మట్టెవాడ (వరంగల్) : సంస్కరణలు-ప్రపంచీకరణ అవలంబించే దేశాలకు గ్రీస్ ఎన్నికలు ఓ గుణపాఠమని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ ఓంకార్ భవన్‌లో పార్టీ జిల్లా కమిటీ సమావేశం పరికిరాల భూమయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ఇటీవల గ్రీస్ దేశంలో జరిగిన ఎన్నికలలో సిరోజా వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఇది భారత పాలక పెట్టుబడిదారులకు గుణపాఠమని ఆయన తెలిపారు. సామ్రాజ్యవాది అయిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పెద్దపీట వేయడం శోచనీయమన్నారు. మార్చి 24 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఎంసీపీఐ(యూ) మూడవ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రపంచీకరణ అవలంబించే దేశాలకు గ్రీస్ ఎన్నికలు గుణపాఠం
Published Sat, Feb 7 2015 6:11 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement