సాగునీటి వివాదాలపై చర్చిద్దాం
ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్‌రావు ఫోన్
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు లేకుండా ఆర్డీఎస్ సహా ఇతర ప్రాజెక్టులపై చర్చలకు రావాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచిం చారు. ఈ మేరకు హరీశ్‌రావు బుధవారం ఉదయం ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన దేవినేని, అవసరమైతే సీఎంల స్థాయి లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో లభ్యత నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంచుకునే విషయంలో చర్చలు అవసరమని ఆయ న అభిప్రాయపడ్డా రు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత వా టా రావాలన్న దాని పై చర్చలతో స్పష్టత వస్తుందని దేవినేని అన్నారు. కాగా, ఆర్డీఎస్ పనుల ఆధునీకరణపై హరీశ్‌రావు గత నెలలో బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన దేవినేనికి కూడా ఫోన్ చేసి పనుల వేగిరానికి సహకరించాల్సింది గా కోరారు. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావు ఏపీ మంత్రికి మరోసారి ఫోన్ చేశారు.