సాక్షి, మెదక్: టీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం శుక్రవారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి వేదికగా బహిరంగ సభను తలపించేలా జరిగిన సమావేశంలో పలు ఆసక్తకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సదస్సు టీఆర్ శ్రేణుల్లో జోష్ నింపగా.. సహృద్భావ వాతావరణంలో బావబావమరుదల సవాల్ వరకు వెళ్లింది. కేసీఆర్ ప్రసంగంలో భాగంగా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, మా బావగారు అంటూ కేటీఆర్ సంభోదన.. యువకుడు, ఉత్సాహవంతుడు కేటీఆర్ అంటూ హరీశ్‌రావు పొగడ్తలతో ముంచెత్తడంతో అక్కడ ఉన్న వారు చిరునవ్వులు చిందించారు.
కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు: కేటీఆర్
మెదక్ జిల్లాకు వచ్చి.. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ స్థానానికి.. ఈ ప్రాంతానికి వచ్చి.. లక్ష మెజార్టీ సాధిం చిన హరీశ్‌రావు ఉన్న నియోజకవర్గానికి వచ్చి.. ఇప్పటికే రామలింగారెడ్డి ఎన్నో సార్లు ప్రాతిని ధ్యం వహించిన దుబ్బాకకు వచ్చి.. తాను కొత్త గా చెప్పేదేమీలేదని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి గారు తోడైన తర్వాత దుబ్బాకలో కాంగ్రెస్‌కు మిగిలిందేమీ లేదని పేర్కొన్నారు. దుబ్బా క ఏకపక్షమే.. మెదక్ ఏకపక్షమే మొత్తంగా చూసినట్లయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏకపక్షమైన వాతావరణమున్న ఈ నియోజకవర్గానికి వచ్చి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.
అభివృద్ధిలో ముందంజ: హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందని హరీశ్‌రావు అన్నారు. రెండు నెలల్లో మెదక్ రైలు వస్తుందన్నారు. గణపురం ఆనకట్ట చివరి వరకు సాగునీరందిస్తున్నామని.. నర్సాపూర్‌లో బస్ డిపో త్వరలో అందుబాటులోకి రానుందని.. దుబ్బాకలో డబుల్ బెడ్‌రూం ఇళ్లతో ఆదర్శంగా నిలవనుందన్నారు. గజ్వేల్ ఇప్పటికే అభివృద్ధి నమానాగా నిలుస్తోందన్నారు. ఇందులో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ప్రసంగం సందర్భంగా హరీశ్‌రావు పేరు సంభోదించగానే పార్టీ శ్రేణులు చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment