శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జూన్ 2న శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించే ఈ సంబరాల్లో భాగంగా జూన్ 2న ఉదయం 8 గంటలకు శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.వీరారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పీజీ పరీక్షలు వాయిదా
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా శాతవాహన పరిధిలో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షలు వారుుదా వేసినట్లు ఎస్‌యూ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. జూన్ 10 నుంచి నాలుగో సెమిస్టర్, 11 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలు జూన్ 9 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ బాధ్యుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రేపు ‘శాతవాహన’లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Published Sun, Jun 1 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement