సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కూరుస్తోంది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు వర్షంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది.
Comments
Please login to add a commentAdd a comment