![Heavy Rains To Hit In Telangana In Next Two Days - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/21/Rain.jpg.webp?itok=w8EpIG4d)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షా లు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, పేర్కొంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు, ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment