hareesh rao
-
1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
సాక్షి, చేవెళ్ల: తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 50 వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు కోసం ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి హరీశ్ హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఒక అబద్ధాన్ని పదేపదే చెబుతూ అది నిజం అవుతుందని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అడిగిన ప్రశ్నకు తానే స్వయంగా సమాధానం చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పట్టభద్రులు బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో కోత విధిస్తూ, పెట్రో ధరలు పెంచుతూ ప్రజలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డగా పీవీ నరసింహారావు ఢిల్లీని శాసించి తెలుగువాడి ఖ్యాతిని ఇనుమడింపజేశారని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరైతే కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
‘అలాంటి ధాన్యం కొనుగోలు చేయోద్దు’
సాక్షి, మెదక్ : రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పనిచేసి వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రత్యేకంగా టోకెన్ జారీ చేయాలని, కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయోద్దని సూచించారు. శనివారం మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో పండిన వరి ధాన్యం కోతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరికోత యంత్రాలు సిద్ధం చేయాలి. 350 వరికోత యంత్రాలు అవసరం. యంత్రాలకు డ్రైవర్స్, మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా చూడాలి. అధికారులు, యంత్రాల అసోసియేషన్ వారితో సమావేశం ఏర్పాట్లు చేసి మాట్లాడాలి. ధాన్యం కొనుగోలుకు సరిపడా గన్నీ బ్యాగులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాల’’ని అన్నారు. -
మార్కెటింగే పెద్ద సవాల్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెటింగ్ పెద్ద సవాల్‌గా మారిందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వ్యవసాయ ఆధారిత రంగాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎగుమతి రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని, కానీ రైతుకు ఇప్పుడు ప్రధాన సమస్య మార్కెటింగ్ అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారానే అదనపు విలువ జోడించినట్లవుతుందన్నారు. దీనివల్లే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. 2020–21 రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను నాబార్డు సిద్ధం చేసింది. దాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ ఫోకస్ పేపర్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు దాని ఆధారిత రంగాలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ అంతే ప్రోత్సహించాలని నాబార్డును కోరారు. ఈ ఏడాది నాబార్డ్ హైటెక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా, ఇప్పుడు సీఎంగా ఉన్నా రైతుగా నిత్యం పనిచేస్తున్నారని చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయానికి 30 శాతం.. బడ్జెట్ మొత్తంలో 30 శాతానికి పైగా వ్యవసాయ రంగానికే ఖర్చు చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. అందులో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుబీమా కోసం రూ.1,136 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గతంలో రుణమాఫీ అమలుచేశామని, ఇప్పుడు కూడా అందుకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీంతో రైతుల్లో భరోసా ఏర్పడిందన్నారు. దీంతో ఉన్నత చదువులు చదివినవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల రెవెన్యూ రికార్డులను 96 శాతం పరిష్కరించామని, మరో 4 శాతం లీగల్ కేసులకు సంబంధించినవని చెప్పారు. పంట రుణాలకే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని నాబార్డును, బ్యాంకర్లను కోరారు. గొర్రెల పంపిణీ వల్ల వాటి నుంచి 80 లక్షల కొత్త గొర్రె పిల్లలు పుట్టినట్లు వివరించారు. వీటి విలువ రూ.3500 కోట్లు ఉంటుందని తెలిపారు. మత్స్య సొసైటీలు దేశంలో అధికంగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 64 కోట్ల చేప పిల్లలను, 3.4 కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో ఉచితంగా వేశామన్నారు. ఫిషరీస్‌లో దేశంలోనే కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టామన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత.. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు. పెద్ద రైతులకు ఉపయోగపడే యంత్రాలు కాకుండా, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా యంత్రాలకు సహకారం అందించాలని చెప్పా రు. వరి నాట్లు, కలుపు తీసే యంత్రాల కోసం ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, దీనికి బ్యాం కులు సహకరించాలని కోరారు. వ్యవసాయ రంగానికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి, వ్యవసాయ యంత్రాలకు ఎక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం సరికాదన్నారు. కాబట్టి తక్కువ వడ్డీకే యంత్రాలు కొనుగోలు చేసేలా సౌలభ్యం కల్పించాలన్నారు. నాబార్డు నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో శిల్పారామం ఏర్పాటు: హరీశ్ రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విపంచికి వినయ నమస్కారం. సిద్దిపేటలో విపంచి కళానిలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో విపంచి కళానిలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కవులకు, కళాకారులకు నిలయమన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సిద్దిపేట పర్యాటక ప్రాంతంగా మారిందన్నారు. సిద్దిపేటలో కోమటి చెరువు, ఓపెన్ ఎర్ ఆడిటోరియం, తో పాటుగా విపంచి కళానిలయం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విపంచి కళానిలయం ఏర్పాటులో సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రూ.6.5 కోట్లతో ఈ కళానిలయాన్ని నిర్మించామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కళాప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వైష్ణవి విజ్ఞేశ్, రామాచారి, శ్రీకాంత్,తదితర ప్రముఖల కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విపంచి అంటే బ్రహా్మదేవుని వీణా అని ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బేవరెజ్ చైర్మన్ దేవిప్రసాద్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, రఘోత్తంరెడ్డి, భాష సంస్కృతికశాఖ డైరెక్టర్ హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పార్టీలకు భవిష్యత్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ పార్టీలకు ఉనికి లేకుండా పోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దక్షిణాదిన పట్టు కోల్పోతున్నాయన్నారు. మెదక్ నియోజకవర్గంలో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ నేతలతో కలసి సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణలో పాయలన్నీ ప్రధాన నదిలో కలిసినట్లు అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు కనుకే టీఆర్ఎస్లో అన్ని పార్టీల నేతలు చేరుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి చేరికతో టీఆర్ఎస్ నర్సాపూర్‌లో బలోపేతమవుతుంది. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్‌లలో టీఆర్ఎస్కు లక్ష మెజారిటీ చొప్పున వస్తుంది. మెదక్ ఎంపీ సీటులోనే టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ వచ్చేలా ఉంది. కరీంనగర్లోనూ భారీ మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. మెదక్‌లో భారీ మెజారిటీ వస్తే కొంత క్రెడిట్ నాకు కూడా ఇవ్వండి (సునీతా లక్ష్మారెడ్డిని పార్టీలో చేర్పించినందుకు). అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో తొమ్మిది సీట్లు గెలవడానికి హరీశ్‌రావు కృషే కారణం. జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలకు దక్షిణాదిన ఉనికే లేకుండా పోతోంది. పట్టుమని పది సీట్లు కూడా దక్షిణాదిలో గెలవని పార్టీలు కూడా జాతీయ పార్టీలేనా? బీజేపీ నేతలు మాటలు పెద్దగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేస్తానో అని చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 160–170 సీట్లకు మించి రావు. కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసించవచ్చు. ఢిల్లీలో తెలంగాణ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే మనం అనుకున్న అన్ని ప్రాజెక్టులు సాధించుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే జాతీయ పాలసీ అంటూ తెలంగాణకు చేసేదేముండదు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కోసం ఆలోచిస్తారు. 37 ఏండ్ల టీడీపీ తెలంగాణలో పోటీ చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్: హరీశ్‌రావు తెలంగాణలో ఇక జై కాంగ్రెస్ నినాదం మరవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని మరోమారు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సునీతా లక్ష్మారెడ్డి లాంటి నాయకులకే కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం పోయిందని, కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని ఆ పార్టీ నాయకులకు అర్థమైందన్నారు. ‘‘దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అయింది. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రెండు పార్టీలు ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఒకటి రెండు చోట్ల డిపాజిట్లు వస్తే ఆ పార్టీలకు అదే గొప్ప. ఈ ఎన్నికల్లో మనకు మనమే పోటీ. జహీరాబాద్‌లో రాహుల్ సభకు జనం లేరు. 15 వేల కుర్చీలు వేస్తే 5 వేల మంది కూడా రాలేదు. మెదక్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌కు వెయ్యి మంది కూడా వెంటలేరు. కాంగ్రెస్ పార్టీకి చివరకు కార్యకర్తలు కూడా కరువయ్యారు. మోదీకిగానీ రాహుల్కుగానీ తెలంగాణ మీద ప్రేమ లేదు. ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన రాహుల్... తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట చెప్పలేదు. తెలంగాణాలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీజేపీ గెలవగలిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు, చివరికి ఫ్లోర్‌లీడర్ కూడా ఓడారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతం కానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఐదేళ్లలో కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. మోదీ దానిపై మాట్లాడలేదు. నీతి ఆయోగ్ చెప్పినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వలేదు. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలంటే 16 ఎంపీ సీట్లు గెలవాలి’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
గెలుపు ఏకపక్షమే.. మెజార్టీ కోసమే మా ప్రయత్నం
సాక్షి, మెదక్: టీఆర్ఎస్ మెదక్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం శుక్రవారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని సీఎస్ఐ చర్చి వేదికగా బహిరంగ సభను తలపించేలా జరిగిన సమావేశంలో పలు ఆసక్తకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సదస్సు టీఆర్ శ్రేణుల్లో జోష్ నింపగా.. సహృద్భావ వాతావరణంలో బావబావమరుదల సవాల్ వరకు వెళ్లింది. కేసీఆర్ ప్రసంగంలో భాగంగా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, మా బావగారు అంటూ కేటీఆర్ సంభోదన.. యువకుడు, ఉత్సాహవంతుడు కేటీఆర్ అంటూ హరీశ్‌రావు పొగడ్తలతో ముంచెత్తడంతో అక్కడ ఉన్న వారు చిరునవ్వులు చిందించారు. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు: కేటీఆర్ మెదక్ జిల్లాకు వచ్చి.. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ స్థానానికి.. ఈ ప్రాంతానికి వచ్చి.. లక్ష మెజార్టీ సాధిం చిన హరీశ్‌రావు ఉన్న నియోజకవర్గానికి వచ్చి.. ఇప్పటికే రామలింగారెడ్డి ఎన్నో సార్లు ప్రాతిని ధ్యం వహించిన దుబ్బాకకు వచ్చి.. తాను కొత్త గా చెప్పేదేమీలేదని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి గారు తోడైన తర్వాత దుబ్బాకలో కాంగ్రెస్‌కు మిగిలిందేమీ లేదని పేర్కొన్నారు. దుబ్బా క ఏకపక్షమే.. మెదక్ ఏకపక్షమే మొత్తంగా చూసినట్లయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏకపక్షమైన వాతావరణమున్న ఈ నియోజకవర్గానికి వచ్చి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. అభివృద్ధిలో ముందంజ: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందని హరీశ్‌రావు అన్నారు. రెండు నెలల్లో మెదక్ రైలు వస్తుందన్నారు. గణపురం ఆనకట్ట చివరి వరకు సాగునీరందిస్తున్నామని.. నర్సాపూర్‌లో బస్ డిపో త్వరలో అందుబాటులోకి రానుందని.. దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇళ్లతో ఆదర్శంగా నిలవనుందన్నారు. గజ్వేల్ ఇప్పటికే అభివృద్ధి నమానాగా నిలుస్తోందన్నారు. ఇందులో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రసంగం సందర్భంగా హరీశ్‌రావు పేరు సంభోదించగానే పార్టీ శ్రేణులు చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. -
విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు లేఖ
విద్యార్థి మనస్సు చదువుపై లగ్నం చేసేందుకు ఇంటి వాతావరణం కీలక భూమిక పోషిస్తుంది. దీనికోసం తల్లిదండ్రులు పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి. వారి ముందు ఇంటి సమస్యలు చెప్పడం, తగవులాడుకోవడం చేయకూడదు. ప్రధానంగా విద్యార్థులపై టీవీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజులు ఇంట్లో టీవీ ఆఫ్ చేయడం మంచిది. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలి. సాక్షి, సిద్దిపేట: జిల్లా ఇప్పటికే అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. విద్యారంగంలోనూ ముందు వరుసలో ఉండాలంటే.. దానికి కొలమానం పదవ తరగతి ఫలితాలు. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వినూత్న రీతిలో గత ఏడాది చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉన్న జిల్లాను మూడవ స్థానంలోకి తీసుకురాగలిగారు. ఈ సారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్న ధ్యేయంతో హరీశ్‌రావు, విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యా శాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులతోపాటు, అన్ని విభాగాలకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ‘నాకు కావాల్సింది నూటికి నూరు శాతం ఫలితాలు.. దీనికోసం మీరు ఏమడిగినా.. ఇస్తాం.. మంచి ఫలితాలు సాధిస్తే నజరానాలు కూడా ఇస్తాం’ అని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 10/10 జీపీఏ సాధిస్తే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ. 25వేల చొప్పున నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పిల్లల భవిష్యత్తు, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని తల్లిదండ్రులకు హరీశ్‌రావు తానే లేఖను రాస్తూ.. ముందుకు వెళ్లడం గమనార్హం. నేను నేరుగా కలవలేక.. లేఖ రాస్తున్నానంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తున్నారు. లేఖ సారాంశం.. పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. జిల్లాలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలను లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థి మనస్సు చదువుపై లగ్నం చేసేందుకు ఇంటి వాతావరణం కీలక భూమిక పోషిస్తుంది. దీనికోసం తల్లిదండ్రులు పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి. వారి ముందు ఇంటి సమస్యలు చెప్పడం, తగవులాడుకోవడం చేయకూడదు. ప్రధానంగా విద్యార్థులపై టీవీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజులు ఇంట్లో టీవీ ఆఫ్ చేయడం మంచిది. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలి. కష్టమైనా ఇంట్లో పనులు మీరే చేసుకోవాలి. పిల్లలకు చదువుకునేందుకు అత్యధిక సమయం కేటాయించే వాతావరణం నెలకొల్పాలి. ప్రతీ రోజు విద్యార్థి ప్రగతిని అంచనా వేయడం.. వారిని మానసికంగా సిద్ధం చేసేలా తల్లిదండ్రులు మాట్లాడాలి. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థి చదువు గురించి ఆరా తీయాలి. ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. అయితే విద్యార్థులను సాధ్యమైనంతవరకు సెలవులు పెట్టి రోజుల తరబడి వెళ్లకుండా చూడాలి. అవసరమైతే వెళ్లకపోవడం, తప్పనిసరి అయితే వెళ్లి వెంటనే వచ్చేలా చూడాలి. ఇలా చేయడంతో విద్యార్థికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేక తరగతులకు పంపించండి.. విద్యార్థులు ఇంతకాలం చదివిన విషయాలను తర్జుమా చేసుకోవడం, వెనుకబడిన అంశాలను నేర్చుకునేందుకు ఉదయం పాఠశాల సమయానికి ముందుగా ఒక గంట, సాయంత్రం పాఠశాల సమయం పూర్తయిన తర్వాత మరో గంటసేపు విద్యార్థులను చదివించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి పిల్లలను తప్పకుండా హాజరయ్యేవిధంగా చూడండి..’ అని విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేసి, హెచ్ఎంల అకౌంట్లలో వేశామనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్నా.. నా, మన ఆలోచన అంతా మంచి ఫలితాల సాధన కోసమే.. దానికి మేం, మీరు, ఉపాధ్యాయులు, అధికారులు అందరం సమష్టిగా శ్రమిద్దాం.. రాష్ట్రంలోనే ప్రథమంగా నిలుద్దాం.. మంత్రి విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాసిన లేఖతో వారిలో ఉత్తేజం, బాధ్యత కూడా పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు పేరున పంపిన లేఖ -
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలవను : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును వ్యక్తిగతంగా కలవనని, మీడియా ద్వారానే అన్ని విషయాలు చెప్పదలుచుకున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో అది కేసీఆర్ ఇష్టమని, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగనన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ సీఎం దగ్గరవుంది కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన నిర్వాకంతోనే సింగూరు, మంజీరా ఎండిపోయిందని, తాను పదిహేను రోజులుగా చెబుతున్నా అనధికారికంగా హరీష్ నీళ్లు తీసుకెళ్లిన దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడంలేదని మండిపడ్డారు. మంజీర ,సింగూరుకు చేసిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని, ఒక్క బోరు కూడా పడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల బృందాన్ని పంపి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడుపాయల జాతరకొచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కారణంగానే ప్రస్తుత సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. హరీష్ తప్పు చేశారు కాబట్టే తన కామెంట్స్‌పై స్పందించడం లేదన్నారు. తాను చెబుతున్నవి వాస్తవాలు కాబట్టే టీఆర్ఎస్ మౌనంగా ఉందన్నారు. -
కూటమికి ఓటేస్తే శనేశ్వరమే.. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం
సాక్షి, బొమ్మలరామారం : ‘‘టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాళేశ్వరం.. కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుంది.. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి’’ అని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బొమ్మలరామారం, భువనగిరిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ద్రోహులకు, ఉద్యమకారులకు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత గెలుపును ఏ శక్తీ ఆపలేదన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తామని, కూటమికి ఓటేస్తే శనేశ్వరమే గతని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం పొందిన ఆలేరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత పాలకుల హయాంలో రైతులకు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల బాధ ఉండేదన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ రైతు బీమా పథకం లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 90 శాతం పూరైన కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా కాలేశ్వరంకు అక్కడి నుంచి షామీర్పేట్ రిజర్వాయర్ నింపి లక్షా 57 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్ డబ్బులను డబుల్ చేస్తామని, ప్రతి బీడీ కార్మికురాలికి పీఎఫ్ కార్డుతో నిమిత్తం లేకుండా రెండు వేల పింఛన్ ఇస్తామన్నారు. భిక్షమయ్యగౌడ్‌పై భూ కబ్జా కేసులుంటే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిపై తెలంగాణ ఉద్యమ కేసులున్నాయన్నారు. తెలంగాణ ద్రోహులకు ఉద్యమకారులకు జరిగే ఎన్నికల్లో ఎవరికి పట్టంకట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఏ శక్తీ సునీత గెలుపును ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఫొటో ఉంటే ఓట్లు రావని పత్రిక ప్రకటనల్లో ఆయన చిత్రాన్ని తొలగించారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకున్న ఆంధ్రాబాబు తెలంగాణకు మేలు చేస్తాడని కోదండరామ్ అనడం దారుణమన్నారు. ఆలేరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలేరుకు సాగు నీరు తేవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని పోరాటం చేశామని, ఆ కలలు సాకారం కావాలంటే టీఆర్ఎస్ గెలుపే శరణ్యమన్నారు. ఆలేరులో మిషన్ కాకతీయ ద్వారా 590 చెరువులకు మరమ్మతులు జరిగాయన్నారు. మండలం లో మునీరాబాద్, ఖాజీపేట్ వద్ద చెక్ డ్యాం నిర్మి స్తామన్నారు. షామీర్పేట్ ద్వారా సాగు నీరు అం దించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని హా మీ ఇచ్చారు. అంతకు ముందు మండల కేం ద్రం లోని గుడిబావి చౌరస్తా నుంచి సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మం డలంలోని పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్య లో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్ధా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మర్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీలు తిరుపతిరెడ్డి, గడ్డమీది స్వప్న, రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీలు జయమ్మ, రాజిరెడ్డి, ఉమరాణి, శ్రీశైలం, మన్నె శ్రీధర్, లక్ష్మి పాల్గొన్నారు. శేఖర్‌రెడ్డి గెలిస్తేనే కాళేశ్వరం ఏర్పాటు భువనగిరి : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావాలంటే పైళ్ల శేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి భువనగిరిలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పైళ్ల శేఖర్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇస్తే టీఆర్ఎస్ రూ.1000 ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దానిని రూ.2,016కు పెంచుతామన్నారు. ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరంలో రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం రావాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించిన ఘనత కేసీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. భువనగిరి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని దివంగత మంత్రి మాధవరెడ్డి తర్వాత ఆ విధంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో పైళ్ళ శేఖర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. మళ్లీ ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా 2014 ఎన్నికల మాదిరిగా మళ్లీ ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆదరిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి వనరులతోపాటు రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2,016 పింఛన్ ఇస్తామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్‌గా మార్చేందుకు చేసిన కృషి టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, అందెల లింగం యాదవ్, ఎలిమి నేటి సందీప్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న, వైస్ చైర్పర్సన్ బర్రె మహాలక్ష్మి, చందుపట్ల వెంకటేశ్వర్రావు, పంతులు నాయక్, గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, సత్తిరెడ్డి, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్‌ను దత్తత తీసుకుంటా...
సాక్షి, మాగనూర్ (మక్తల్): మక్తల్ నియోజకవర్గాన్ని ద త్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని.. ఇది నా బాధ్యతగా తీసుకుంటానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే మండలం లోని పునరావాస గ్రామాలైన నేరడగం, ఉజ్జెల్లిల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించా రు. మక్తల్ టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి మాగనూరు మండల కేంద్రంలో గురువారం రా త్రి నిర్వహించిన రోడ్డు షోలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి నడుమ జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రజలు అభివృద్ధి వైపు నిలిచి రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మండల సరిహద్దులో ఉన్న కృష్ణా నదీ జలాలను సమగ్రంగా ఉపయోగించుకుని రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది కారు.. కేసీఆరే ఊట్కూర్ (మక్తల్) : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కారు.. వచ్చేది కేసీఆరేనని ప్రజలు అంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఊ ట్కూర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడా రు. మక్తల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలం గాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత వి ద్యుత్ అందిస్తోందని చెప్పారు. అయితే, గత కాం గ్రెస్ ప్రభుత్వం మూడు గంటల కరెంటు ఇచ్చేవారని.. ఈసారి మహాకూటమి గెలిస్తే ఆరు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తారని తెలిపారు. ఇక తాము రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అదే మహాకూటమి అధికారంలోకి వస్తే సమన్వయ సమితి సంఘాలు, రైతు పెట్టుబడి సాయం ఎత్తివేస్తామని చెబుతున్నందున ప్రజలు విజ్ఞతతతో ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు. ఊట్కూర్ పెద్ద చెరువుకు నీరు ఊట్కూర్ పెద్దచెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించి మండలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఊట్కూర్‌లో రైతు బజార్ ఏర్పాటు, బస్టాండ్ మరమత్తులు చేపడుతామని, అంబేద్కర్ భవన్‌కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం మోహన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డి, స్టేట్ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జెడ్పీటీసీలు సరిత మధుసూదన్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, చిట్టెం సుచరిత, విఠల్‌రావు ఆర్యతో పాటు ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, సురేందర్, ఉజ్జెల్లి సూరి, అరవింద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గోవిందప్ప పాల్గొన్నారు. -
హరీష్ ఆపరేషన్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాల్లో ఉమ్మడి పాలమూరు ఒకటి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజార్టీ సాధించొచ్చన్నది అన్ని పార్టీల భావన. అందుకే మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రచార శైలిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే, కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్కు పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు ఉన్న మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఆయా నియోజకవర్గాల్లో నిరంతరం ప్రత్యేక సమీక్షలు జరుపుతున్న హరీశ్.. శనివారం గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్కు కాస్త క్లిష్టంగా ఉన్నట్లు భావిస్తున్న నియోజకవర్గాలపై ఆ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, గద్వాల్, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు సర్వే నివేదికల వెల్లడైందని చెబుతూ... గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం హరీశ్‌రావు వ్యూహ, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఈనెల 17న ఒకసారి గద్వాల్, అలంపూర్‌లో పర్యటించిన ఆయన శనివారం మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇలా మొత్తం మీద జిల్లాలో మంత్రి హరీశ్ పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్థానాల్లో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొడంగల్, గద్వాల్ వంటి చోట్ల కాంగ్రెస్ తరఫున బలమైన నేతలు ఉండటంతో... వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ రెండు నియోజకవర్గాలకు రెండు, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండా చూడాలని గట్టి పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు చోట్ల టీఆర్ఎస్లో లుకలుకలు ఉన్నట్లు తెలుస్తుండగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ట్రుబల్ షూటర్‌ను రంగంలోకి దింపారు. అదే విధంగా మక్తల్, అలంపూర్‌ల్లో కూడా గ్రూపు తగాదాల నేపథ్యంలో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మక్తల్‌లో ఏకంగా పార్టీకే చెందిన ఎం.జలందర్‌రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలనే యోచనతో హరీశ్‌రావు ప్రయత్నం చేస్తున్నారు. అలంపూర్‌లో సైతం పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి నేరుగా టికెట్ ప్రకటించడం.. పాత కేడర్‌తో కాస్త గ్యాప్ ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ హరీశ్ సరిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో ఆయన ఈనెల 17న అలంపూర్, గద్వాల్ల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థి విజయాలకు పాటుపడాలని సూచించారు. ప్రత్యేక నివేదికలు గులాబీ బాస్ కేసీఆర్‌కు రాష్ట్ర స్థాయిలో డీ.కే.అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డి తరచూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల్, కొండగల్ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగిన హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలో ఎవరు బలమైన నేతలు... ఎక్కడెక్కడ ఎవరెవరిని పార్టీలోకి తీసుకొస్తే లాభం జరుగుతుందనే అంశంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు, ప్రతీ గ్రామం చొప్పున నివేదిక రూపొందించినట్లు సమాచారం. వీటన్నింటినీ క్రోడీకరించి.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిచేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా పాలమూరు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. -
చరిత్రాత్మకం.. రైతుబీమా పథకం
సిద్దిపేటటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తీసుకువచ్చిన రైతుబంధు, జీవిత భీమా పథకం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీవితబీమా పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో తమ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ముందుంటుందని, ఇంత వరకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను రైతుల కోసం ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎంతో మంది సరైన ఆహారం లేక, ప్రమాదాల బారిన పడి, అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీని వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గుర్తించి వారిని ఆదుకోవడానికి రైతుబీమా పేరిట రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది తమ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోగా అన్యాయం చేశాయని అన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని జిల్లాలో 20 మంది రైతులు చనిపోగా అందులో 18 మందికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డీఏవో శ్రావణ్, నంగునూరు ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏవోలు పరశురాంరెడ్డి, గీత, అఫ్రోజ్ పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నంగునూరు(సిద్దిపేట): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నంగునూరు, బద్దిపడగ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలుకగా మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నంగునూరులోని ఎస్సీ కాలనీ, ఐకేపీ భవనంలో గ్రామస్తులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మండల కేంద్రం నంగునూరులో రూ. 10 లక్షలతో వైశ్య కమ్యూనిటీహాల్, రూ. 5 లక్షలతో పూసల కమ్యూనిటీహాల్, నంగునూరు నుంచి అంక్షాపూర్ వరకు రూ. 75 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేటటౌన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉపాధ్యా భవన్లో ఆదివారం రాత్రి సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 107 మందికి రూ. 96,12,412 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే జీవో నంబర్ 59 కింద 75 మంది అర్హులైన వారికి భూమి ధృవీకరణ హక్కు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మోకాళ్ల యాత్ర చేసినా నమ్మరు
నర్సాపూర్ : కాంగ్రెస్ నాయకులు మోకాళ్లపై యాత్ర చేసిన ప్రజలు, రైతులు వారిని నమ్మరని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఘనపూర్ ఆనకట్ట, సింగూరు అంటూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా సింగూరు, ఘనపూర్ ఆనకట్టల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. జిల్లా నుంచి నీటి పారుదల శాఖ మంత్రిగా సునీతారెడ్డి పని చేసినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఘనపూర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. అదంతా మరిచి నేడు జలదీక్ష, పాదయాత్ర అంటూ సునీతారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సింగూరు, ఘనపూర్ ఆనకట్టలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఘనపూర్ ఆనకట్టను పట్టించుకోనందున ఆయకట్టు 21 వేల ఎకరాల నుంచి పది వేల ఎకరాలకు తగ్గిందని విమర్శించారు. నిధులు ఎందుకు మంజూరు చేయలేదు.. తాము అధికారంలోకి రాగానే చరిత్రలో ఎపుడు లేని విధంగా ఘనపూర్ ఆనకట్టకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం సాగు 21 వేల 530 ఎకరాలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం హయాంలో సింగూరు నీళ్లు జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్‌కు తీసుకుపోయేవారన్నారు. తాము అధికారంలోకి రాగానే హైదబాద్‌కు గోదావరి నీళ్లు తెప్పించి సింగూరు నీళ్లను జిల్లాకే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 20 ఏళ్ల చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు రెండు టీఎంసీ నీళ్ల కన్న ఎక్కువ నీటిని సాగుకు ఇవ్వలేదన్నారు. తాము 2016– 17, 2017–18 సంవత్సరాల్లో మూడున్నర టీఎంసీల వంతున నీటిని సాగుకు ఇచ్చామన్నారు. వర్షాలు కురిసి ఏమాత్రం నీళ్లు వచ్చినా ఘనపూర్, నిజాంసాగర్ కింద సాగుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సునీతారెడ్డి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నపుడు మంజీర, హల్దీవాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లలో 14చెక్‌డ్యాంల నిర్మాణానికి గాను సుమారు వంద కోట్ల రూపయాలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలాఉండగా సింగూరు లిప్టును చాలా ఏళ్లు మంజూరు చేయలేదని 2008 లో లిప్టు ద్వారా నీరు ఇవవాలని ఆందోలు మండల ప్రజలు అడిగినా పూర్తి చేయలేదని ఆరోపించారు. కాగా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండెళ్లకు 120 కోట్ల రూపాయలతో సింగూరు లిఫ్టును పూర్తి చేయడంతో ఆందోలు, పుల్కల్ మండలాల్లో 30 వేల ఎకరాలకు భూముల సాగుకు నీరు అందుతుందన్నారు. సింగూరులో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాలకు గాను 5.7టీఎంసీల నీరు జిల్లాకు అవసరమవుతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే ప్రభుత్వమని రైతులకు ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ను వారు నమ్మరన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, లక్ష్మి, అశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్‌లు పాల్గొన్నారు. -
కొత్త ఏడాదిలో రైలు కూత
తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): నూతన సంవత్సరంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మధ్యలో రైలుకూత వినపడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి , రైల్వే చీఫ్ ఇంజినీర్ రమేశ్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డితో కలిసి మనోహరాబాద్, గజ్వేల్ రైల్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే మార్గాన్ని తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. అలాగే మనోహరాబాద్, గజ్వేల్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత రైల్వే అధికారులకు సూచించారు. మనోహరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు వద్ద రూ.కోటి 50లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు, అండర్‌బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల ద్వారా మనోహరాబాద్ సమీపంలోని 12 గ్రామాల ప్రజలకు అనేక మౌలిక వసతులు కలుగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులను రానున్న మూడు నెలల్లో పూర్తిస్తామని మంత్రి చెప్పారు. మనోహరాబాద్, గజ్వేల్ మధ్య రైల్వేలైన్ 31 కిలోమీటర్లు ఉండగా ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఈ రైల్వేలైన్ మార్గంలో ఉన్న అటవీశాఖ భూములకు సైతం అనుమతులు పొందినట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల అనుమతులు.. ప్రస్తుతం 17 కిలోమీటర్ల రైల్వే పనులు కూడా పూర్తి చేశామని, మరో 14 కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఈ రైలుమార్గం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. జాతీయ రహదారులపై క్రాసింగ్‌ల కోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇటీవల ఢిల్లీలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ దక్షిణ మధ్య రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో కలిసి చర్చించి తగు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే అన్ని రకాల అనుమతులను పొందినట్లు వివరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, తూప్రాన్, రాయపోల్ మండలాలకు ఉపయోగకరంగా ఉండేలా బేగంపేటలో రైల్వేస్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్స్ కమిటీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గఢా హన్మంతరావు, జెడ్పీటీసీ సుమణ పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు, చెరువుల అనుసంధానం
-
చెరువులతో ప్రాజెక్టుల చెలిమి!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్’ల ద్వారా అధ్యయనం చేయనుంది. గరిష్ట వినియోగం.. గరిష్ట ఆయకట్టు నిజానికి చిన్న నీటివనరుల కింద భారీ నీటి కేటాయింపులు ఉన్నాయి. గోదావరి బేసిన్లో 165 టీఎంసీలు, కృష్ణాలో 89 టీఎంసీలు కలిపి మొత్తంగా 254 టీఎంసీల కేటాయింపులున్నా వినియోగం మాత్రం 100 నుంచి 130 టీఎంసీలకు మించడం లేదు. వీటి కింద 24.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా మిషన్ కాకతీయకు ముందువరకు 10 లక్షల ఎకరాల్లోపే సాగు జరిగేది. కాకతీయ ఆ తర్వాత అది 15 లక్షలకు చేరినా మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. ఈ దృష్ట్యా మరింతగా నీటిని వినియోగించుకోవడంతో పాటు గరిష్ట ఆయకట్టుకి నీరు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద 44,928 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో కలిపి 29 వేల చెరువుల పునరుద్ధరణకు అనుమతులొచ్చాయి. ఇందులో 20 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్ నాటికే మిగతా చెరువుల పనులు పూర్తి చేయనున్నారు. మిగిలిన వాటిని ఐదో విడతలో చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. ఖరీఫ్‌ను త్వరగా మొదలుపెట్టొచ్చని.. పునరుద్ధరించిన చెరువులను నిత్యం నీటితో నింపడంపై దృష్టి సారించిన సర్కారు.. భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల పథకాలతో వాటిని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖను ఇటీవల సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వలు పారుతున్న ప్రాంతాలను టోఫోషీట్లపై మొదట గుర్తించాలని.. తర్వాత వాటికి దగ్గరలోని చెరువులను మార్కింగ్ చేసి కాల్వల ద్వారా నింపే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. మొత్తం ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వాటిని నింపే అవకాశం ఉందో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి లభ్యత పెరిగితే జూన్‌లో వర్షాలకు ముందే చెరువు నీటితో నార్లు పూర్తవుతాయని, వర్షాలు కురిసే సమయానికి నాట్లకు వీలవుతుందని, తద్వారా ఖరీఫ్‌ను త్వరగా చేపట్టొచ్చని సీఎం భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 7,500 గొలుసుకట్టు చెరువులను గుర్తించామని, మిగతా వాటిని గొలుసుకట్టుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని నీటి పారుదల శాఖ వెల్లడించింది. కరువును జయించవచ్చు: హరీశ్ రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటితో నింపితే కరువు పరిస్థితులను పారదోలవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్ విధానం వల్ల తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నీటితో నిండితే కరువును జయించడమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలను నివారించవచ్చు. పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. భూగర్భజలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్య తగ్గుతుంది. రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుంది’ అని హరీశ్‌రావు వివరించారు. -
అభివృద్ధిలో గజ్వేల్ ఆదర్శం
గజ్వేల్ : సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి నమూనాగా మారిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపతిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లోని మంత్రి నివాసం వద్ద టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు సౌకర్యాలకు దూరంగా ఉన్న గజ్వేల్ రూపురేఖలు కేసీఆర్ ప్రాతినిథ్యంతో మారిపోయాయన్నారు. కొద్ది నెలల్లోనే ఈ ప్రాంతానికి రైలు కూడా రాబోతుందన్నారు. ఇందుకు సంబంధించి వేగంగా పనులు సాగుతున్నాయన్నారు. గజ్వేల్‌తో పాటు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాలన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ టీఆర్ఎస్ నాయకుడు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘గట్టు’.. తెలంగాణకు మరో పచ్చబొట్టు
ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తించారు. అదే 2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలించింది. ప్రజాస్వామ్యంలో పాలించే ప్రభుత్వ వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించే పాలక పక్షాలు మాత్రం ఐదేళ్లకోమారు పరీక్షను ఎదుర్కోవాల్సిందే. అదే ప్రజాస్వామ్య వ్యవస్థకున్న చక్కటి లక్షణం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పాలక పార్టీలను మార్చేసే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటుకు ఉంది. ఇది ఇప్పటికే భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఎన్నోసార్లు రుజువయింది. పాలకపార్టీలు అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాయా లేదా ప్రజల అవసరా లను తీర్చుతున్నాయా లేదా అన్నది ముఖ్యం. తాను ఓటు వేసిన సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ఎలా పని చేస్తున్నారని ప్రజలు ప్రత్యక్షంగా, ప్రసార మాధ్య మాల ద్వారా నిత్యం గమనిస్తూనే ఉంటారు. తాము పట్టం కట్టిన పార్టీ పాలన ఎలా ఉందో బేరీజు వేసు కుంటారు. ఐదేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశంతో అటు పాలక పార్టీలకు, ఇటు ప్రతిపక్షాలకు మార్కులు వేసి ఎవరిని ఉత్తీర్ణులను చేయించాలి ఎవర్ని ఫెయిల్ చేయాలో నిర్ణయిస్తారు. అయితే 2014లో ప్రభుత్వంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికార దాహంతో రాలేదు. తెచ్చిన తెలంగాణను అందరు కలలు కంటున్న బంగారు తెలంగాణగా మార్చాలని అధి కార పీఠాన్ని అధిష్టించింది. తెలంగాణ ఉద్యమం ద్వారా వెలుగు చూసిన కడగండ్లను తొలగించడమే ధ్యేయంగా ఎన్నికల ఎజెండాను రూపొందించింది. సాగు నీరు తెలంగాణ బీడు పొలాల్లోకి రాకపోవడం వల్లే ఈ ప్రాంతం వెనకబడిందని గమనించింది. అందుకోసమే అధికార పీఠం ఎక్కిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి సారించారు. సామాజిక ఇంజనీర్‌గా మారి ఏ ప్రాంతానికి ఎలా నీరు ఇవ్వాలో ప్రాజెక్టుల రీ ఇంజ నీరింగ్ సాధ్యాసాధ్యాలపై మేధో మథనం చేశారు. అందులోంచి పుట్టుకొచ్చినవే నేటి తెలంగాణ ప్రాజె క్టులు. శరవేగంగా తెలంగాణలో ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయంటే అది వచ్చే ఎన్నికలలో విజయం కోసం కాదు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను పరిపూర్ణంగా నెరవేర్చడానికే. తెలంగాణ వస్తే పాలన చేతనవుతుందా? రాష్ట్రం మనగలుగుతుందా? అన్న వారి నోళ్లు మూతపడేలాగా పాలన కొనసాగుతు న్నది. దేశానికి దిక్సూచిగా చెప్పదగిన అభివృద్ధి పథ కాలు, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. చరిత్రను సృష్టించనున్నాయి. ప్రస్తుత అంశానికి వస్తే–ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అంశాన్ని ఇటీవలే ప్రతిపక్ష కాంగ్రెస్ తనదైన శైలిలో వివాదం చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజ లకు వాస్తవాలు తెలియవలసి ఉంది. ఏదైనా ఓ పని అప్పగిస్తే కొందరు చేసినట్లు నటిస్తారు. మరి కొందరు నిజంగా పనిచేస్తారు. ఇలా పని చేసినట్లు నటించే చరిత్ర ప్రతిపక్ష పార్టీది. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. గట్టు ప్రాజెక్టు చరిత్రే కాంగ్రెస్ నేతల అసలు చరిత్రను వెల్లడిస్తుంది. పాలమూరు ప్రాంత సాగుకు ఉపయోగపడే గట్టు ప్రాజెక్టుకు తొలి అడు గులు పడిన తీరు ఇలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవెల్ కెనాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన హయాంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. 2012 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి ర్యాలంపాడు జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలం లోని చెరువులను నింపి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేస్తామని ప్రకటించారు. అయినా ఏడాదిన్నర వరకు అనుమతులు మంజూరు చేయలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే మోక్షం కలిగింది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 3,000 ఎకరాలు చెరువు ఆయకట్టు స్థిరీకరణకు సర్వే చేయ డానికి జీవో నంబర్ 3ను 22–01–2014 నాడు విడు దల చేసింది. 3 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన సర్వే కోసం మాత్రమే రూ. 10.50 లక్షలు మంజూరయ్యాయి. ఎన్నికల ప్రకటన జారీకి ముందు 2014 ఫిబ్రవరి 22న అప్పటి మంత్రులు సైతం ఇది సర్వే చేయడానికి జారీ చేసిన జీవో మాత్ర మేనని తెలిసి కూడా గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇది ఎన్నికల ముందు ప్రజ లను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి చేసిన పని అని ఎవరికైనా అర్థమవుతుంది. రెండు నెలల్లో కేవలం సర్వే కోసం రూ. 