మోమిన్‌పేట: అనుకున్నది ఒక్కటైతే, అయ్యింది మరొకటి అన్న చందంగా తయారైంది మత్స్యశాఖ పరిస్థితి. జిల్లాలోని చెరువుల్లో 94.68లక్షల చేప పిల్లలు వదలాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నా అందుకు తగినట్లుగా మత్య్స సహకార సంఘాల సభ్యులు ముందుకురావడంలేదు. వర్షాలు కురిసి జిల్లాలోని అన్ని చెరువులు, ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో మత్స్యశాఖ రూ.లక్షలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నా సంఘం సభ్యులు స్పందించడంలేదు. ఇప్పటి వరకు 50 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసిన అధికారులు ఇంకా లక్ష్యం చేరుకునేందుకు 44.68 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. మూడు రకాల చేప పిల్లలను ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు నుంచి నాణ్యమైన రహు, బంగారు తీగ, బొచ్చ రకాలు తెప్పిస్తున్నారు. ఒక్కో చేప పిల్లను 0.56 పైసలకు కొంటోంది.
మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. అయినా సంఘ సభ్యులు చేపల పంపకం పట్ల ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 93 సహకార సంఘాలు, అందులో 4380 మంది సభ్యులు ఉన్నారు. 92 నీటి పారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులుండగా పంచాయతీల పరిధిలో మరో 600ల చెరువులు ఉన్నాయి. మత్స్య సహకార సంఘాలతో పాటు సభ్యులను అభివృద్ధి చేయాలని ఒక పక్క, ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు చెరువుల్లో చేపలను వదులితేనే అవి ఆరు నెలల్లో పెద్దవిగా పెరిగి అమ్మకానికి వస్తాయని, లేనిఎడల వేసవిలో చెరువుల్లో నీరు ఎండిపోయి చేపల ఎదుగుదల మందగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకోసం సహకార సంఘం సభ్యులను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా మత్య్సశాఖ అధికారి రజని చెబుతున్నారు.
రెండు లక్షలు తీసుకెళ్తున్నా..
దౌల్తాబాద్ పెద్ద చెరువులో నీరు నిండుగా ఉంది. మూడు రకాలైన రహు, బంగారు తీగ, బొచ్చలను చేప పిల్లలు రెండు లక్షలు తీసుకెళ్తున్నా. మా చెరువులో పెరిగిన చేప బహు రుచిగా ఉండడంతో పాటు తొందరగా ఎదుగుతుంది.
– బీమప్ప పెద్ద చెరువు సహకార సంఘం సభ్యుడు, దౌల్తాబాదు
అప్రమత్తం చేస్తున్నా..
లక్ష్యాన్ని చేరుకునేందుకు మత్స్య సహకార సభ్యులను అప్రమత్తం చేస్తు న్నా. వారికి వీలున్నప్పు డే వస్తున్నారు. వర్షాలు అలస్యంగా కురవడంతో ఇప్పుడిప్పుడే చెరువుల్లోకి నీరు వçచ్చి చెరుతోంది. చేప పిల్లలను వేయాల్సిన సమయం వచ్చింది. ఆలస్యమైతే వేసవిలో ఇబ్బందులు తప్ప వు. లక్ష్యాన్ని చేరుకొంటాం.
– రజని, జిల్లా మత్స్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment