మార్కెటింగ్ శాఖ అధికారులతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ అధికారులతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పత్తి కొనుగోలుపై మంత్రి ఆరా తీశారు. రైతులకు పత్తి అమ్మకం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మడం ద్వారా రైతులు నష్టపోతున్నారనీ.. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్దే పత్తిని అమ్మేలా చర్యలు తీసుకోవాని అధికారులను కోరారు. త్వరలో హమాలీలకు డ్రెస్సులు, భీమా, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.