10.57 లక్షలు మంజూరు చేసినట్లు జీవో విడుదల చేసి, నెల రోజులకి శంకు స్థాపన చేసి ఆ తర్వాతి నెలలో ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ఘనత చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సర్వే కోసం జీవో ఇచ్చి ప్రాజెక్టుకు శంకు స్థాపన చేస్తారా? సర్వే జరగలేదు, ప్రాజెక్టు డీపీఆర్ లేదు, టెండర్లు లేవు. మరి శంకుస్థాపన ఎందుకు చేశారు? ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి మరో మారు ‘గట్టె’క్కాలన్న ఆలోచన. కానీ ప్రజలు ఆ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బాధ, తెలంగాణ సోయి, తెలంగాణ ఆలోచన ఉన్న తెరాస ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంతో మేధో మథనం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చర్చించారు. అనంతరం గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండల ప్రజల ఆలోచనను అడిగి తెలుసుకున్నారు. కరవు మండలాలకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 3 వేల ఎకరాలకు నీరు ఇచ్చే పథకం సర్వే చేయించడానికి ఇచ్చిన జీవో వల్ల ఎటువంటి న్యాయం జరగదని గుర్తించి ఈ మూడు మండ లాల్లో దాదాపు 25 వేల ఎకరాల వరకు కొత్త ఆయ కట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చేలా సమగ్ర సర్వే చేయాలని సాగు నీటి శాఖను ఆదేశిం చారు. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 461 ని 2016 మే 3వ తేదీన విడుదల చేశాం. కొత్తగా ఈ ప్రాజె క్టును రూపొందించేందుకు సమగ్ర సర్వే చేయించేం దుకు 52.46 లక్షలు మంజూరు చేసి ఆ పనులను సర్వే ఏజెన్సీకి అప్పగించాం. ఇక్కడితో మా ప్రభు త్వం ఆగలేదు. ప్రాజెక్టు సమగ్ర సర్వే సమర్పించే దశలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం రిజర్వు చేసిన 5 వేల ఎకరాలను ఆయకట్టు పరిధి లోకి తేవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరికను మేం కాదనలేదు. తిరిగి మరోమారు సర్వే చేయించాం. తద్వారా 25 వేల ఎకరాల నుంచి 33 వేల ఎకరాలకు నీరిచ్చేలా గట్టు ప్రాజెక్టు రూపు రేఖలు మార్చాం. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మూడు వేల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం సర్వే పనులకు మాత్రమే జీవో విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదిత గట్టు ప్రాజెక్టుకు మేం శంకుస్థాపన చేస్తున్నామా? లేదా 33 వేల ఎకరాల కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన తెరాస ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గట్టు ప్రాజె క్టుకు శంకుస్థాపన చేస్తున్నామా? ఈ ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన తర్వాత గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ 33 వేల ఎకరాలకు నీరు పారించే విధంగా రూ. 553.98 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు జీవో ఎం.ఎస్ నెంబర్ 60 ద్వారా 2018 మే 31వ తేదీన పరిపాలన పరమైన అను మతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది అసలు ప్రాజెక్టు కథ. ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజ కీయం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమా ధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తిం చారు. అదే 2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలిం చింది. 2014లో మంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసినట్టు మాజీ మంత్రి డీకే అరుణ చెబు తున్నారు. నేను అరుణ గారిని అడుగుతున్నాను. 25 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టు జీవోను చూపించగలరా? ఆధారాలు ఏవైనా బయట పెట్టగలరా? కాంగ్రెస్‌కు కావల్సింది మొబిలై జేషన్ అడ్వాన్స్‌లు. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. మేం అడ్వాన్స్‌ల కోసం ప్రాజె క్టులు కట్టడం లేదు. కోటి ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ప్రాజెక్టులు కడుతున్నాం. అధికార యావ మీది. తెలంగాణ గోస తీర్చాలన్న భావన మాది. గత ఎన్నికల్లో గట్టెక్కేందుకు గట్టు ప్రాజెక్టును వినియోగిం చుకున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో నాలుగు ఓట్లు పడతాయన్న భావనతో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నది. ప్రజల ముందు ఈ వాస్తవా లను ఉంచాలన్న నా ఈ ప్రయత్నం ఉద్దేశం అదే. (గట్టు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన) - తన్నీరు హరీశ్‌రావు వ్యాసకర్త తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి -
‘భగీరథ’పై శ్రద్ధ పెట్టండి
సిద్దిపేటటౌన్ : మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన తొలి జిల్లాగా సిద్దిపేటను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. బుధవారం మిషన్ భగీరథ పనుల పురోగతిపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద మిషన్ భగీరథ పైలాన్‌ను జూలై 15న ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. జూలై 10 లోపు జిల్లాలో మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంత్రి సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో పైప్లైన్లు లీకేజీ అవ్వకుండా వర్టికల్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా జరిగే మహిళా వీవోల సమావేశాలలో తాగునీరు, నల్లా బిగింపు తదితర చర్యలపై మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ప్రత్యేక ఎజెండా పెట్టి.. అవగాహన కల్పించాలని సూచించారు. నీటి వృథా చేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే విషయమై ఎంపీడీఓలకు సూచనలు చేశారు. ఈనెల 30వ తేదీన కలెక్టర్ సమక్షంలో మరోసారి మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికి పెండింగ్ పనుల నివేదికలతో రావాలని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మున్సిపాలిటీపై సమీక్ష సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి సమీక్షిస్తూ.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలోని 7 వార్డులలో పూర్తిగా, మరో 4 వార్డులలో పాక్షికంగా జూలై ఆఖరు వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫలితాలు వస్తాయన్నారు. పట్టణంలోని చింతల్ చెరువు వద్ద చేపడుతున్న ఎస్టీపీ–సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో 90 కిలోమీటర్లకు 70 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పట్టణంలోని మొత్తం 324 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి గాను 94 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినట్టు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈఈ వీరప్రతాప్ మంత్రికి వివరించారు. -
ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ నెల 11 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మెపై సీఎం కేసీఆర్ ఫైర్ అవ్వడంతో టీఎంయూ గౌరవ అధ్యక్షడు హరీష్‌రావుతో ఆ సంఘం నేతలు శనివారం భేటీ అయ్యారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు. ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, హరీష్ రావ్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్ ఈ మధ్య హుషార్ అయ్యిండు
మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. చాలామంది అవి నెరవేరకముందే చనిపోతారు.. నాకూ సిద్దిపేట జిల్లా కావాలనే ఆశ ఉండేది. చివరకు పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేను సీఎం కావడం, నా సంతకంతోనే జిల్లా ఆవిర్భవించడం నా పూర్వజన్మ సుకృతం. నా జన్మ ధన్యమైంది. – సీఎం కె.చంద్రశేఖరరావు సాక్షి, సిద్దిపేట: ‘నాకు సిద్దిపేటను జిల్లా చేయాలనే ఆశ ఉండేది. 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరీంనగర్ వెళ్తుండగా.. సిద్దిపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆపి దరఖాస్తు కూడా ఇచ్చాం. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనతో పాటు ఇతర ముఖ్యమంత్రులు కూడా జిల్లా ఏర్పాటు చేయలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేను ముఖ్యమంత్రి కావడం, నా సంతకంతో సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటుచేయడమే కాకుండా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకు నేనే భూమి పూజలు చేయడం నా పూర్వజన్మ సుకృతం. నా కోరిక నెరవేరింది. నా జన్మ ధన్యమైంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాగా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా దుద్దెడలో నిర్మించనున్న కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకు, ఎన్సాన్‌పల్లిలో నిర్మించనున్న మెడికల్ కళాశాల భవనానికి బుధవారం సీఎం భూమి పూజలు చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నాకు జన్మనిచ్చింది, రాజకీయ ఓనమాలు నేర్పింది, మంచి గళంతో పాటు పదవులు ఇచ్చింది సిద్దిపేట అని సీఎం అన్నారు. తెలంగాణ కోసం పోరాడే ఆత్మస్తైర్యాన్ని సైతం సిద్దిపేటేఇచ్చిందని చెప్పారు. అందుకే ఇక్కడి ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు. దేశంలో ఉమ్మడి ఏపీ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో విభజన జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో మృత్యుంజయ శర్మ, ఇతర ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు, అక్షర జ్ఞానంతోనే ఇంతటి వాడిని అయ్యానని, తాను ఈ మట్టిలో మొలిచిన మొక్కనేనని తెలిపారు. సిద్దిపేట డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివానని, అక్కడి అధ్యాపకుల దీవెనలతోనే ఇంతటి వాడిని అయ్యానన్నారు. ఇంటర్ చదివే రోజుల్లో ముల్కి సర్టిఫికెట్ కోసం సంగారెడ్డి వెళ్లానని, అక్కడ పడిన ఇబ్బందులు చూసి సిద్దిపేట జిల్లాగా మారితే బాగుండేదన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్ర కావడంతో పాటు శరవేగంగా పట్టణం అభివృద్ధి చెందుతోందన్నారు. రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో సిద్దిపేట పెద్ద వాణిజ్య కేంద్రంగా రూపొందుతోందని చెప్పారు. రంగనాయక సాగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడు ఏమి అడిగినా వెంటనే చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట మట్టిలో ఏదో మహత్యం ఉందని, ఇక్కడ పుట్టినవారంతా రాష్ట్రాభివృద్ధిలో ముందుంటున్నారని తెలిపారు. దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, నియోజకవర్గ కేంద్రాలను సైతం అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఎస్టిమేట్ వేసి ఇస్తే నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర ఉన్నతాధికారులు స్మితా సభర్వాల్, వాకాటి కరుణ, కలెక్టర్ వెంకట్రామిరెడి, డీఐజీ అనురాగ శర్మ, ఐజీ స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చూపిన బాటలోనే నడుస్తున్నాం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ‘సిద్దిపేట ప్రజలకు సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూపిన బాటలోనే నడుస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 25 ఏళ్ల క్రితం కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట ప్రజలకు తాగునీరు ఇచ్చారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అదేవిధంగా నాడు మొక్కలు నాటి.. హరిత సిద్దిపేటగా మార్చారని, దానికి ఆదర్శంగా తీసుకొని హరిత తెలంగాణకు సీఎం శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితోనే కోమటిచెరువును సుందరంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. బైపాస్ రోడ్డు ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధిలో తనతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నామని, అంతా ఒకే కుటుంబ సభ్యులుగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలో విలీనమైన చేర్యాల, మద్దూరు, హుస్నాబాద్ ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయని వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా సీఎంను మంత్రి కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. హరీశ్ ఈ మధ్య హుషార్ అయ్యిండు ‘మీ ఎమ్మెల్యే, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మధ్య హుషారు అయ్యిండు’ అని సీఎం కేసీఆర్ సభలో చమత్కరించారు. ‘ముందు జిల్లా కావాలన్నాడు.. ఇప్పుడు కార్యాలయాలకు శంకుస్థాపన చేయమన్నాడు. అభివృద్ధిలో జిల్లాను ముందుంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు’ అని మంత్రిని అభినందించారు. కోమటిచెరువు అభివృద్ధికి అదనంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. -
రెండేళ్లలో నీళ్లిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ దరిద్రాలన్నీ తొలగిపోతాయి ♦ మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులకు సీఎం కేసీఆర్ దంపతుల భూమిపూజ ♦ ఏడాదిన్నరలో పంపుహౌజ్ పనులు పూర్తి చేస్తాం ♦ బ్యారేజీ పూర్తికాకున్నా నీళ్లు తీసుకోవచ్చు ♦ మహారాష్ట్ర సీఎంను హైదరాబాద్ రప్పించి తుది ఒప్పందం చేసుకుంటాం ♦ తమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరట ప్రాజెక్టులనూ త్వరలో చేపడతాం ♦ కాంగ్రెస్‌కు ఎన్ని నాలుకలో.. ఒక్కో చోట ఒక్కోటి మాట్లాడతారు ♦ ఆరునూరైనా 1,300 టీఎంసీల నీటిని వాడుకుంటామన్న ముఖ్యమంత్రి ♦ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిరాడంబరంగా కార్యక్రమం ♦ గోదావరిలో చిల్లర నాణేలు జారవిడిచిన ముఖ్యమంత్రి ♦ తొలుత కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు ♦ అమ్మవారికి కిలో 118 గ్రాముల బంగారు కిరీటం మొక్కు చెల్లింపు ♦ కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు ♦ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మంథని: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని అని... మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేసి నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకపోయినా పంపుహౌస్ ద్వారా నీటిని తరలించుకోవచ్చని... ఈ నిర్మాణాన్ని 15, 16 నెలల్లోనే పూర్తిచేస్తామని తెలిపారు. సోమవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. పండితుల సూచన మేరకు గోదావరి తల్లికి మొక్కి నదిలోకి చిల్లర నాణేలను జారవిడిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గోదావరి తల్లి తెలంగాణ బీళ్లను తడపాలన్నదే ప్రజల చిరకాల వాంఛ. అన్నిరకాలుగా అధ్యయనం చేసి, మేడిగడ్డ ప్రాంతం తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనం చేకూరుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఏడాదిన్నర, రెండేళ్లలో ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లిస్తాం. అక్కడి నుంచి మిడ్‌మానేరు, అటు నుంచి మెదక్ జిల్లాకు, హైదరాబాద్‌కు నీళ్లు వెళతాయి. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకముందే పంపుహౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశముంది. 15,16 నెలల్లో పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. ఒకసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండున్నర, మూడేళ్లలో ఉత్తర తెలంగాణలోని సకల దరిద్రాలూ తొలగిపోయే అవకాశముంది’’ అన్నారు. దేవాదుల పథకాన్ని 365 రోజులూ పనిచేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా.. సుమారు 100 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లాకు సరఫరా చేసే వీలుందన్నారు. ప్రత్తిపాకలో రిజర్వాయర్ ద్వారా కాకతీయ కాలువ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు రెండు పంటలు పండించుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు తరలించడం ద్వారా మెదక్ జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు నీళ్లివ్వొచ్చని, హైదరాబాద్‌కు 20 టీఎంసీలు సరఫరా చేయవచ్చన్నారు. ఇక నిజాంసాగర్‌లో 365 రోజులూ నీరుండేలా రూపకల్పన చేశామన్నారు. మంగళవారం నుంచి మంచి రోజులు లేనందున.. సోమవారమే నిరాడంబరంగా భూమి పూజ జరుపుకొన్నామని చెప్పారు. త్వరలో మహారాష్ట్ర సీఎంను హైదరాబాద్‌కు ఆహ్వానించి తుది ఒప్పందం చేసుకుంటామని, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనను భారీగా నిర్వహిస్తామని తెలిపారు. కాళేశ్వరంలో రోడ్డు పక్క టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న హరీశ్‌రావు, ఈటల, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు తదితరులు కాంగ్రెస్‌ది రామాయణంలో పిడకల వేట రామాయణంలో పిడకల వేటలాగా కాంగ్రెస్ తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదని ీకేసీఆర్ విమర్శించా రు. ‘‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. వారికి ఓ పాలసీ ఉండాలి. కానీ తెలంగాణలో ఒక నాలుక, ఏపీలో ఇంకో నాలుక, మహారాష్ట్రలో మరో నాలుకతో మాట్లా డుతోంది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే 950 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించారు. ఆ మేరకే నీటిని తీసుకుంటున్నం. మరి మహారాష్ట్ర వాళ్లు ఎందుకు ధర్నాలు చేస్తున్నరో వాళ్లకే తెలియాలి. మే నెలలో కూడా ఇక్కడ (కాళేశ్వరం) నీళ్లు పారుతున్నాయి. ఈ నీళ్లు సముద్రంలోకి పోకుండా ఎవరైనా వాడుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలోనూ లక్ష ఎకరాల్లో నీరు పారించుకోవచ్చని ప్రతిపాదించాం. దీనికి ఆ రాష్ట్ర సీఎం అంగీకరించారు. సర్వేలు పూర్తయ్యాయి. త్వరలో తుది ఒప్పందం చేసుకుంటాం..’’ అని పేర్కొన్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నీటిని తీసుకునే ప్రాజెక్టును వదిలేయలేదని.. దాన్ని త్వరలోనే చేపడతామన్నారు. తమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 2.5లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అంశాన్ని సాగునీటి శాఖ పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే ఒప్పందం చేసుకుంటామన్నారు. ఇక లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఛనాఖా-కొరటా సహా రెండు బ్యారేజీలను పూర్తిచేసి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, బేల, జైనథ్ మండలాలతోపాటు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 60 నుంచి 70 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని వివరించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. కాళేశ్వరం మహా పుణ్యక్షేత్రంగా రూపుదాల్చుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కాబోతోందని చెప్పారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ ద్వారా 54 కిలోమీటర్ల పొడవునా రెండు నదుల్లో (గోదావరి, ప్రాణహిత) నీళ్లుంటాయి. అద్భుతమైన బోటింగ్, వన సంపద, పుణ్యక్షేత్రం, నీళ్లు ఒకేచోట లభించే విశిష్టమైన ప్రాంతం కాళేశ్వరం. త్వరలోనే మళ్లీ ఇక్కడికి వచ్చి గెస్ట్‌హౌజ్‌లు, రోడ్ల నిర్మాణం చేయిస్తా. దేవాలయ అభివృద్ధి కోసం తక్షణమే రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. దేవాలయానికి కావాల్సిన హంగులన్నీ కల్పిస్తాం..’’ అని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల, హరీశ్‌రావు, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, వి.సతీష్‌కుమార్, కె.విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు కిరీటం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారం కిరీటం సమర్పిస్తానని 2012లో కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి వెళ్లిన సందర్భంగా మొక్కిన మొక్కును కేసీఆర్ చెల్లించుకున్నారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న ఉత్తర తెలంగాణ భవన్లో ఆదివారం రాత్రి బస చేసిన కేసీఆర్ దంపతులు.. సోమవారం తెల్లవారుజామునే హెలికాప్టర్లో బయలుదేరి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. శుభానందాదేవి ఆలయంలో పూజలు చేసి అమ్మవారికి రూ.36లక్షల విలువైన కిలో 118 గ్రాముల బంగారు కిరీటాన్ని బహూకరించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన కన్నెపల్లి చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ పనులకు భూమిపూజ చేశారు. తర్వాత హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని.. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బ్యారేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన మొత్తం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే జరిగింది. వాటా నీరంతా వాడుకుంటాం.. సమైక్య రాష్ట్రంలో విడుదల చేసిన జీవోల ప్రకారం కృష్ణా, గోదావరి నదుల్లో 1,300 టీఎంసీలపైగా నీటిని తెలంగాణకు కేటాయించారని... ఇప్పుడు తాము చేపడుతున్న ప్రాజెక్టులన్నీ ఆ 1,300 టీఎంసీల పరిధికి లోబడేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీలోని కొన్ని పక్షాలు ఈ విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా హక్కులను మేం సాధించుకోవడానికి.. మా కరువును తరిమేయడానికి.. సాగు, తాగునీటి గోస తీర్చడానికే. ఆరునూరైనా ఈ 1,300 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుని తీరుతది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మించి తీరుతాం.. దీనిని ఎవరూ ఆపలేరు. ఇప్పటికైనా వారు పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి..’’ అని సూచించారు. -
భవిష్యత్తు అవసరాల కోసమే రీ డిజైనింగ్
హైదరాబాద్: నదీ జలాల విషయంలో గత పాలకులు ఏడు సంవత్సరాల కాలంలో మహారాష్ట్రతో 7 సార్లు సమావేశాలు నిర్వహిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 10 సార్లు సమావేశాలు నిర్వహించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై వివరణ ఇచ్చిన ఆయన.. ప్రభుత్వానికి తెలంగాణ అవసరాలు, భవిష్యత్తు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇంత కరువు కాలంలోనూ ఈ ఏడాది ఇంద్రావతి నుంచి 1400 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్న హరీష్ రావు.. ప్రాజెక్టుల ద్వారా ఇలాంటి వృధాను అరికడతామన్నారు. హైదరాబాద్ మంచి నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు రూపొందిస్తున్నామన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని హరీష్ కోరారు. పాలేరు, వైరా, లంకసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాంజెక్టులతో ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో నీరందిస్తామన్నారు. -
'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు'
-
'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాధాన్యతను చూసి మరో మంత్రి హరీష్ రావు ఆందోళనకు గురవుతున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో తన ఉనికి కాపాడుకునేందుకు హరీష్ రావు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉడుకుతున్నాయని, అవి ఎప్పుడైనా పేలొచ్చని ఏద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 డివిజన్లను గెలుచుకుంటుందని సుధీర్ రెడ్డి తెలిపారు. -
నేను మీ వాడినే.. దరువేసిన హరీశన్న..
డప్పుచప్పుళ్లతో దద్దరిల్లిన జిల్లా కేంద్రం ఎమ్మార్పీఎస్ ‘చలో సంగారెడ్డి’ సక్సెస్ మీ హక్కులను కాపాడుతా ఎమ్మార్పీఎస్ బహిరంగ సభలో మంత్రి హరీశ్ డప్పు చప్పుళ్లతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ‘చలో సంగారెడ్డి’ సక్సెస్ అయింది. మాదిగల హక్కుల సాధనకు స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఐబీ అతిథి గృహం నుంచి ఐటీఐ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గిద్ద రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారుల బృందం ఆటపాటలతో ఉర్రూతలూగించింది. సభకు హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు డప్పుతో దరువేసి అందరిని ఆకట్టుకున్నారు. సభికులను కొద్దిసేపు ఉత్సాహపరిచారు. ‘నేను మీ వాడినే.. మీ వెంటే ఉంటా..’నంటూ మాదిగలకు భరోసా ఇచ్చారు. - సంగారెడ్డి టౌన్ మీ వెంటే ఉంటా.. సంగారెడ్డి టౌన్: ‘నేనూ, మీ వాడినే... మీ వెంటే ఉం టా... మీవి న్యాయమైన కోరికలు... అడిగే హక్కు మీకుంది... మీ సమస్యలను తీర్చే బాధ్యత మాపై ఉంది’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘చలో సంగారెడ్డి’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఐటీఐ మైదానంలో నిర్వహిం చిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీ తో పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రతి మండలానికి మూడు ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పా టు చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ కలసాకారమవుతుందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని ఎస్సీ వర్గీకరణ బిల్లు కు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో మాదిగలకు ఎక్కువ శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమాన్ని వాడుకున్న మంద కృష్ణ... గత ఇరవై ఏళ్లుగా మాదిగల ఉద్యమాన్ని మంద కృష్ణ మాదిగ తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని, ఉద్యమాన్ని నీరుగార్చి, మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు అల్లారం రత్నయ్య మాదిగ విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీను, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి గుర్రాల శ్రీనివాస్ మాదిగ, నాయకులు డప్పు శివరాజు, నర్సింలు, పాపయ్య మాదిగ, చిలుక ప్రభాకర్ మాదిగ, పొన్నాల కుమార్ మాదిగ, లక్ష్మి, క్యాసారం ప్రవీణ్ కుమార్, బూడిద నర్సింగ్‌రావు, చిక్కుల కుమార్, హన్మంతు, యేసు తదితరులు పాల్గొన్నారు. -
మార్కెటింగ్ శాఖ అధికారులతో హరీశ్ రావు సమీక్ష
హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ అధికారులతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పత్తి కొనుగోలుపై మంత్రి ఆరా తీశారు. రైతులకు పత్తి అమ్మకం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మడం ద్వారా రైతులు నష్టపోతున్నారనీ.. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్దే పత్తిని అమ్మేలా చర్యలు తీసుకోవాని అధికారులను కోరారు. త్వరలో హమాలీలకు డ్రెస్సులు, భీమా, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఉద్యమానికి పునాది ఇక్కడే...
కందుకూరు, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ర్ట సాధనలో అగ్రభాగాన నిలిచిన కేసీఆర్‌కు కందుకూరు మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేపట్టిన ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే అని చెప్పొచ్చు. 1996లో టీడీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాసర్లపల్లి సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో ఫాంహౌస్ నిర్మించడంతో పాటు ఉసిరి, మామిడి, కొబ్బరి తోటలను సాగు చేశారు. కొంతకాలం హరీష్‌రావు సైతం ఫాం హౌస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన తదనంతరం కేసీఆర్ అత్యధికంగా ఈ ఫాంహౌస్‌లోనే విడిది చేశారని, పార్టీ స్థాపించే వరకూ మేధావులు, నాయకులతో కలిసి చర్చలు జరిపారని స్థానికులు పేర్కొంటున్నారు. దాసర్లపల్లికి బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు దేవేందర్‌గౌడ్‌తో కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఫాంహౌస్‌ను విక్రయించారని పేర్కొంటున్నారు. ఉద్యమానికి పునాది పడింది ఇక్కడి నుంచే కావడం గర్వంగా ఉందంటున్నారు. -
సీఎంకు చెప్పలేదనడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని తనకు చెప్పలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ‘తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ’ అనే అంశంపై బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి డి.శ్రీనివాస్, బి.సారయ్య, మధుయాష్కీ, కె.యాదవరెడ్డి(కాంగ్రె స్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు (టీడీపీ), ఈటెల రాజేం దర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎం.బిక్షపతి, నల్లాల ఓదేలు, కె.స్వామిగౌడ్, పి.సుధాకర్‌రెడ్డి(టీఆర్ఎస్), గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ), యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(బీజేపీ)తో పాటు రాజకీయ జేఏసీ చైర్మ న్ కోదండరాం, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందే కాంగ్రెస్ హైకమాండ్ చాలా కసరత్తు చేసిందని, అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిందని, ఎన్నో కమిటీల ద్వారా అధ్యయనం చేయించిందని వివరించారు. సీఎం కిరణ్‌తోనూ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ సంప్రదింపులు జరిపిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారని, ఎన్ని కుట్రలు చేసినా దానిని అడ్డుకోలేరని డీఎస్ స్పష్టం చేశారు. అయితే విభజనకు ఆటంకం కలిగేవిధంగా సవరణ డిమాండ్లు ఉండకూడదని డీఎస్ హెచ్చరించారు. మధు యాష్కీ మాట్లాడుతూ.. పార్టీలు, నాయకులు సొంత లాభం మానుకుంటే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. టీడీపీ ప్రతినిధులు రేవూరి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి మాట్లాడుతూ బిల్లుకు సవరణలు చేయాలనే అధికారం శాసనసభకు లేదని, సభ్యులు సూచనలను మాత్రమే చేయాల్సి ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో చర్చకు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరించారని చెప్పారు. టీఆర్ఎస్ నేత ఈటెల మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు, ఎంపీలకు సవరణలు చేయాల్సిన అంశాలపై వినతిపత్రాలను ఈ నెల 16న అందిస్తామన్నారు. బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చాలా అంశాలపై సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. సీపీఐ నేతలు మల్లేష్, కూనంనేని ప్రసంగిస్తూ ఆంక్షలు లేని తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడతామన్నారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కలలుగన్న రాష్ట్ర సాధన కోసమే బిల్లులో సవరణల కోసం సూచనలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించగా జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, సి.విఠల్, దేవీప్రసాద్, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంక్షల్లేని తెలంగాణ కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉండాలని తీర్మానించారు. -
భద్రాద్రి మాదే
ఖమ్మం/భద్రాచలం, న్యూస్‌లైన్: ‘భద్రాచలం డివిజన్ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమే.... భద్రాద్రి రాముడికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది... దీనిని ఈ ప్రాంతం నుంచి వేరు చేయడం సరికాదు’ అని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాద్రి మాదే అంటూ నిరసనలు, ఆందోళనలు, దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కేశవరావు జిల్లాలో పర్యటించి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు టీఎన్జీవో ఆధ్వర్యంలో దీక్షలు సోమవారం కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అదేవిధంగా జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు నిమ్మరసం ఇచ్చి ఈదీక్షలను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయ, విద్య, వైద్యం ఏ ప్రాతిపదికన చూసినా భద్రాచలం తెలంగాణాలో అంతర్భాగమే అని అన్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం డివిజన్‌ను విడదీస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉంచాలని జిల్లా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మంగళవారం జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ మహిళా సంఘం పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. భద్రాచలంలో తొమ్మిదోరోజుకు దీక్షలు టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చే రాయి. సోమవారం నాటి దీక్షల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రా మచంద్రమూర్తి, డివిజన్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, నల్లపు దుర్గాప్రసాద్, ముత్యాల వీరభద్రం, నక్కా ప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, భూక్యా రంగా, తాండ్ర నర్సింహారావు, సరెళ్ల నరేష్, కేతినేని లలిత, రాజేష్, రాంబాబు తదితరులు కూర్చొన్నారు. డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు దీక్షాశిబిరాన్ని సంద ర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న భద్రాచలాన్ని వేరు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నా రు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ బుడగం శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి తొమ్మిదో రోజు దీక్షలను విరమింపజేశారు. తెలంగాణలో ఉంటేనే అభివృద్ధి : భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రైవేటు పాఠశాల కరస్పాడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాగంటి సూర్యం అన్నారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన, గిరిజనేతరులకు ఉన్నత విద్యావకాశాలు తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటాయన్నారు. భద్రాచలం ను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టబోయే కార్యక్ర మాలకు ప్రైవేటు పాఠశాలల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదుల జలదీక్ష : భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డి మాండ్‌తో భద్రాచలం న్యాయవాదుల జాయిం ట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చారిత్రాత్మకమైన భద్రాచలం ప్రాంతాన్ని జలసమాధి చేయాలనే కుట్రలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. సుమారు గంటపాటు జలదీక్షను చేపట్టారు. కార్యక్రమంలో న్యాయవాదులు పీ కృష్ణమోహన్, ఎంవీ రమణారావు, కొడాలి శ్రీనివాసన్, సాల్మాన్‌రాజు, వసంతరావు, దాగం ఆదినారాయణ, శ్రీనివాస్, పడవల శ్రీనివాస్, తిరుమలరావు, మహిళా న్యాయవాదులు లలిత, నర్మద, కిరణ్మయి, శుభశ్రీ, కవిత, తరుణి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నిర్విహ ంచే అఖిల పక్షాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి : గుమ్మడి నర్సయ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలంను ముంచాలనే సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదన్నారు. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమేనన్నారు. ఇందుకోసం భద్రాచలం డివిజన్లోని ప్రజానీకమంతా పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గౌసుద్ధీన్, సోమశేఖర్, వెక్కిరాల, ఈశ్వర్, కుంజా సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
భెల్‌లో ‘స్థానిక’ సమరం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: నవరత్న అవార్డు పొందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్(భెల్)లో ‘స్థానిక’ ఉద్యమం ఊపందుకుంది. భెల్‌లోని ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ మూడు రోజులుగా ఉద్యమిస్తున్న నిరుద్యోగులకు శనివారం ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలికారు. టీఆర్ఎస్ నేత హరీష్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే నం దీశ్వర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి నిరుద్యోగ యువతకు ధైర్యం చెప్పారు. అండగా ఉండి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నా రు. అంతకుముందు ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక యువకులు శనివారం భెల్ టౌన్‌షిప్‌లోని నె హ్రూ విగ్రహం నుండి భెల్ ఈడీ కార్యాలయం వరకు భా రీ ర్యాలీగా తరలివెళ్లారు. అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు, భెల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భెల్ టౌన్‌షిప్‌లోని గాం ధీ విగ్రహం వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ, భెల్ నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇటీవల జరిగిన రాత పరీక్షల్లోనూ ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ చే పట్టాలని డిమాండ్ చేశారు. భెల్ అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజు భెల్ పరిశ్రమలో పనిచేస్తున్న తమిళ అధికారులకు తొత్తుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తామన్నారు. న్యాయం జరిగేదాకా పోరాటం: హరీష్‌రావు స్థానిక యువతకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ భర్తీకి ముందే తాను భెల్ యాజమాన్యంతో మాట్లాడి స్థానిక యువతకు అవకాశం కల్పించాలని కోరగా, యాజమాన్యం అందుకు హామీ ఇచ్చిందన్నారు. అయితే నియామకాల్లో మాత్రం భెల్ యాజమాన్యం తన హామీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భెల్ ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు 80 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. యాజమాన్యం అధికారుల అండతో ఏకపక్షంగా బయటి రాష్ట్రాల వారికి ఉద్యోగ భర్తీలో పెద్దపీట వేసిందన్నారు. స్థానికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. వెంటనే స్థానిక యువతకు ఉద్యోగ భర్తీలో అవకాశం కల్పించేలా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. డిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అండగా ఉంటాం: నందీశ్వర్ గౌడ్, భూపాల్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, భెల్‌లో ఉద్యోగ నియామకాల విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ కలిసి వస్తే తాను కూడా భెల్ చైర్మన్ వద్దకు వెళ్లి చర్చించేందుకు సిద్ధమన్నారు. డిసెంబర్ నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున, అంతవరకు భెల్‌లో నియామకాలను నిలిపివేయాలన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే తెలంగాణ పది జిల్లాలలో ఐటిఐ చదివిన నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. నిరుద్యోగ యువకులు శాంతియుతంగా ఉద్యమించాలని, యాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తామూ కలిసి వస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ, ఇక్కడ ఐటిఐ చదివి పాసైన ప్రతి ఒక్కరికీ భెల్‌లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన 20 శాతం బయటి రాష్ట్రాల వారికి ఇవ్వాలన్నారు. స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, కార్పొరేటర్ పుష్పానగేష్ యాదవ్, తెల్లాపూర్ సర్పంచ్ సోమిరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, భెల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు రాజునాయక్, నాయకులు మోహన్ గౌడ్, నగేష్ యాదవ్, శంకర్ యాదవ్, రత్నం, శ్రీశైలం యాదవ్, చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈడీతో భేటీ యువకులతో కలిసి ఆందోళన చేపట్టిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావ్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు భెల్ ఈడీతో భేటీ అయ్యారు. నియామకాల్లో స్థానిక యువతకు పెద్ద పీట వేయాలని, అప్పటివరకు ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా భెల్ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. రాత పరీక్షల అనంతరం ఇంటర్య్వూకు పిలిచినవారిలో 1,544 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండగా, తెలుగు వారు 290 మంది మాత్రమే ఉన్నారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన భెల్ యువకుల ఆందోళన, ప్రజాప్రతినిధుల మద్దతుతో భెల్ యాజమాన్యం స్పందించింది. ప్రజాప్రతినిధులు కోరినట్లుగా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు, ఈ విషయాన్ని ఢిల్లీలోని కార్పొరేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఈడీ పేరిట ఓ పత్రికా ప్రకటనను వెలువరించింది. -
మరో హైదరాబాద్‌గా సిద్దిపేట
సిద్దిపేట/నంగునూరు, న్యూస్‌లైన్: సాగునీరు.. రైలు మార్గం.. జిల్లా కేంద్రం దరిచేర్చి సిద్దిపేటను రెండున్నరేళ్లలో పురోగమింపజేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హామీ ఇచ్చారు. నంగునూరు మండలంలో సోమవారం పర్యటించిన ఆయన... అడుగడుగునా జన‘నీరాజనం’ అందుకున్నారు. కోనాయిపల్లి, ఖాతా, అక్కెనపల్లి సభల్లో ప్రసంగించారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎకరాల్లో సిరులు పండించేలా 35 టీఎంసీల గోదావరి జలాలను రప్పిస్తామన్నారు. సిద్దిపేటకు పశ్చిమ దిశలో కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని వల్లంపట్ల మిడ్‌మానేరు ఇందుకు దోహదం చేస్తోందన్నారు. తడ్కపల్లి వద్ద నిర్మించదల్చిన రిజర్వాయర్‌తో ఆ గ్రామంతోపాటు మరే ఊరు కూడా ముంపునకు గురికావన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట మీదుగా రైలు మార్గానికి మంజూరు సాధించానన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రుల వల్లే ప్రగతి కుంటుపడిందని పేర్కొన్నారు. నిజానికి హైదరాబాద్-కరీంనగర్ ైరె ల్వే లైనుగా పరిగణించాల్సి ఉందని, అయితే మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గంగా రికార్డుల్లో ఉందన్నారు. ఇదెలా ఉన్నా.. సిద్దిపేట మీదుగా రైలు కూత వినే రోజొస్తుందని జనం హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. 150 కిలోమీటర్ల దూరాన ఉన్న జిల్లా కేంద్రం సంగారెడ్డికి వెళ్లడమనేది చాలా కష్టంతో కూడుకున్నదంటూ జనం బాధల్ని ఆయన ప్రస్తావించారు. అందుకే సిద్దిపేటను జిల్లా కేంద్రం చేయిస్తామని, అలాగే మెదక్ కూడా మరో జిల్లాగా ఆవిర్భవిస్తుందన్నారు. లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎల్ఆర్టీఎస్)ను అందుబాటులోకి తెచ్చి.. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు 24 నిమిషాల్లో చేరుకునేలా రవాణా సామర్థ్యా న్ని సృష్టిస్తామన్నారు. నాలుగు లేన్లుగా ఉన్న రాజీవ్ రహదారిని ఆరు లేన్లుగా విశాలం చేయిస్తామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి అనేది సిద్దిపేట నుంచే మొదలవుతోందన్నారు. సిద్దిపేటను మరో హైదరాబాద్‌గా చేసి తీరుతామన్నారు. నంగునూరు మండలానికి వరాలు నంగునూరు మండల ంతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అక్కెనపల్లి, ఖాతా, గట్లమల్యాల, ఘనపురం తదితర గ్రామాలతో మమేక మయ్యానన్నారు. శ్రమదానాలు, ఊళ్లల్లో నిద్రలు చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. కోనాయిపల్లిలో రూ. 25 లక్షల వ్యయంతో కల్యాణ మండపాన్ని కట్టిస్తామన్నారు. వలసకుంటను పూర్తిస్థాయిలో నింపేలా ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేస్తామన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలోని నీటి వనరులు వెలవెలబోతున్నాయని, ఇందుకు సీమాంధ్ర పాలకుల పక్షపాత వైఖరే కారణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సిద్దిపేట ముద్దుబిడ్డే కాదని, మొత్తంగా తెలంగాణ ముద్దుబిడ్డ అని శ్లాఘించారు. కేసీఆర్ వద్ద నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. కేసీఆరే స్ఫూర్తి స్థానిక ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటను ఆయా రంగాల్లో అభివృద్ధి చేయడంలో తనకు కేసీఆరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణాల్లో కేసీఆర్ తనకు ప్రేరణనిచ్చారని, ఆ ఫలితంగానే ఇప్పుడు సిద్దిపేట సెగ్మెంట్లో 40 చెక్‌డ్యాంలు మత్తడి దూకుతున్నాయని ప్రస్తావించారు. పునర్నిర్మాణానికి పునాది అక్కెనపల్లి, ఖాతా చెక్‌డ్యాంలు తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదుల్లాంటివని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అభివర్ణించారు. రేపటి తెలంగాణ రాష్ట్రం నమూనాకు ఇవే ప్రతిబింబాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కేవీ.రమణాచారి, కడియం శ్రీహరి, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కేసీఆర్ వెంట ఉన్నారు. -
కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీన ప్రతిపాదనపై భిన్నాభిప్ర్రాయాలు
-
డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలి: కొండా
-
కేంద్రానికి సహకరిస్తున్నాం: హరీష్‌రావు