హరీష్ రావు(ఫైల్)
సాక్షి, మెదక్ : రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పనిచేసి వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రత్యేకంగా టోకెన్ జారీ చేయాలని, కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయోద్దని సూచించారు. శనివారం మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో పండిన వరి ధాన్యం కోతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరికోత యంత్రాలు సిద్ధం చేయాలి. 350 వరికోత యంత్రాలు అవసరం. యంత్రాలకు డ్రైవర్స్, మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా చూడాలి. అధికారులు, యంత్రాల అసోసియేషన్ వారితో సమావేశం ఏర్పాట్లు చేసి మాట్లాడాలి. ధాన్యం కొనుగోలుకు సరిపడా గన్నీ బ్యాగులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాల’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment