june 2nd
-
ఉపాధి పనుల్లో తెలంగాణ సంబురాలు
జూన్ 2న పని ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు ఒక్కో కూలీకి రూ.10 చొప్పున రూ.1.60 కోట్లు విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు ఇది ‘తీపి’ కబురు. తెలంగాణ సంబురాల్లో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు పంచాలని అధికారులకు సూచించింది. మిఠాయి కొనుగోలు నిమిత్తం ఒక్కో కూలీకి రూ.10 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం పనులకు వస్తున్న 16 లక్షల మంది కూలీల కోసం రూ.1.60 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. సంబరాల ఏర్పాట్ల కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) ఖాతాలకు నిధులను జమ చేసినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఎంపీడీవోలకు గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితారామచంద్రన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంబురాలకు మార్గదర్శకాలివీ... గ్రామం వారీగా ఉపాధి కూలీల జాబితాను రూపొందించాలి సంబరాల నిర్వహణ నిమిత్తం ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి గ్రామాల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులకు ప్రోగ్రాం అధికారులు మిఠాయిలను అందజేయాలి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల సహకారంతో సంబరాల ఏర్పాట్లు చేసుకోవాలి నాణ్యమైన మిఠాయిని మండల కొనుగోలు కమిటీ ద్వారానే కొనుగోలు చేయాలి జూన్ 2న పని ప్రదేశంలోనే ఉపాధి కూలీలందరికీ మిఠాయిలు పంచిపెట్టాలి ఉపాధి హామీ ప్రయోజనాలపై కూలీలకు అవగాహన కల్పించాలి ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద చేసిన పని వివరాలను తెలియజేయాలి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి జిల్లా స్థాయిలో డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ సమీక్షించాలి. ఆపై నివేదికను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపాలి -
జూన్ 2 ఉద్యోగులకు డెడ్ లైన్
-
సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
హైదరాబాద్ : వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07201 నెంబర్ గల రైలు కాకినాడలో జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి జూన్ 2న (07202) సికింద్రాబాద్‌లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. -
రేపు ‘శాతవాహన’లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జూన్ 2న శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించే ఈ సంబరాల్లో భాగంగా జూన్ 2న ఉదయం 8 గంటలకు శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.వీరారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ పరీక్షలు వాయిదా తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా శాతవాహన పరిధిలో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షలు వారుుదా వేసినట్లు ఎస్‌యూ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. జూన్ 10 నుంచి నాలుగో సెమిస్టర్, 11 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలు జూన్ 9 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ బాధ్యుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
ఊరిస్తున్న రుణ మాఫీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో రుణమాఫీ రైతులకు ఆశలూరిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనుండటంతో... తెలంగాణలో కొలువుదీరే తొలి ప్రభుత్వం అమలు చేసే రుణమాఫీ విధానం ఎలా ఉంటుంది? గత ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయా? పాత బకాయిలు కూడా మాఫీ అవుతాయా? బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు ఈ విధానం వర్తిస్తుందా? వ్యవసాయ అనుబంధ రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారా? కేవలం రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారినే అర్హులుగా పరిగణిస్తారా? ఎంత ఎక్కువ మొత్తం రుణ బకాయిలు ఉన్నా సరే.. అందులో రూ.లక్ష మాఫీ చేస్తారా? ఈ వరుస సందేహాలన్నీ ఇటు రైతులను.. అటు బ్యాంకర్లను వెంటాడుతున్నాయి. మరోవైపు పాత రుణాలు మాఫీ చేస్తే తప్ప కొత్తగా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఖరీఫ్‌లో పెట్టుబడులు సమకూర్చుకునేందుకు తిప్పలుపడుతున్న రైతులు కొత్త రుణాలకు బ్యాంకులను ఆశ్రయించేందుకు వెనుకా ముందాడుతున్నారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులన్నీ కలిపి జిల్లాలో మొత్తం 386 బ్యాంకు బ్రాంచీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,77,663 మంది రైతులు గత ఏడాది పంట రుణాలు తీసుకున్నారు. మార్చి 31 నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రైతుల పేరిట ఉన్న పంట రుణాల మొత్తం రూ.2,700 కోట్లు. 