- 68 పీఏసీఎస్‌ల ద్వారా 100 కేంద్రాలు
- సొసైటీలకు రూ.3.12 కోట్ల ఆదాయం
- మక్కల కొనుగోలుతో మరో రూ.35 లక్షలు
హన్మకొండ సిటీ : రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు వారి కొనుగోళ్లు సులువుగా పూర్తయేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, జీసీసీల ద్వారా ధాన్యం, మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేస్తున్న కేంద్రాలతో రైతులకు లాభం చేకూరుతోంది. అంతేకాకుండా సంఘాలకు కూడా కమీషన్ రూపంలో ఆదాయం సమకూరుతోంది.
పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో..
జిల్లాలో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఉండగా ఈ రబీలో 68 సంఘాల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఐకేపీల ద్వారా మరో 127 కేంద్రాలు, జీసీసీల ద్వారా 10 కేంద్రాలు కూ డా ఏర్పాటయ్యాయి. ఇందులో పీఏసీఎస్ కేంద్రాల్లో రూ.125 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, కమీషన్ రూ పంలో సంఘాలకు రూ.3.12 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా రూ.36.37 కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేయ గా, రూ.35 లక్షల ఆదాయం సమకూరింది.
2011-2012 ఖరీ ఫ్ సీజన్‌లో 16 సహకార సంఘాల ద్వారా 22 కేంద్రాల్లో ధా న్యం కొనుగోలు చేపట్టా, ప్రతి సీజన్‌కు కేంద్రాల సంఖ్య పెంచుతున్న అధికారులు ప్రస్తుత రబీలో 100కు చేర్చారు. ఇదే తీరులో కొనుగోలు చేసిన ధాన్యం విలువు, సంఘాల ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇటు సంఘాలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, మార్కెట్లు, వ్యాపారుల వద్దకు వెళ్లే ఇబ్బంది రైతులకు తప్పింది.
అంతేకాకుండా నేరుగా అమ్ముకునే సౌకర్యం రావడంతో దళారుల దోపిడీ నుంచి బయటపడినట్లయింది. కాగా, ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ము చెల్లించేందుకు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో డీసీఓ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధా న్యం మిల్లులకు తరలింపు, ఆ తర్వాత రైతులకు డబ్బు చెల్లింపు వివరాలను పర్యవేక్షించారు.
ఇబ్బందులను అధిగమిస్తే..
పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం, మక్కల కేంద్రాల ఏర్పాటుతో ఇరువర్గాలకు లాభం చేకూరుతున్నా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఖరీఫ్ నాటిని ఆ ఇబ్బందులను సమీక్షించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మరింత పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. వర్షాకాలంలో పంట దిగుబడులు వస్తున్నందున ధాన్యం ఆరబెట్టడానికి కల్లాల నిర్మాణం, సరుకు నిల్వ చేసేందుకు గోదాం లు నిర్మించాల్సిన అవసరముంది.
నాబార్డు సాయంతో ఇప్పటికే కొన్ని సహకార సంఘాల పరిధిలో గోదాంలు నిర్మిస్తున్నా, అన్ని సంఘాలకు దీన్ని విస్తరిస్తే ధాన్యం నిల్వ చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు, గోదాంల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటి నుంచే పనులు ప్రారంభిస్తే సీజన్ ముగిసే నాటికి అం దుబాటులోకి వస్తాయని ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
సొసైటీలను రైతులకు చేరువ చేశాం...
ధాన్యం, మక్కల కొనుగోలు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతులకు మరింత చేరువ చేశాం. రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా మోసాల నుంచి బయటపడ్డారు. అరువుకు ధాన్యం ఇచ్చి వ్యాపారుల చుట్టూ తిరగాల్సి రావడం, దళారుల దోపిడీ వంటివి తప్పాయి. అయి తే, ప్రస్తుతం ఎదురైన కొన్ని ఇబ్బందులను వచ్చే ఖరీఫ్‌కు అధిగమిస్తాం.
- సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి