‘ఖాకీ’ దంపతుల కర్కశం! | Head constable couple harassment: child dies in hospital | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’ దంపతుల కర్కశం!

Published Fri, Jan 30 2015 8:38 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

‘ఖాకీ’ దంపతుల కర్కశం! - Sakshi

‘ఖాకీ’ దంపతుల కర్కశం!

  • కాళ్లు చేతులు కట్టేసి వేడి నూనె పోశారు..
  • మెదక్ జిల్లాలో ఘటన.. ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ చిన్నారి మృతి
  • సంగారెడ్డి: ఓ హెడ్‌కానిస్టేబుల్ దంపతుల కర్కశానికి చిన్నారి బలైంది. కాళ్లు చేతులు కట్టేసి.. వేడి నూనె పోసి నరకయాతనకు గురిచేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. డీఎస్పీ ఎం.తిరుపతన్న కథనం మేరకు.. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాతో కలసి కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్నాడు.

    ఐదు నెలల క్రితం ఓ దర్గా నుంచి షాహిస్తా సబా (5)ను తీసుకువచ్చాడు. అయితే హెడ్‌కానిస్టేబుల్ దంపతులు ఆ బాలికను తరచూ చిత్రహింసలకు గురిచేసేవారు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం బాలిక చేతులు, కాళ్లకు వాతలు పెట్టారు. వేడి నూనె మీద పోయడంతో తీవ్రంగా గాయపడింది. ఇరుగుపొరుగువారి సమాచారం మేరకు గురువారం శిశు సంరక్షణ అధికారి ఎం.ఎస్.చంద్ర బాలికను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ దంపతులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement