మీడియాతో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. చిత్రంలో శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్, ఇందిరా శోభన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడులు, మద్యం షాపుల నియంత్రణ వంటి అంశాలను లోతుగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటా మని తమకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీనిచ్చారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాల గురించి గవర్నర్‌కు వివ రించామన్నారు. రాష్ట్రంలో జరిగే నేరాలన్నింటికి కూడా కారణమైన మద్యాన్ని నియంత్రించకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కష్టతరమవుతుం దని ఆమె దృష్టికి తీసుకొచ్చామన్నారు.
శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, వినయ్‌కుమార్, ఇందిరాశోభన్ తదితరులు వినతి పత్రం సమర్పించారు. కాగా, బెల్ట్‌షాపులు అంటే ఏంటని భట్టిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గవర్నర్‌ను కలిసే వారి జాబితాలో తమ పేర్లు లేకపోవడం పట్ల పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య కినుక వహించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment