాంగం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గరిష్ట ఉష్ణోగత్రలు 43 డిగ్రీలకు చేరగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండవేడిమితో వడదెబ్బలు తగిలే ప్రమాదాలు పొంచి ఉన్నా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట ప్రత్యేక వసతుల కల్పించాల్సి ఉండగా అధికార యంత్రాంగం కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితమవుతోంది. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 6,08,934 జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం 25,154 శ్రమశక్తి సంఘాల కింద 4,54,713 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 1,20,000 కూలీలు పనులకు వెళ్తున్నారు. 57 మండలాల్లోని 1050 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఎండకు చెరువు మట్టి గట్టిగా ఉండడంతో మిషన్ కాకతీయలో ఎంపిక కాని చెరువులలో ఉపాధిహామీ కింద పూడికతీత పనులు కూడా చేపడుతున్నారు. ఇందులో 635 చెరువులను ఎంపిక చేసుకోగా ప్రస్తుతం 135 చెరువులలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఉపాధి పనులు కొనసాగుతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు హాజరవుతారు. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. పనులలో భాగంగా ఉదయం 7 గంటలకే హాజరవుతున్న కూలీలకు కొలతల ప్రామాణికంగా కేటాయించిన పనులు దాదాపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 దాటితేనే ఎండ తీవ్రతకు తాళలేకపోతున్నారు. వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పన అందని దాక్ష్రగానే మారింది. ఏటా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి నిధులు కేటాయిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వసతుల కల్పనకు అవసరమైన మెటీరియల్ కొనుగోళ్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉంది. ఉపాధి పనులకు వెళ్లే వారు పనులు చేసి కొంత సమయం సేద తీర్చుకోవడానికి, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి జిల్లాలో 2010లో దాదాపు 20 వేలకు పైగా షామియానాలు అందజేశారు. గతేడాది వరకు వీటిని ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అనేక మంది వాటిని సొంత పనులకు వినియోగించడం, ఎండకు అవి చిరిగిపోవడం తదితర కారణాలతో ఇప్పుడు అవి లేకుండా పోయాయి. దీంతో కూలీలు దిక్కులేక ఎండలోనే పనిచేస్తున్నారు. వాటిని కొనుగోలు చేయకుండానే నిధులు భోం చేశారనే ఆరోపణల కూడా లేకపోలేదు. ఎండ తీవ్రతకు భయపడి అనేక మంది కూలీలు పనులకు హాజరు కావడం లేదు. వచ్చిన వారికి నిలువ నీడ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లు ఏవీ..? ఉపాధి పనులు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా తక్షణమే వారికి ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి పంపించడానికి ప్రభుత్వం ఆరోగ్య కిట్లను పంపిణీ చేసేది. రెండేళ్ల నుంచి ఈ కిట్ల జాడే లేదు. ప్రతి సంవత్సరం కిట్లు కొనుగోలు చేయూలని ఆదేశాలు జారీ కావడంతో పాటు నిధులు కూడా డ్రా అవుతూనే ఉంటాయి. కానీ అవి మచ్చుకైనా లేకపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లలో అయోడిన్, కాటన్, ఆయింట్మెంట్, ఇతర ట్యాబ్లెట్లు ఉంటాయి. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాల్సినప్పటికీ ఇవేమీ కూలీలకు అందడం లేదు. కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ వారినే ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలని నిబంధన వి ధించారు. ఎండకు తగినంత నీరు లేకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఉపాధి కూలీలు పనిచేస్తూ తనువు చాలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఫిర్యాదు, రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగానే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిపార్సు చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటేనే పరిహారం అందజేస్తారు. పనిచేసి వెళ్లి ఇంటి వద్ద మృతిచెందితే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏప్రిల్‌లో పని చేసిన కూలీల వేతనం రూ.8కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పటివరకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలనే ఇస్తున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కార్మికుల సంక్షేమం కోసం కృషి
కుత్బుల్లాపూర్: కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత చింతల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన మే డే ఉత్సవాల్లో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతల నాగరాజు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన సంస్థల యాజమాన్యాలతో పోరాడి వారి హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కొలన్ హన్మంత్‌రెడ్డి, దేవగారి రాజేందర్‌రెడ్డి, చింతల యాదగిరి, నెహ్రు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు నాగరాజు ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
శ్రమ దోపిడీపై పోరాడుదాం..
- టఫ్ కో కన్వీనర్ విమలక్క జవహర్‌నగర్ : కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) కో కన్వీనర్ విమలక్క అన్నారు. బాలాజీనగర్‌లో శుక్రవారం రాత్రి ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట, ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకువచ్చేవరకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న కష్టజీవుల్ని ఐక్యం చేసి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్తున్నారని, ఫలితంగా ఉద్యోగ కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజ్ మాట్లాడుతూ.. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరువైందన్నారు. ఆకాశాన్నంటిన ధరలతో పేద ప్రజలు బతికేందుకు కష్టమైపోయిందన్నారు. కార్మికుల హక్కులకోసం ఏఐఎఫ్టీయూ పనిచేస్తోందని, పోరాటాలతోనే హక్కులను సాధించుకుంటామన్నారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆట పాటలతో హుషారెత్తించారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ సర్పంచ్ గడ్డమీది మల్లేష్, టఫ్ రాష్ట్ర నాయకుడు హనుమాన్లు, ఏఐఎఫ్టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు, రాష్ట్ర నాయకుడు నాగేశ్వరావు, అసంఘటిత భవన నిర్మాణరంగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.మల్లేష్ , ఏఐఎఫ్టీయూ జవహర్‌నగర్ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బిర్రు యాకస్వామి, డాక్టర్ రవి, చెన్నాపురం యాదయ్య, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మిక సంక్షేమానికి వైఎస్ కృషి
- వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నర్ర భిక్షపతి పటాన్చెరు: కార్మిక సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషిని కార్మికులు ఎప్పటికీ మరువలేరని వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నర్ర భిక్షపతి పేర్కొన్నారు. మేడే సందర్భంగా పారిశ్రామిక వాడలోని సీఎస్సీ వెలికాన్, సీఎంఎస్టూల్స్, మైక్రోవేవ్స్ పరిశ్రమల్లో వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న భిక్షపతి మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు. కార్మిక చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్మిక చట్టాలు యాజమాన్యాల చుట్టాలుగా మారుతున్నాయని విమర్శించారు. అనేక పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు పనికి తగిన వేతనం దొరకడం లేదన్నారు. చాలీచాలని జీతాలతో కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. -
కార్మికులకు అండగా ఉంటాం
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పటాన్చెరు: కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం పటాన్చెరు పారిశ్రామిక వాడలో సీఎంహెచ్ టూల్స్ పరిశ్రమ గేటు వద్ద వైఎస్సార్ టీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యలపై పోరాటం చేసేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. యాజమాన్యాల మెడలు వంచి అయినా సరే కార్మిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పటాన్చెరులో జెండా ఆవిష్కరించామన్నారు. త్వరలోనే అన్ని పరిశ్రమల్లో పార్టీ అనుబంధ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. కనీస వేతనాలు, తదితర కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్రభిక్షపతి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కార్మిక సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. స్థానిక పారిశ్రామిక వాడలో వైఎస్సార్టీయూసీ బలంగా ఉందన్నారు. చౌగ్లే మ్యాట్రిక్స్ యాజమాన్యం ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. యూనియన్ జెండా ఆవిష్కరణకు అనుమతించలేదన్నారు. పరిశ్రమలోని కార్మికులకు అండగా ఉంటామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకున్న సంస్థలేవీ మనుగడ సాగించలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజీవరావు, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, పట్లోళ్ల నరేందర్‌రెడ్డి, నాగులపల్లి ఎంపీటీసీ సభ్యులు రమేష్, ఆర్ సీపూర్ పట్టణ అధ్యక్షుడు వేణు, సీఎస్టీ వెలినాక్స్ పరిశ్రమ ప్రధాన కార్యదర్శి భాస్కర్, సీఎంహెచ్ టూల్స్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, వైస్ ప్రసిడెంట్ దివాకర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, ఆ కార్మిక సంఘం నాయకులు నాయుడు, వెంకటేశ్వర్రావు, భాస్కర్, పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి ఇంకెన్నాళ్లకు?
తాండూరు, న్యూస్‌లైన్: వేలాదిమంది కార్మికులు వైద్యసేవల కోసం అల్లాడుతున్నారు. అందుబాటులో కార్మిక బీమా ఆస్పత్రి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక నిస్సహాయంగా గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్న తాండూరు ప్రాంతంలో కార్మికులకు వైద్యసేవలు అందని ద్రాక్షగా మారాయి. తాండూరు అంటే గుర్తొచ్చేది జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన షాబాద్ (నాపరాతి) బండలు. వందలాది నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో నాలుగు పెద్ద సిమెంట్ కర్మాగారాలూ తాండూరులో ఉన్నాయి. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలతో బీడీల పరిశ్రమ, భవన నిర్మాణం తదితర రంగాల్లో సుమారు 15-20వేల మంది వరకూ కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో సుమారు 5వేలమంది కార్మికులు ఉంటే కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. కానీ తాండూరులో సంఘటిత, అసంఘటిత రంగాల్లో వేలాదిగా కార్మికులు పనిచేస్తున్నా కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు నోచుకోవడం లేదు. ఆయా రంగాల నుంచి సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడం గమనార్హం. పలుమార్లు తాండూరులో పర్యటించి కార్మికుల వివరాలు సేకరించిన ఆ శాఖ అధికారులు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పదేళ్లుగా హామీలు ఇవ్వడమే తప్ప ఇంతవరకూ ఆస్పత్రి అతీగతి లేదు. దీంతో గనులు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లలో ప్రమాదాలకు గురవుతున్న కార్మికులు మృత్యువాత పడుతుండగా, పలువురు అంగవైకల్యానికి గురవుతున్నారు. జబ్బులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక జీవితాలను వెళ్లదీస్తున్నారు. తాండూరులో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌కు గతంలోనే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి విన్నవించారు. తాండూరు మండలంలోని చెన్‌గేష్‌పూర్ లేదా మల్కాపూర్ నుంచి గౌతాపూర్ మార్గంలో కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు 5ఎకరాల స్థలం ఇందుకు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయినా ఈ విషయంలో పురోగతి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైనా కార్మికులకు వైద్య సేవలందించాలని పలు కార్మిక సంఘాల నాయకులు కార్మిక శాఖ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా చలనం లేని రాష్ట్ర సర్కార్ స్థానిక కార్మిక సంఘాల నాయకులు 2012 సంవత్సరంలో అప్పటి కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గేను కలిసి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కోసం వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని సీసీఐ కార్మిక సంఘం నాయకుడు శరణు చెప్పారు. అయితే స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రి అటకెక్కింది.