2013-14 సంవత్సర కాలంలో పంపిణీ చేసిన పంట రుణాల మొత్తం రూ.1,800 కోట్లు. మిగతా రూ.900 కోట్లు అంతకుముందు తీసుకున్న పంట రుణాల బకాయిలు. పంట రుణాలే కాకుండా వ్యవసాయ పరికరాలు, ఆధునిక పరికరాలు, ట్రాక్టర్లు, అనుబంధ యూనిట్ల పేరిట జిల్లాలో మరో రూ.1,422 కోట్ల వ్యవసాయ సంబంధిత రుణాలు (టర్మ్ లోన్స్) పంపిణీ అయ్యాయి. 1,09,714 మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. వీటిలో రూ.51 కోట్లు పాత బకాయిలున్నాయి. జిల్లాలోని బ్యాంకుల్లో దాదాపు రూ.284 కోట్ల విలువైన బంగారం తాకట్టులో ఉంది. వ్యవసాయంతో పాటు సొంత అవసరాలకు దాదాపు 28,083 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గత ఏడాది బంగారంపై పంపిణీ చేసిన రుణాల విలువ రూ.70 కోట్లుగా బ్యాంకర్ల నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో రూ.4122 కోట్ల రుణాలు రైతుల పేరిట బ్యాంకుల్లో బకాయిలున్నాయి. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడితే తప్ప ఇందులో ఎంత రుణం మాఫీ అవుతుంది.. ఎంత మంది రైతులు లబ్ధి పొందుతారనేది చెప్పలేమని లీడ్‌బ్యాంక్ మేనేజర్ చౌదరి అభిప్రాయపడ్డారు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలోనే బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. కలెక్టర్ సూచన మేరకు ఈ కార్యక్రమం వాయిదా పడింది. కోడ్ తొలిగిపోవటంతో జూన్ 2న వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసేందుకు లీడ్‌బ్యాంక్ సన్నద్ధమైంది. -
తెలంగాణ ఆవిర్భావం.. ఆనందపరవశం
-
జూన్ 2 తర్వాతే సీఎంగా ప్రమాణం ... కేబినెట్
-
జూన్ 2 తర్వాతే సీఎంగా ప్రమాణం ... కేబినెట్
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం గులాబి మయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శాసనసభా పక్షం శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమవనుంది. ఆ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నారు. అనంతరం సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం, కేబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. అయితే హరీశ్ రావు, ఈటెల రాజేంద్రలతోపాటు కేటీఆర్‌ను కూడా కేబినెట్లోకి తీసుకోవాలని పార్టీ శ్రేణులు కేసీఆర్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో ఆ అంశంపై చర్చ జరగుతుంది. అలాగే లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కడియం శ్రీహరిని ఈ సమావేశంలో ఎన్నుకుంటారు. సీఎంతో సహా18 మందితో కేబినేట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
జూన్ 2 తర్వాతే చూద్దాం!
పరిశ్రమల ఏర్పాటుకు వేచిచూస్తున్న పారిశ్రామికవేత్తలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. జూన్ 2న ఇరు ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాలు ప్రకటించే పారిశ్రామిక విధానాలు, రాయితీలను పరిశీలించిన తర్వాతే యూనిట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజకీయ సుస్థిరత కూడా ఉంటుందని, అప్పుడు పరిశ్రమలు సజావుగా సాగుతాయని పారిశ్రామికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన కొన్ని కంపెనీలు కూడా ఇదే ఉద్దేశంతో ముందడుగు వేయడంలేదు. సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు పదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే, రాయితీలు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు కొత్త రాష్ట్రాల్లో నూతన తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, అదనపు రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘అనంతపురం జిల్లాలో పెయింట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకొచ్చింది. భూమితో పాటు ఇతర రాయితీల సదుపాయాల కోసం మా వద్దకు వచ్చింది. అయితే, రాష్ర్ట విభజన అనంతరం వచ్చే కొత్త రాయితీల విధానాన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని ఆ కంపెనీ నిర్ణయించుకుంది. ఇదొక్కటే కాదు.. అనేక ఇతర పరిశ్రమలు కూడా యూనిట్ల ఏర్పాటుపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి’ అని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.