
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటవీ ప్రాంతంలో నరికేసిన చెట్ల స్థానంలో మొక్కలను నాటే విషయమై ఏం చర్యలు తీసుకు న్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తొలగించిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. నరికేసిన చెట్లెన్ని.. నాటిన మొక్కలెన్ని.. మొత్తం వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది.
విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, మలక్‌పేట గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తం పెద్ద సంఖ్యలో చెట్లను అనుమతులు తీసుకోకుండా నరికేశారని, కొత్త మొక్కలను నాటేం దుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డి.మహేశ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment