Free medical camps
-
ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. నిఘా నీడలో... రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
కుంచనపల్లిలో ఆప్త మెడికల్ క్యాంప్
సాక్షి, తాడేపల్లి(గుంటూరు): అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త), కాజ సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాట్రగడ్డ శ్రీకాంత్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, అడిషనల్ డీజీపీ సునీల్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మెగా శిబిరానికి కుంచనపల్లి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పొందారు. ఈ మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన మెయిన్ స్పాన్సర్స్ శ్రీకాంత్ కాట్రగడ్డ, డాక్టర్ సూర్య రగతు, డాక్టర్ నీరజ చవాకుల, అమాప్ చైర్ డాక్టర్ సురేష్ అలహరి, లక్ష్మి చిమట, శివ మొలబంటి, శ్రీకాంత్ మన్నెం, బనారసీ తిప్పా, ఇన్నయ్య యనమల, ఈశ్వర్ అరిగే, నాగ కుమారి అరిగే, త్రినాథ్ ముద్రగడ, గోపాల్ గూడపాటి, విజయ్ గుడిశేవ, వెంకట్ చలమల శెట్టి, ఆప్త కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లు, కుంచనపల్లి గ్రామప్రజలకు ఆప్త ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజు యిల్లూరి, చైర్ కిరణ్ పల్లాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్, డాక్టర్ శనక్కాయల రాధా మాధవి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ బిందేశ్ దాది, డాక్టర్ లంకా దుర్గ కళ్యాణ్, డాక్టర్ చప్పిడి అరుణ్ కుమార్, డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్, డాక్టర్ తోట నవీన్ కుమార్, డాక్టర్ కాట్రగడ్డ పృథ్వీరాజ్, డాక్టర్ పోతుల పవన్ సాయి, డాక్టర్ చాగంటి సింధు, డాక్టర్ చిద్రుపుపి, డాక్టర్ నందిని, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ అమూల్య గోవాడ, డాక్టర్ గిరీష్, డాక్టర్ రేష్మ, ఆపరేటర్ లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొని వైద్యసేవలను అందించారు. -
వేడుకలకు సిద్ధం కావాలి
{పజాప్రతినిధులను భాగస్వాములను చేయూలి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష హన్మకొండ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లైపై ఆదివారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయూలన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉత్తమంగా నిర్వహించిన ఐదు గ్రామ పంచాయతీలకు, ఐదు మండలాలకు అభివృద్ధి నిధులు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అధికారులకు అవార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని 12 పీహెచ్‌సీల్లో జూన్ 2న ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి కార్యక్రమాలు చేపట్టాలని, ఊరేగింపులు, ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. నగరంలోని కూడళ్లలో లైటింగ్‌తో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించాలని, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించాలని అన్నారు. కళాకారులతో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి పారితోషికం అంది స్తామని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, గిరిజానాభివృద్ధి శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నగరాన్ని విద్యుత్ కాంతులతో సుం దర ంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ సర్పంచ్‌లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశామని, జీపీ నిధుల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపా రు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో 117 మంది అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. అక్షరాస్యత మిషన్ కార్యక్రమాలు, కవిసమ్మేళనం, 2కే రన్, ర్యాలీలు, సాయంత్రం జేఎన్ఎస్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఆలయాలు, చర్చిలు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా మత పెద్దలతో మాట్లాడామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాట్ చెల్లించాల్సిందే..!
సాక్షి, ముంబై: భక్తుల పాలిట కొంగుబంగారం ‘లాల్బాగ్ చా రాజా’.. ప్రభుత్వానికి ఒక శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భక్తులు సమర్పించుకున్న కానుకలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ‘లాల్బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి’ దాఖలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. కానుకల వేలం, హుండీ నగదు రూపంలో వచ్చే డబ్బును ఏడాది కాలంలో పేదలకు ఆర్థిక సాయం, ఉచిత వైద్య శిబిరాలు, దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి వైద్యానికి అయ్యే ఖర్చులు, కరువు పీడిత ప్రాంత ప్రజలకు చేయూత వంటి సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడతామని, ఇందుకోసం తమకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉత్సవ మండలి దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు చేపట్టింది. విచారణ అనంతరం జస్టిస్ ఎస్.సీ.ధర్మాధికారి నేతృత్వంలోని బెంచి పిటిషన్‌ను తిరస్కరించింది. ‘భక్తులు సమర్పించుకున్న కానుకలు అసలు ధరకు విక్రయించడం లేదు. వాటిని వేలంలో విక్రయించడం వల్ల మండలికి అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక వ్యాపారం లాంటిదే’ అని బెంచి అభిప్రాయపడింది. వ్యాట్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాపారుల ఇక్కట్లు ‘లాల్బాగ్ చా రాజా’ వల్ల స్థానిక వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. గణేశ్ ఉత్సవాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి ముగిసేవరకు దాదాపు పక్షం రోజులపాటు బేరాలు లేక వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లాల్బాగ్ చా రాజా ను దర్శించుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు వస్తుంటారు. దీంతో వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. రోడ్లపై దారి పొడవునా బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు, వ్యాన్లు వంటి వాటి వల్ల కొనుగోలుదారులు షాపుల దరిదాపులకు కూడా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని లాల్బాగ్ ప్రాంత వ్యాపారుల సంఘటన అధ్యక్షుడు సూర్యకాంత్ పాంచాల్ హెచ్చరించారు. -
వైద్య శిబిరానికి విశేష స్పందన
జహీరాబాద్: లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. 1,357 మంది రోగులు తరలివచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. దీని లో భాగంగా మొదటి రోజు చెవి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించారు. 517మంది రోగులు చెవి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆపరేషన్ల కోసం గుర్తిం చిన వారిలో 15 మందికి సర్జరీలు చేశారు. గ్రహణం మొర్రికి సంబంధించి 7గురు పేర్లు నమోదు చేయించుకున్నారు. కంటి శుక్లాలకు సంబంధించి 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేం దుకు నిర్ణయించినా రోగులు అధికంగా రావడంతో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. 834 మంది కంటి వైద్యం కోసం వచ్చా రు. మంగళవారం నుంచి దంత వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నా రు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు జహీరాబాద్‌లోని రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులో ఉం చిన రైలులో వైద్య పరీక్షలు, అవసరమైన వారికి ఆపరేషన్లను నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు దంత వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపా రు. చెవి ఆపరేషన్ల కోసం గుర్తించిన వారిలో మిగిలిపోయిన రోగులకు మంగళవారం ఆపరేషన్లను నిర్వహించనున్నట్లు వారు వివరించారు. పలువురికి ఉచితంగా మిషన్లు ఇచ్చారు.