సాగునీరందించడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సాగునీ రందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శు క్రవారం మండల పరిధిలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాలో రెండోవిడత మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సా గునీటి ప్రాజెక్టులకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నార ని అన్నారు. ఆయన ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పా రు. అంతకుముందు కడుకుంట్లలోని చింతల్‌చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.30లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
పెద్దగూడెం తొక్కుడు చెరువులోనూ ఈ పనులను ప్రారంభించారు. ఈపనులకు ప్రభుత్వం నుంచి రూ.36లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ అవినీ తికి ఆస్కారం లేకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం మండ ల పరిధిలోని మెంటెపల్లి గ్రామం నుంచి 44వ జాతీయ రహదారి వరకు చేపట్టనున్న బీటీరోడ్డు పనులను ప్రారంభిం చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాద వ్, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీలు నర్సిం హ, మనెమ్మ, సర్పంచ్ జానకి, వనపర్తి మున్సిపల్‌చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, నాయకులు మాణిక్యం, యోగానందరె డ్డి, వాకిటి శ్రీధర్, బుచ్చన్న, తిరుపతయ్య, ధర్మారెడ్డి, రాము, బాల్యనాయ క్, ఐబీ అధికారులు పాల్గొన్నారు.