'నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు..' | governor narasimhan in national voters day celebrations | Sakshi

'నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు..'

Jan 25 2018 1:41 PM | Updated on Jan 25 2018 1:41 PM

governor narasimhan in national voters day celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. 'నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు.. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు.. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు.. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు..' అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement