టూరిజం స్పాట్‌లుగా చారిత్రక కట్టడాలు | In Medhak all historic monuments will be made as tourist spots | Sakshi
Sakshi News home page

టూరిజం స్పాట్‌లుగా చారిత్రక కట్టడాలు

Published Mon, Apr 24 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

టూరిజం స్పాట్‌లుగా చారిత్రక కట్టడాలు

టూరిజం స్పాట్‌లుగా చారిత్రక కట్టడాలు

మెదక్‌ : జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలను ఆధునీకరించి, ప్రత్యేక సందర్శన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖాధికారులను జిల్లా కలెక్టర్‌ భారతి హొళికేరి ఆదేశించారు. సోమవారం టూరిజం శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఓం ప్రకాష్‌ నేతృత్వలో స్టూడియో వన్‌ కన్సెల్టెన్సీ ప్రతినిధి యశ్వంత్‌మూర్తి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిథిగృహాల మరమ్మతులను ప్రభుత్వం నిధులను కేటాయించిందని తెలిపారు.

పోచారం ప్రాజెక్ట్‌ వద్ద ఉన్నత ప్రభుత్వ చారిత్రార అతిథిగృహాలను ఎలాంటి వన్నె తగ్గకుండా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పోచారం ప్రాజెక్ట్, అభయారణ్యాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. అతిథిగృహాలను ఆధునీకరించడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్ట్‌ వద్ద ల్యాండ్‌ స్కెపింగ్‌ ఫౌంటేన్, పార్కింగ్, బోటింగ్‌షెడ్‌లను ఆధునీక హంగులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం పోచారం వద్ద గల రెండు అతిథిగృహాలను సందర్శించి పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్‌ రవికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement