
ముషీరాబాద్: ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే అతని జీవన విధానం మారిపోతుంది. షడ్రసోపేతమైన భోజనం..స్టార్ హోటల్‌కు తగ్గకుండా విలాసవంతమైన జీవనం వారి సొంతం అవుతుంది. అలాంటిది ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే అయితే..? ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు. కానీ నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శమైన గుమ్మడి నర్సయ్య మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద పేదల కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనాన్ని ఆరగించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన సైకిల్‌పై తిరగడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తినడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment