ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు రూరల్ మండలం పొక్కేడు గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 12,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గ్రామస్థులందర్ని ఒకచోట చేర్చి ఎక్సైజ్ సీఐ శ్రీధర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నాటుసారా తయారు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు.