
బెజ్జంకి (సిద్దిపేట): ఒక్కో దేవుడు ఒక్కో వరమిస్తే అన్ని వరాలిచ్చే దేవుడు శ్రీచిన్నకేశవస్వామి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామమైన తోటపెల్లిలో కొత్తగా నిర్మించిన శ్రీచెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేశవుడు అంటే నారాయణుడు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువైన తోటపెల్లి ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. స్వామి మన గ్రామంలో కొలువుదీ రడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామి కరకమలములతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
‘తోటపెల్లిలో బొ డ్రాయిని ప్రతిష్టించుకున్నాం. రామాలయం నిర్మిం చుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలను పునరుద్ధరించడం, నాటి సంప్రదాయ పరంపర కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేయడం ఎంతో పుణ్యం’ అని అన్నారు. చెన్నకేశవస్వామి ఆలయాలు రెండున్నాయని.. ఒకటి మిట్టపల్లిలో మరోటి తోటపెల్లిలో ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లా ప్రాచీన ఆల యాలకు ప్రసిద్ధి అని వాటి పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా లోని సీఎం సెంటిమెంట్ ఆలయం కోనాయపల్లె వేంకటేశ్వరస్వామి, కొమురవెల్లి మల్లన్న, నాచారం, బెజ్జంకిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను ఆయన అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment