Day of state formation
-
స్నాచర్ల వేటలో దిట్ట
టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ వెంకటస్వామి నేపథ్యమిది సర్వోన్నత పోలీసు పతకం పొందిన ఇద్దరిలో ఒకడు ‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే సిటీబ్యూరో: స్నాచర్ పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్‌సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు. -
ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
శాయంపేట : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న మండలంలోని ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ మర్కల రజని సూచించారు. సోమవారం మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని ప్రజాప్రతినిధులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఎంపీపీ అధ్యక్షతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజని మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాం స్కృతిక కార్యక్రమాలు, ముగ్గులపోటీలు, మహిళలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీపీ బాసని రమాదేవి, ఈవోపీఆర్డి సరస్వతి, మండలంలోని గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చిట్యాలలో.. చిట్యాల : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించాలని ఈఓపీఆర్డీ చందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మే 28 నుంచే గ్రామాలలో పాటల, ముగ్గుల, ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. జూన్ 2న గ్రామపంచాయతీలలో తెలంగాణ జెండాను ఆవిష్కరించాలన్నారు. జనాభా ఎక్కువ గల గ్రామపంచాయతీ సర్పంచ్‌లు రూ.6వేలు, చిన్న గ్రామపంచాయితీల సర్పంచ్‌లు రూ.3వేలు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసుకోవచ్చన్నారు. గణపురంలో.. గణపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ జూన్ 2న ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ప్రతిఒక్కరు వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ర్యాలీలు, ఆటల పోటీలు, సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి., తహసీల్దార్ జివాకర్‌రెడ్డి, ఎంపీపీ పోతారపు శారద, ఎంఈఓ సురేందర్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, గంధం ఓధాకర్, మాధాటి సత్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తములను గుర్తించకపోవడం విచారకరం.. చిట్యాల (మొగుళ్లపల్లి) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమంగా సేవలందించిన ఉద్యోగులను, సాహితీ వేత్తలను, రైతులను గుర్తించకపోవడం విచారకరమని సమాచార హక్కు చట్టం జిల్లా కోకన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, చిట్యాల, మొగుళ్లపల్లి మండల కన్వీనర్లు దేవరకొండ సత్యనారాయణ, చర్లపల్లి వెంకటేష్‌గౌడ్ అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉత్తములను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, మంత్రులు స్పందించి మండల స్థాయిలో ఉత్తములను గుర్తించాలని కోరారు. సమావేశంలో రెండు మండలాల నాయకులు గుర్రపు శ్రీధర్, విజేంధ్రాచారి, తడవర్తి ప్రసాద్, సరిగొమ్ముల రాజు, గండు రమేష్, బిక్షపతి, రాజేందర్, సుమన్ ఉన్నారు. -
వేడుకలకు సిద్ధం కావాలి
{పజాప్రతినిధులను భాగస్వాములను చేయూలి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష హన్మకొండ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లైపై ఆదివారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయూలన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉత్తమంగా నిర్వహించిన ఐదు గ్రామ పంచాయతీలకు, ఐదు మండలాలకు అభివృద్ధి నిధులు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అధికారులకు అవార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని 12 పీహెచ్‌సీల్లో జూన్ 2న ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి కార్యక్రమాలు చేపట్టాలని, ఊరేగింపులు, ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. నగరంలోని కూడళ్లలో లైటింగ్‌తో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించాలని, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించాలని అన్నారు. కళాకారులతో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి పారితోషికం అంది స్తామని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, గిరిజానాభివృద్ధి శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నగరాన్ని విద్యుత్ కాంతులతో సుం దర ంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ సర్పంచ్‌లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశామని, జీపీ నిధుల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపా రు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో 117 మంది అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. అక్షరాస్యత మిషన్ కార్యక్రమాలు, కవిసమ్మేళనం, 2కే రన్, ర్యాలీలు, సాయంత్రం జేఎన్ఎస్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఆలయాలు, చర్చిలు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా మత పెద్దలతో మాట్లాడామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్ సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పట్నం
♦ 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం ♦ ప్రతి ఇంటికీ రెండు ఎల్ఈడీ బల్బులు ♦ వందరోజుల ప్రణాళికను ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎంపిక చేసిన పట్టణాలను బహిర్భూమి రహితం(ఓడీఎఫ్)గా మార్చాలనే సంకల్పంతో వంద రోజుల ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ ప్రణాళికను అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు 100 శాతం మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియోకాన్ఫరెన్స్‌లో మార్గదర్శకాలను జారీచేశారు. బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు, బహిరంగ ప్రదే శాల్లో టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని నిర్దేశించారు. ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులు మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయనుంది. విద్యుత్‌ను ఆదా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సంప్రదాయ బల్బుల వాడకానికి మంగళం పాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రూ.20కే రెండు తొమ్మిది వాట్ల సామర్థ్యం గల ఎల్ఈడీలను అందించేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తోంది. వీటిని డిస్కమ్‌ల ద్వారా మున్సిపాలిటీల్లోనే గాకుండా గ్రామ పంచాయతీల్లోనూ పంపిణీ చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు న్యూఢిల్లీకి చెందిన ఈఈఎస్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే మున్సిపాలిటీల్లో అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా మూడో విద్యుత్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా 24 గంటలపాటు అత్యవసర సేవలందించే సంస్థలకు ప్రత్యేక లైన్ ద్వారా పంపిణీ చేయాలని యోచిస్తోంది. వందశాతం పన్నుల వసూలు స్థానిక సంస్థల్లో పన్నుల వ సూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ బకాయిలు, ఆస్తిపన్నును వంద శాతం వసూలు చేసే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కూడా రూ.2 కోట్ల మేర బకాయి పడింది. వీటన్నింటిని రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనుంది. ఇదిలావుండగా, బడంగ్‌పేట, వికారాబాద్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు/ ఘన వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛభారత్ మిషన్ కింద నిధులు కేటాయించేందుకు పురపాలక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి అనుగుణంగా డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. -
త్వరలో కల సాకారం
ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లా కేంద్రంగా వికారాబాద్ నెరవేరనున్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేస్తాం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దేవాలయాభివృద్ధికి కృషి చేస్తా రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్: రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం నాటికి వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని, దీంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నూతన రాజగోపుర ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కోసం ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతుందన్నారు. సీఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని స్పష్టంచేశారు. సాయంత్ర సమయంలో చిన్నారులు ఆడుకోవడానికి, బతుకమ్మలను నీటిలో వదలడానికి చెరువు చుట్టూ మెట్లను కూడా నిర్మిస్తామన్నారు. వికారాబాద్ పట్టణంలో తాగునీరు, రోడ్లు తదితర సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే ఈ ప్రాంత దశాదిశ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి హరిశ్వర్రావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే బతుకమ్మ వేడుకల పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్య, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీప్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ విజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, నాయకులు ఎల్లారెడ్డి, రాంచంద్రారెడ్డి, బొత్స శ్రీకాంత్, కిషోర్, గోపి, పాండు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.