ముంచెత్తుతున్న వానలు
జలదిగ్బంధంలో ఖమ్మం, వరంగల్ జిల్లా ఏజెన్సీలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లాలో గురువారమూ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 9 గంటల వరకు 32 మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం పడింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 3 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండల పరిధిలోని ఎర్రచెరువుకు, బండ్రుగుండ చెరువుకు గండి పడింది. కొత్తగూడెం మండలం సింగభూపాలెం చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కారుకొండ వద్ద లోలెవెల్ బ్రిడ్జీ సైడ్‌వాల్స్ కొట్టుకుపోవడంతో మరమ్మతులు ప్రారంభించారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో వర్షం కారణంగా 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీతారాంపురం-ఆనందపురం గ్రామాల మధ్య రోడ్డుపై చప్టా తెగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. మల్లెలమడుగు వద్ద రాజం పాపయ్య వాగు పొంగి సమీప గ్రామంలోని 15 రోడ్లు కోతకు గురయ్యాయి. గొందిగూడెం ఇసుకవాగు, బురదవాగు పొంగడంతో చుట్టుపక్కల 10 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గుండాల మండలంలో అంతర్గత రోడ్లు ధ్వంసం అయ్యాయి. బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం-సంజీవరెడ్డిపాలెం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.
రహదారులు జలమయం
వరంగల్: వరంగల్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారుు.రవాణా వ్యవస్థ స్తంభించింది. భూపాలపల్లివాసులు పరకాల-వరంగల్ వచ్చే అవకాశం లేకుండాపోరుుంది. గణపురం సమీపంలోని మోరంచ వాగు ఉధృతి తగ్గకపోవడంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూరుు. సుమారు 200 గొర్రెలతో పాటు కాపరులు ఈ వాగులో చిక్కుకోగా, స్థానికులు వారిని రక్షించారు. 20 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయూరుు. భూపాలపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోరుుంది.
గణపురం మండలం చెల్పూరు శివారు కుందయ్యపల్లి సమీపంలో కాజ్‌వే(బైపాస్‌రోడ్) కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయూరుు. ఈ రోడ్డుపై కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలు ఇరువైపులా కిలోమీటరు మేర నిలిచిపోయూరుు. ములుగు ఏజెన్సీని కూడా వర్షాలు ముంచెత్తారుు. కొండపర్తి-తాడ్వాయి మధ్య వట్టివాగు బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు వరదల దాటికి తెగిపోయింది. దీంతో ఏటూరునాగారం-హన్మకొండ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏటూరునాగారం మండలం గోగుపల్లి ఊర చెరువు ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టుపై ఉన్న చప్టా(స్లాబ్) ధ్వంసమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.