Medhak
-
కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు మధ్య సవాళ్ల పర్వం
-
గెలుపు ఏకపక్షమే.. మెజార్టీ కోసమే మా ప్రయత్నం
సాక్షి, మెదక్: టీఆర్ఎస్ మెదక్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం శుక్రవారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని సీఎస్ఐ చర్చి వేదికగా బహిరంగ సభను తలపించేలా జరిగిన సమావేశంలో పలు ఆసక్తకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సదస్సు టీఆర్ శ్రేణుల్లో జోష్ నింపగా.. సహృద్భావ వాతావరణంలో బావబావమరుదల సవాల్ వరకు వెళ్లింది. కేసీఆర్ ప్రసంగంలో భాగంగా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, మా బావగారు అంటూ కేటీఆర్ సంభోదన.. యువకుడు, ఉత్సాహవంతుడు కేటీఆర్ అంటూ హరీశ్‌రావు పొగడ్తలతో ముంచెత్తడంతో అక్కడ ఉన్న వారు చిరునవ్వులు చిందించారు. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు: కేటీఆర్ మెదక్ జిల్లాకు వచ్చి.. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ స్థానానికి.. ఈ ప్రాంతానికి వచ్చి.. లక్ష మెజార్టీ సాధిం చిన హరీశ్‌రావు ఉన్న నియోజకవర్గానికి వచ్చి.. ఇప్పటికే రామలింగారెడ్డి ఎన్నో సార్లు ప్రాతిని ధ్యం వహించిన దుబ్బాకకు వచ్చి.. తాను కొత్త గా చెప్పేదేమీలేదని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి గారు తోడైన తర్వాత దుబ్బాకలో కాంగ్రెస్‌కు మిగిలిందేమీ లేదని పేర్కొన్నారు. దుబ్బా క ఏకపక్షమే.. మెదక్ ఏకపక్షమే మొత్తంగా చూసినట్లయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏకపక్షమైన వాతావరణమున్న ఈ నియోజకవర్గానికి వచ్చి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. అభివృద్ధిలో ముందంజ: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందని హరీశ్‌రావు అన్నారు. రెండు నెలల్లో మెదక్ రైలు వస్తుందన్నారు. గణపురం ఆనకట్ట చివరి వరకు సాగునీరందిస్తున్నామని.. నర్సాపూర్‌లో బస్ డిపో త్వరలో అందుబాటులోకి రానుందని.. దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇళ్లతో ఆదర్శంగా నిలవనుందన్నారు. గజ్వేల్ ఇప్పటికే అభివృద్ధి నమానాగా నిలుస్తోందన్నారు. ఇందులో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రసంగం సందర్భంగా హరీశ్‌రావు పేరు సంభోదించగానే పార్టీ శ్రేణులు చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. -
కూటమిలో కుమ్ములాట.. మెదక్ టికెట్ దక్కించుకునేదెవరు..?
సాక్షి,మెదక్ : మహా కూటమి టికెట్ల పంపిణీ విషయం ఇంకా రెండు రోజుల్లో తేలనుంది. నియోజకవర్గంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఇదే చర్చ. మెదక్ టికెట్ కాంగ్రెస్‌కు దక్కుతుందా? లేక టీజేఎస్‌కా? ఒక వేళ కాంగ్రెస్‌కే పోటీ చేసే అవకాశం వస్తే.. శశిధర్‌రెడ్డికి వస్తుందా? బట్టి జగపతికా? సుప్రభాతరావుకా? తిరుపతిరెడ్డికా? ఇలాంటి ప్రశ్నలతో.. ఆశావహులే కాకుండా నియోజకవర్గ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావహులు వాళ్ల గాడ్ ఫాదర్స్‌తో టికెట్ కోసం ఢిల్లీలో గట్టిగానే ప్రయాత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు ఇంకా రెండు రోజులే మిగలి ఉంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ప్రశ్న కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మెదక్ నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు, నేతల్లో మహాకూటమిలో భాగంగా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వరిస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో దింపాలని మొదటి నుంచి పట్టుబడుతున్న స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. మెదక్ టికెట్ కోసమే విజయశాంతి ఢిల్లీ వెళ్లిందని ఆమె అనుచరులు చెబుతున్నారు. విజయశాంతి మంగళవారం ఏఐసీసీ పెద్దలను కలిసి మెదక్ టికెట్మహాకూటమిలో టీజేఎస్‌కు ఇవ్వొద్దని గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించిందని, దీంతో మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగడం ఖాయమని కాంగ్రెస్ ఆశావహులు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరికివారే చివరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ద్వారా టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఉన్న బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు కూడా పట్టు విడువకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీతోపాటు ఏఐసీసీలోని తమ గాడ్ఫాదర్ల ద్వారా టికెట్‌ను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. మహాకూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే మరోవైపు కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించటం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీజేఎస్‌కు దక్కుతుందని.. మెదక్ ఎమ్మెల్యే టికెట్ మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కే దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. టీజేఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న జనార్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహాకూటమిలో భాగంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మెదక్ టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ గెలుపొందే స్థా నాలను మాకు ఇవ్వాలని, మెదక్‌లో గెలిచే అవకాశం ఉందన్న టీజేఎస్‌కు టికెట్ ఇవ్వాలని ఆయ న కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ మెదక్ టికెట్ వదులుకునేందుకు సిద్ధంగా ఉంద ని, మెదక్ నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో మెదక్ టికెట్ కాంగ్రెస్ దక్కుతుందా? లేక టీజేఎస్‌కు దక్కుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. -
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
దుబ్బాక : విద్యుత్ షాక్ తగిలి ఒకే రోజు మండలంలో ఇద్దరు మృతి చెందడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన రైతు బట్టు మల్లేశం(30) ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పశువులకు నీళ్లు తాపుదామని చూడగానే, బోరు మోటరు నడవ లేదని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సతాయించడంతో బోరుమోటరు నడవలేదని గ్రహించిన మల్లేశం ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి బాగు చేస్తున్న తరుణంలో ఒక్క సారిగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతిని భార్య బట్టు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణ ప్రజలు కోరారు. మండలంలోని ఆరెపల్లిలో విద్యుత్ షాక్‌తగిలి మహిళమృతి మండలంలోని ఆరెపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం ఆరెపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆరెపల్లి గ్రామానికి చెందిన దాసర్ల సావిత్రి(50) తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్థంభం నుండి ఇంటికి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు ఇనుప(జే)వైరు ఉందని తెలిపారు. ఇంటిలోకి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు జే వైరు ఉండడం వలన జే వైరుకు విద్యుత్ సరాఫరా కావడంతో సావిత్రికి విద్యుత్ వైరు తగలడం వలన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మొదటగా సావిత్రి తల్లి ఎల్లవ్వకు విద్యుత్ షాక్ తగలడంతో తన తల్లిని దూరంగా పంపించింది. తల్లిని పంపిస్తున్న తరుణంలో విద్యుత్ వైరు సావిత్రికి తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఎల్లవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. తన కూతురు కళ్ల ఎదుట మరణించడంతో ఆవృద్ద తల్లి గుండెలవిసేలా రోధించింది. గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు భర్త రాంచంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని ఫోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
దూల్మిట్ట సర్పంచ్ భర్త అరెస్ట్
మద్దూరు (హుస్నాబాద్): మండలంలోని దూల్మిట్ట గ్రామ సర్పంచ్ భర్త నాచగోని లక్ష్మణ్‌గౌడ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సోమవారం మద్దూరు పోలీసులు అరెస్ట్ చేశారని గజ్వేల్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. దూల్మిట్ట గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నవంబర్ 19న విచారణ అనంతరం సర్పంచ్ భర్త నాచగోని లక్ష్మణ్ గౌడ్, కుమారుడు వెంకట్‌గౌడ్‌లు కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన మెర్గు రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు నవంబర్ 20న కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నాచగోని లక్ష్మణ్ గౌడ్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చదువుకోవాలనుంది... సార్ !
మెదక్ : కన్నతల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా పట్టించుకోవడం లేదు.. ఉన్నత చదువులు చదవాలనుంది. ఆదుకోండమ్మా! అంటూ కలెక్టర్ భారతి హొళికేరిని ప్రజావాణిలో పన్నెండేళ్ల ఓ చిన్నారి వేడుకుంది. రైల్వేలైన్ ఏర్పాటులో తమ వ్యవసాయ భూములు కోల్పోయామని, న్యాయం చేయండంటూ అవుసులపల్లికి చెందిన పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఒకచేయి లేకపోవడంతో ఏ పనీ చేయలేక బతుకు భారమవుతోందని, పింఛన్ ఇప్పించాలని కంచన్‌పల్లికి చెందిన లలిత అనే మహిళ వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 138 దరఖాస్తులు వచ్చాయి. కన్నతల్లి లేదు...తండ్రి ఉన్నా పట్టించుకుంట లేడు: కన్నతల్లి చనిపోయింది.. తండ్రి ఉన్నా పట్టించుకుంటలేడు.. ఉన్నత చదువులు చదవాలని ఉంది. అవకాశం కల్పించి ఆదుకోండమ్మా! అంటూ హవేళిఘనాపూర్ మండలం బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణ అనే పన్నెండేళ్ల బాలిక వేడుకుంది. బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి, శ్రీనివాస్ దంపతుల కూతురు నిరీక్షణ మెదక్ పట్టణంలోని వెస్లి పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి నాగమణి చనిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. నాకు బాగా చదవాలనుంది.. అవకాశం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరిని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ బాలికను కేజీబీవీలో చేర్పించి భవిష్యత్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఆదుకోండమ్మా! తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా తయారైందని, వారిని ఆదుకోవాలని మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. నా కొడుకు, కోడలు ఆర్నేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి సంతానమైన ముగ్గురు పిల్లలు కృష్ణ, జ్యోతి, చింటుల పోషణ నాపై పడిందని వాపోయింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు చనిపోగా, కాటికి కాలు చాపిన వయస్సులో ఉన్న నా కాలు విరిగి నడవలేని స్థితిలో బతుకే భారంగా మారి దుర్భరమైన బతుకు బతుకుతున్నామని వాపోయింది. ఈ వయస్సులో వారిని పోషించలేక పడరాని పాట్లు పడుతున్నానని, వారికి దారిచూపి ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ చిన్నారులను హాస్టళ్లలో చేర్పించి భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోయాం..న్యాయం చేయండి రైల్వేలైన్ ఏర్పాటులో మా వ్యవసాయ భూములు కోల్పోయాం. పరిహారం చెల్లించి ఆదుకోవాలని మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని తాము ఇచ్చినదానికంటే ఎక్కువ భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే రైల్వేలైన్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము బతుకుదెరువు కోల్పోవాల్సి వస్తోందని, అదనంగా కోల్పోయిన భూమికి సంబంధించి పరిహారం అందించి ఆదుకోవాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన నరేష్, యాదయ్య, మల్లయ్య, లక్ష్మి, సత్యనారాయణ, సత్తయ్య, లక్ష్మి, గొండయ్య తదితరులు వేడుకున్నారు. వంట చేస్తూ చేయి కోల్పోయా... పింఛన్ ఇప్పించి ఆదుకోండి ఇంట్లో వంట చేస్తుండగా పిట్స్ రావడంతో చేయి పొయ్యిలో పడి కాలిపోయిందని, దీంతో ఒంటి చేతి బతుకు భారంగా మారిందని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత కలెక్టర్‌ను కోరింది. సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారిని పిలిచి మందలించి సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే అర్హత సర్టిఫికెట్ అందజేయాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాధితురాలైన లలితకు సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలని ఆదేశించారు. సర్దన స్కీంను ప్రారంభించి తాగునీటి సమస్య తీర్చండి ఆర్డబ్ల్యూఎస్ సర్దన స్కీంను ప్రారంభించి 38 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు మల్లేశం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. హవేళిఘణాపూర్ మండలంలోని 38 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్దన పథకం ప్రారంభించి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. 2016లో పథకం మోటార్ చెడిపోయిందన్న సాకుతో పథకాన్ని నిలిపివేశారన్నారు. దీంతో పథకంలో పనిచేస్తున్న 17మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య అధికమైందని వాపోయారు. ► పుట్టుకతో మూగ, మానసిక వికలాంగురాలైన తమ కూతురు రేణుకకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన హేమలత, శ్రీనివాస్‌లు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. ► ప్రమాదంలో కాలు విరిగి బతుకు భారంగా మారింది.. ఉపాధి కల్పించి ఆదుకోవాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన బేగరి రాజు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2015సెప్టెంబర్‌లో ఆటో బోల్తాపడగా కాలు విరిగిందని, దీంతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. ► డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన పలువురు గిరిజనులు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. అలాగే మెదక్ మండలం ఖాజిపల్లికి చెందిన లస్మవ్వ అనే వృద్ధురాలు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టండి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో అధికారులు సామాన్య ప్రజలకంటే బ్రోకర్ల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
టూరిజం స్పాట్లుగా చారిత్రక కట్టడాలు
మెదక్ : జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలను ఆధునీకరించి, ప్రత్యేక సందర్శన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖాధికారులను జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి ఆదేశించారు. సోమవారం టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఓం ప్రకాష్ నేతృత్వలో స్టూడియో వన్ కన్సెల్టెన్సీ ప్రతినిధి యశ్వంత్‌మూర్తి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిథిగృహాల మరమ్మతులను ప్రభుత్వం నిధులను కేటాయించిందని తెలిపారు. పోచారం ప్రాజెక్ట్ వద్ద ఉన్నత ప్రభుత్వ చారిత్రార అతిథిగృహాలను ఎలాంటి వన్నె తగ్గకుండా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పోచారం ప్రాజెక్ట్, అభయారణ్యాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అతిథిగృహాలను ఆధునీకరించడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్ట్ వద్ద ల్యాండ్ స్కెపింగ్ ఫౌంటేన్, పార్కింగ్, బోటింగ్‌షెడ్‌లను ఆధునీక హంగులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పోచారం వద్ద గల రెండు అతిథిగృహాలను సందర్శించి పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ రవికుమార్ ఉన్నారు. -
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
దుబ్బాక : విద్యుత్ షాక్ తగిలి ఒకే రోజు మండలంలో ఇద్దరు మృతి చెందడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన రైతు బట్టు మల్లేశం(30) ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పశువులకు నీళ్లు తాపుదామని చూడగానే, బోరు మోటరు నడవ లేదని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సతాయించడంతో బోరుమోటరు నడవలేదని గ్రహించిన మల్లేశం ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి బాగు చేస్తున్న తరుణంలో ఒక్క సారిగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతిని భార్య బట్టు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణ ప్రజలు కోరారు. మండలంలోని ఆరెపల్లిలో విద్యుత్ షాక్‌తగిలి మహిళమృతి మండలంలోని ఆరెపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం ఆరెపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆరెపల్లి గ్రామానికి చెందిన దాసర్ల సావిత్రి(50) తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్థంభం నుండి ఇంటికి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు ఇనుప(జే)వైరు ఉందని తెలిపారు. ఇంటిలోకి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు జే వైరు ఉండడం వలన జే వైరుకు విద్యుత్ సరాఫరా కావడంతో సావిత్రికి విద్యుత్ వైరు తగలడం వలన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మొదటగా సావిత్రి తల్లి ఎల్లవ్వకు విద్యుత్ షాక్ తగలడంతో తన తల్లిని దూరంగా పంపించింది. తల్లిని పంపిస్తున్న తరుణంలో విద్యుత్ వైరు సావిత్రికి తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఎల్లవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. తన కూతురు కళ్ల ఎదుట మరణించడంతో ఆవృద్ద తల్లి గుండెలవిసేలా రోధించింది. గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు భర్త రాంచంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని ఫోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
చదువుకోవాలనుంది... సార్ !
మెదక్ : కన్నతల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా పట్టించుకోవడం లేదు.. ఉన్నత చదువులు చదవాలనుంది. ఆదుకోండమ్మా! అంటూ కలెక్టర్ భారతి హొళికేరిని ప్రజావాణిలో పన్నెండేళ్ల ఓ చిన్నారి వేడుకుంది. రైల్వేలైన్ ఏర్పాటులో తమ వ్యవసాయ భూములు కోల్పోయామని, న్యాయం చేయండంటూ అవుసులపల్లికి చెందిన పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఒకచేయి లేకపోవడంతో ఏ పనీ చేయలేక బతుకు భారమవుతోందని, పింఛన్ ఇప్పించాలని కంచన్‌పల్లికి చెందిన లలిత అనే మహిళ వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 138 దరఖాస్తులు వచ్చాయి. కన్నతల్లి లేదు...తండ్రి ఉన్నా పట్టించుకుంట లేడు: కన్నతల్లి చనిపోయింది.. తండ్రి ఉన్నా పట్టించుకుంటలేడు.. ఉన్నత చదువులు చదవాలని ఉంది. అవకాశం కల్పించి ఆదుకోండమ్మా! అంటూ హవేళిఘనాపూర్ మండలం బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణ అనే పన్నెండేళ్ల బాలిక వేడుకుంది. బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి, శ్రీనివాస్ దంపతుల కూతురు నిరీక్షణ మెదక్ పట్టణంలోని వెస్లి పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి నాగమణి చనిపోవడంతో తండ్రి శ్రీనివాస్ తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. నాకు బాగా చదవాలనుంది.. అవకాశం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరిని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ బాలికను కేజీబీవీలో చేర్పించి భవిష్యత్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఆదుకోండమ్మా! తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా తయారైందని, వారిని ఆదుకోవాలని మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. నా కొడుకు, కోడలు ఆర్నేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి సంతానమైన ముగ్గురు పిల్లలు కృష్ణ, జ్యోతి, చింటుల పోషణ నాపై పడిందని వాపోయింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు చనిపోగా, కాటికి కాలు చాపిన వయస్సులో ఉన్న నా కాలు విరిగి నడవలేని స్థితిలో బతుకే భారంగా మారి దుర్భరమైన బతుకు బతుకుతున్నామని వాపోయింది. ఈ వయస్సులో వారిని పోషించలేక పడరాని పాట్లు పడుతున్నానని, వారికి దారిచూపి ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ చిన్నారులను హాస్టళ్లలో చేర్పించి భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోయాం..న్యాయం చేయండి రైల్వేలైన్ ఏర్పాటులో మా వ్యవసాయ భూములు కోల్పోయాం. పరిహారం చెల్లించి ఆదుకోవాలని మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని తాము ఇచ్చినదానికంటే ఎక్కువ భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే రైల్వేలైన్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము బతుకుదెరువు కోల్పోవాల్సి వస్తోందని, అదనంగా కోల్పోయిన భూమికి సంబంధించి పరిహారం అందించి ఆదుకోవాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన నరేష్, యాదయ్య, మల్లయ్య, లక్ష్మి, సత్యనారాయణ, సత్తయ్య, లక్ష్మి, గొండయ్య తదితరులు వేడుకున్నారు. వంట చేస్తూ చేయి కోల్పోయా... పింఛన్ ఇప్పించి ఆదుకోండి ఇంట్లో వంట చేస్తుండగా పిట్స్ రావడంతో చేయి పొయ్యిలో పడి కాలిపోయిందని, దీంతో ఒంటి చేతి బతుకు భారంగా మారిందని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత కలెక్టర్‌ను కోరింది. సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారిని పిలిచి మందలించి సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే అర్హత సర్టిఫికెట్ అందజేయాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాధితురాలైన లలితకు సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలని ఆదేశించారు. సర్దన స్కీంను ప్రారంభించి తాగునీటి సమస్య తీర్చండి ఆర్డబ్ల్యూఎస్ సర్దన స్కీంను ప్రారంభించి 38 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు మల్లేశం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. హవేళిఘణాపూర్ మండలంలోని 38 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్దన పథకం ప్రారంభించి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. 2016లో పథకం మోటార్ చెడిపోయిందన్న సాకుతో పథకాన్ని నిలిపివేశారన్నారు. దీంతో పథకంలో పనిచేస్తున్న 17మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య అధికమైందని వాపోయారు. -పుట్టుకతో మూగ, మానసిక వికలాంగురాలైన తమ కూతురు రేణుకకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన హేమలత, శ్రీనివాస్‌లు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. - ప్రమాదంలో కాలు విరిగి బతుకు భారంగా మారింది.. ఉపాధి కల్పించి ఆదుకోవాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన బేగరి రాజు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2015సెప్టెంబర్‌లో ఆటో బోల్తాపడగా కాలు విరిగిందని, దీంతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. - డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన పలువురు గిరిజనులు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. అలాగే మెదక్ మండలం ఖాజిపల్లికి చెందిన లస్మవ్వ అనే వృద్ధురాలు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టండి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో అధికారులు సామాన్య ప్రజలకంటే బ్రోకర్ల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
టూరిజం స్పాట్లుగా చారిత్రక కట్టడాలు
మెదక్ : జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలను ఆధునీకరించి, ప్రత్యేక సందర్శన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖాధికారులను జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి ఆదేశించారు. సోమవారం టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఓం ప్రకాష్ నేతృత్వలో స్టూడియో వన్ కన్సెల్టెన్సీ ప్రతినిధి యశ్వంత్‌మూర్తి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిథిగృహాల మరమ్మతులను ప్రభుత్వం నిధులను కేటాయించిందని తెలిపారు. పోచారం ప్రాజెక్ట్ వద్ద ఉన్నత ప్రభుత్వ చారిత్రార అతిథిగృహాలను ఎలాంటి వన్నె తగ్గకుండా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పోచారం ప్రాజెక్ట్, అభయారణ్యాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అతిథిగృహాలను ఆధునీకరించడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్ట్ వద్ద ల్యాండ్ స్కెపింగ్ ఫౌంటేన్, పార్కింగ్, బోటింగ్‌షెడ్‌లను ఆధునీక హంగులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పోచారం వద్ద గల రెండు అతిథిగృహాలను సందర్శించి పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ రవికుమార్ ఉన్నారు. -
అమెరికా ప్రయాణానికి ఆదుకోరూ..
పాపన్నపేట(మెదక్): పురిటిగడ్డపై పూటగడవని పరిస్థితిలో వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్న దంపతుల బిడ్డ రోబో టెక్నాలాజీలో దిట్టగా ఎదిగాడు. అమెరికాలోని మిచిగాన్‌లో జరుగనున్న రోబో పెస్ట్ వరల్డ్ ఛాంపియన్ పోటీలకు ఎంపికై తన సత్తా చాటాడు. వేల మైళ్లదూరం.. ఖరీదైన ప్రయాణం.. దాతలు ఎవరైనా సహకరించి ఆదుకోవాలని కోరుతున్నాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పోచమ్మ–సాయిలు దంపతులు కొంతకాలం క్రితం సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి కొడుకు వినయ్‌కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్న నాటి నుంచి రోబో టెక్నాలాజిపై ఆసక్తి పెంచుకొని పలు ఎగ్జిబిట్లు రూపొందించాడు. ఈ క్రమంలో ఇటీవల కందిలోని ఐఐటీలో జరిగిన మెటర్నల్ ఎగ్జిబిషన్‌కు నలుగురు స్నేహితులతో కలిసి తీసుకెళ్లిన రోబో ప్రదర్శన అత్యుత్తమైందిగా ఎంపికైంది. దీంతో అమెరికాలోని మిచిగాన్‌లో గల లారెన్స్ టెక్నాలాజీ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న రోబో ఫెస్ట్‌వరల్డ్ ఛాంపియన్ పోటీలకు వీరు ప్రదర్శించే మోడల్ ఎంపికైంది. జూన్ 1న జరిగే ఈ పోటీలకు ఆ సంస్థవారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. కాగా ఖర్చులకు డబ్బులు లేవని, దాతలు సహకరించి తన విదేశీ ప్రయాణానికి సహకరించాలని వినయ్ కోరుతున్నాడు.