వైద్య శిబిరానికి విశేష స్పందన | heavy response to medical camps | Sakshi
Sakshi News home page

వైద్య శిబిరానికి విశేష స్పందన

Sep 8 2014 11:30 PM | Updated on Sep 2 2017 1:04 PM

లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.

జహీరాబాద్: లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. 1,357 మంది రోగులు తరలివచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. దీని లో భాగంగా మొదటి రోజు చెవి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించారు. 517మంది రోగులు చెవి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆపరేషన్ల కోసం గుర్తిం చిన వారిలో 15 మందికి సర్జరీలు చేశారు. గ్రహణం మొర్రికి సంబంధించి 7గురు పేర్లు నమోదు చేయించుకున్నారు.

 కంటి శుక్లాలకు సంబంధించి 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేం దుకు నిర్ణయించినా రోగులు అధికంగా రావడంతో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. 834 మంది కంటి వైద్యం కోసం వచ్చా రు. మంగళవారం నుంచి దంత వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నా రు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు జహీరాబాద్‌లోని రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులో ఉం చిన రైలులో వైద్య పరీక్షలు, అవసరమైన వారికి ఆపరేషన్లను నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు దంత వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపా రు.  చెవి ఆపరేషన్ల కోసం గుర్తించిన వారిలో మిగిలిపోయిన రోగులకు మంగళవారం ఆపరేషన్లను నిర్వహించనున్నట్లు వారు వివరించారు. పలువురికి ఉచితంగా మిషన్లు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement