ద్రోహివి కాకుంటే ఆర్డీఎస్ ఎత్తు పెంచాలి
ద్రోహివి కాకుంటే ఆర్డీఎస్ ఎత్తు పెంచాలి
Published Wed, Jul 9 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణద్రోహి కాకుంటే ఆర్డీఎస్ తూముల ఎత్తును పెంచే పనులను చేపట్టాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ తూములను ఏపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తున్నారని, దీనివల్ల నష్టం జరుగుతున్నదంటూ కాంగ్రెస్‌కు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ మంగళవారం మంత్రి హరీశ్‌రావును కలిశారు.
దీంతో వెంటనే స్పందించిన హరీశ్ ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమతోనూ, కేంద్ర జలసంఘం ఉన్నతాధికారి పాండ్యాతోనూ ఫోనులో మాట్లాడారు. అనంతరం విలేకరులతో హరీ్‌శ్ మాట్లాడుతూ, ఆర్డీఎస్ గేట్ల పెంపు అక్రమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ దీనికి 15.9 టీఎంసీల అవార్డు కూడా ఇచ్చిందన్నారు.
Advertisement