సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. కాగా తమ వాదనకు... ప్రభుత్వం చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాదనలపై కౌంటర్ ఫైల్ చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం 26 కంటే ముందే పిటిషన్‌ను విచారించాలని కోరగా... ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment