{పజాప్రతినిధులను భాగస్వాములను చేయూలి
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష
హన్మకొండ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లైపై ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయూలన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉత్తమంగా నిర్వహించిన ఐదు గ్రామ పంచాయతీలకు, ఐదు మండలాలకు అభివృద్ధి నిధులు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అధికారులకు అవార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని 12 పీహెచ్‌సీల్లో జూన్ 2న ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేయాలని సూచించారు.
అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి కార్యక్రమాలు చేపట్టాలని, ఊరేగింపులు, ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. నగరంలోని కూడళ్లలో లైటింగ్‌తో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించాలని, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించాలని అన్నారు. కళాకారులతో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి పారితోషికం అంది స్తామని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, గిరిజానాభివృద్ధి శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నగరాన్ని విద్యుత్ కాంతులతో సుం దర ంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ సర్పంచ్‌లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశామని, జీపీ నిధుల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపా రు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో 117 మంది అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.
అక్షరాస్యత మిషన్ కార్యక్రమాలు, కవిసమ్మేళనం, 2కే రన్, ర్యాలీలు, సాయంత్రం జేఎన్‌ఎస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఆలయాలు, చర్చిలు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా మత పెద్దలతో మాట్లాడామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.