mla chinnareddy
-
'సర్వే బోగస్, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయం'
హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే అంతా బోగస్ అని ఆయన కొట్టిపారేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని చిన్నారెడ్డి శుక్రవారమిక్కడ ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలనలో విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగస్తులు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. సర్వేలతో కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ప్రజలకు చెవిలో పూలు పెట్టారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. సర్వేలో గెలుస్తున్నామంటున్న కేసీఆర్ తన పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరని చిన్నారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక బడ్జెట్ సమావేశాలను 14 రోజులకు కుదించడం దారుణమని చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో 30 రోజులకు ఎప్పుడూ తక్కువ నిర్వహించలేదని, బీఏసీ సమావేశానికి సీఎం డుమ్మా కొట్టడంతోనే ప్రభుత్వ తీరుకు అద్ధం పడుతోందని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఒక రోజుకు కుదించడం కుట్ర అని ఆరోపించారు. దీనివల్ల సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందంటూ ప్రభుత్వం సభనుంచి పారిపోతోందని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగడతామని, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం చేసిన సర్వే బోగస్, హాస్యాస్పదంగా ఉందన్నారు. -
వైఎస్‌తోనే ప్రాజెక్టులకు పునాది
గోపాల్పేట : వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేఎల్ఐ, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు పునాది వేశారని ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గుడిపల్లిగట్టు దగ్గర కేఎల్ఐ మూడో లిఫ్టు వద్ద మోటారుతో నిర్వహించిన ట్రయల్ రన్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒకేరోజు జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆయన మరణాంతరం ఏడేళ్లపాటు పనులు ముందుకు సాగలేదన్నారు. కేఎల్ఐ మాదిరిగా మిగతా మూడు ప్రాజెక్టుల్లోనూ మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీటిని తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం సోర్సుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమలో నాగపూర్ సర్పంచ్ పాపులు, కాంగ్రెస్ నాయకులు శంకర్‌రెడ్డి, సురేష్‌గౌడ్, మండల కో–ఆప్షన్ సభ్యుడు సుల్తాన్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరందించడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తి రూరల్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సాగునీ రందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శు క్రవారం మండల పరిధిలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాలో రెండోవిడత మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సా గునీటి ప్రాజెక్టులకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నార ని అన్నారు. ఆయన ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పా రు. అంతకుముందు కడుకుంట్లలోని చింతల్‌చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.30లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. పెద్దగూడెం తొక్కుడు చెరువులోనూ ఈ పనులను ప్రారంభించారు. ఈపనులకు ప్రభుత్వం నుంచి రూ.36లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ అవినీ తికి ఆస్కారం లేకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం మండ ల పరిధిలోని మెంటెపల్లి గ్రామం నుంచి 44వ జాతీయ రహదారి వరకు చేపట్టనున్న బీటీరోడ్డు పనులను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాద వ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీలు నర్సిం హ, మనెమ్మ, సర్పంచ్ జానకి, వనపర్తి మున్సిపల్‌చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, నాయకులు మాణిక్యం, యోగానందరె డ్డి, వాకిటి శ్రీధర్, బుచ్చన్న, తిరుపతయ్య, ధర్మారెడ్డి, రాము, బాల్యనాయ క్, ఐబీ అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్‌కు తరలింపు
హైదరాబాద్ : మాజీమంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ....పోలీసులు మంగళవారం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నారెడ్డి ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు చికిత్స నిమిత్తం నిమస్కు తరలించారు. మరోవైపు దీక్ష విరమించాలని పార్టీ నేతలతో పాటు, పోలీసులు విజ్ఞప్తి చేసినా చిన్నారెడ్డి పట్టు వీడలేదు. దీంతో పోలీసులు ఆయనపై 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.