వైఎస్‌తోనే ప్రాజెక్టులకు పునాది | ysr started projects | Sakshi
Sakshi News home page

వైఎస్‌తోనే ప్రాజెక్టులకు పునాది

Published Wed, Sep 7 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

ysr started projects

గోపాల్‌పేట : వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేఎల్‌ఐ, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకు పునాది వేశారని ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గుడిపల్లిగట్టు దగ్గర కేఎల్‌ఐ మూడో లిఫ్టు వద్ద మోటారుతో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒకేరోజు జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు.
 
ఆయన మరణాంతరం ఏడేళ్లపాటు పనులు ముందుకు సాగలేదన్నారు.  కేఎల్‌ఐ మాదిరిగా మిగతా మూడు ప్రాజెక్టుల్లోనూ మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీటిని తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం సోర్సుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమలో నాగపూర్‌ సర్పంచ్‌ పాపులు, కాంగ్రెస్‌ నాయకులు శంకర్‌రెడ్డి, సురేష్‌గౌడ్, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు సుల్తాన్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement