హైదరాబాద్ : ఆరవ రోజు పుష్కరాలకు భక్తులు పొటెత్తారు. తెలంగాణలోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంలో భారీ ట్రాఫిక్ కారణంగా భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.