కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై విచారణ | high court accepts pil on kbr park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై విచారణ

Published Wed, Nov 23 2016 2:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

high court accepts pil on kbr park

 వ్యాజ్యాలు స్వీకరించిన హైకోర్టు
 సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్‌డీపీ) కింద చేపట్టిన బహుళ అంత స్తుల ఫ్లైఓవర్ల నిర్మాణానికి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో పెద్ద సంఖ్యలో చెట్లను నరికేస్తుండ టంపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ అంతస్తుల  ఫ్లైఓవర్ల  నిర్మాణం కోసం, కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ప్రముఖ పర్యావర ణవేత్త ప్రొఫెసర్ పురుషో త్తంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

చెట్ల నరికివేతపై ఓ పత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా దాన్నీ హైకోర్టు పిల్‌గా పరిగణించింది. 2 వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తున్నామంటూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement