Country Liquor
-
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
చేతి పంపు నుంచి బకెట్ల కొద్ది మద్యం.. ఎక్కడో తెలుసా?
భోపాల్: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. शराब माफिया का दिमाग हैंडपम्प से निकली शराब गुना के भानपुरा का मामला #Guna #HandPump #Viral #Trending pic.twitter.com/eRm8H1t1wN — LALIT K PRAJAPATI (@prajapatilalit) October 11, 2022 ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
85,000 లీటర్ల లిక్కర్ లెక్క.. తిక్క కుదిర్చిన పోలీసులు..!
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో 85,000పైగా లీటర్ల దేశీయ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... బాలసోర్ జిల్లా ప్రధాన కార్యాలయం శివార్లలో ఉన్న పురుషా బాలసోర్ ప్రాంతంలో భారీగా దేశీయ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి మూడు ఇళ్లలో ఒకరు మద్యం తయారీలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. దీనివల్ల కోవిడ్ లాక్డౌన్ సమయంలో నేరాల రేట్లు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. దీనిపై సమాచారం మేరకు ఒడిశాలోని బాలసోర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి, అనేక అక్రమ దేశీయ మద్యం తయారీ విభాగాలపై మంగళవారం దాడి చేశారన్నారు. చెరువుల లోపల దాచిన మద్యం గ్యాలన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై బాలసోర్ ఎస్పీ సుధాన్షు మిశ్రా మాట్లాడుతూ, " మేము 70,000 లీటర్ల పులియబెట్టిన మద్యం పానకాన్ని ధ్వంసం చేశాం. దేశీయ మద్యం తయారీలో ముడిసరుకుగా ఉపయోగించే 'మహువా, మొలాసిస్, మద్యం తయారీ పాత్రలతో పాటు 12,000 లీటర్ల తయారుచేసిన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.’’ తెలిపారు. మరో ఘటనలో బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. ఈ మరణాలకు సంబంధించి కనీసం 16 మందిని అరెస్టు చేశారు. -
నాటుసారా తాగి ఇద్దరి మృతి
కోయిలకుంట్ల (కర్నూలు) : బంధువుల ఇంట్లో దశ దినకర్మలకు వెళ్లిన ఇద్దరు యువకులు నాటుసారా పూటుగా తాగి మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దినం(దశదినకర్మ) జరుగుతుండటంతో.. అక్కడికి వెళ్లిన చంద్రయ్య(27), దాసరిమద్ది(28) అనే ఇద్దరు యువకులు నాటుసారా తాగడంతో.. అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి..15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఏమినేని పాపారావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి
-
భారీగా బెల్లం ఊట ధ్వంసం
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు రూరల్ మండలం పొక్కేడు గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 12,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గ్రామస్థులందర్ని ఒకచోట చేర్చి ఎక్సైజ్ సీఐ శ్రీధర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నాటుసారా తయారు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. -
చౌక మద్యంపై నో వ్యాట్!
రాష్ట్ర సర్కారు ఆలోచన సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో మంచినీళ్ల బాటిల్ ధర రూ. 20 పలుకుతోంది. సీసా కల్లు ధర కూడా రూ. 20కి తక్కువకు దొరకట్లేదు. కానీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రూ.15కే చౌకమద్యం అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గిరిజన తండాలు మొదలుకొని గ్రామాలు, నగరాల వరకు ఎక్కడైనా లభిస్తున్న గుడుంబాకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తున్న రూ.10కే 90 ఎంఎల్ మద్యాన్ని (కంట్రీ లిక్కర్) అందించాలని సీఎం కేసీఆర్ సూచించినా ఆ ధరకు మద్యాన్ని అందించేందుకు డిస్టిలరీలు ముందుకు రావని అధికారులు చెప్పడంతో ధరను రూ. 15గా ఖాయం చేశారు. నూతన మద్యం విధానం రూపకల్పనలో రూ. 15 మద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మద్యం పాలసీపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ శనివారం ఉన్నతాధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రూ. 15కు మద్యం అందించడం వల్ల ఎక్సైజ్ శాఖకు వచ్చే లాభనష్టాలపై చర్చించారు. పకడ్బందీగా ఎక్సైజ్ పాలసీ ప్రతిపాదనలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆరు డిస్టిలరీలు సిద్ధం మద్యం దుకాణాల్లో ప్రస్తుతం చీప్ లిక్కర్ 90 ఎంఎల్, 180 ఎంఎల్ బాటిళ్లలో లభ్యమవుతోంది. 90 ఎంఎల్ ధర కనీసంగా రూ. 30 కాగా, 180 ఎంఎల్ రూ. 55గా ఉంది. రాష్ట్రంలో ఉన్న 16 డిస్టిలరీల్లో ఐఎంఎఫ్ఎల్తోపాటు చీప్ లిక్కర్ కూడా తయారవుతోంది. వివిధ రకాల పేర్లతో బేవరేజెస్ గోడౌన్ల ద్వారా మద్యం దుకాణాలకు చేరుతుంది. ఇప్పుడు సర్కార్ తెస్తున్న రూ.15కే కంట్రీ లిక్కర్ కారణంగా అధిక ధరలో లభించే చీప్ లిక్కర్ మీద దెబ్బపడనుంది. సర్కార్‌కు వచ్చే రాబడిలో చీప్ లిక్కర్ ఆదాయమే అధికం. ఈ నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు బదులు కంట్రీ లిక్కర్ తయారు చేసి డిపోలకు అందించేందుకు ఆరు డిస్టిలరీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అధికారికంగా మద్యం పాలసీ ఖరారైతే మరిన్ని డిస్టిలరీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. అలాగే మద్యం దుకాణాలపైనా ప్రభావం పడనుంది. గ్రేటర్ సహా పలు నగరాల్లో ఏడాదికి రూ. 90 లక్షల లెసైన్సు ఫీజుతో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారికి రూ. 15కే చీప్ లిక్కర్ అమ్మడం వల్ల గిట్టుబాటు కాదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వ్యాట్ మినహాయింపు ఆలోచన? గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ‘ఆరోగ్యకరమైన’ మద్యాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు దీనికి వ్యాట్ నుం చి మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మద్యం మీద 60% నుంచి 160% వరకు ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. చీప్ లిక్కర్‌పై 60% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే రూ. 15కే అందించే మద్యం పై వ్యాట్ వడ్డించాలంటే ఒక్కో 90 ఎంఎల్ బాటిల్ రూ. 6 లోపే డిస్టిలరీలో తయారు కావాల్సి ఉంటుంది. పెట్ బాటిల్, స్పిరిట్ (మద్యం) తయారీకి ఖర్చయ్యే రూ.6తో ఇది సాధ్యం కాదని డిస్టిలరీలు చెబుతున్నాయి. నష్టం జరగకుం డా ఉండాలంటే వ్యాట్ మినహాయింపు ఒక్కటే మార్గమని వాది స్తున్నాయి. అయితే వ్యాట్‌ను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై భారీగా కోత పడుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది లో చీప్ లిక్కర్ అమ్మకాలు, తద్వారా ప్రభుత్వానికి డిస్టిలరీలు చెల్లించిన వ్యాట్‌కు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ దాడులు
మైదుకూరు : వెఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ముదిరెడ్డి పల్లె సుగాలతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై ఎల్లయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా తయారీ దారులు పరారయ్యారు. అక్కడ నిల్వ ఉంచిన 2,000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఖాళీ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.