
సాక్షి, హైదరాబాద్: భువనగిరి, యాదాద్రి జిల్లాల్లో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఏవిధంగా జరుగుతుందో వివరిస్తూ పోలీసులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ)కి ఉమ్మడి హైకోర్టు సూచించింది. టీజేఏసీ దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోగా దాన్ని పరిష్కరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 21, 22 తేదీల్లో స్ఫూర్తి యాత్ర నిర్వహించేందుకు తాము చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించడంతో టీజేఏసీ కో కన్వీనర్ గోపాల్ శర్మ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
బుధవారం దీన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ విచారించి ఉత్తర్వులు జారీ చేశారు. అమరుల స్ఫూర్తి యాత్ర ఏ తేదీన ఎక్కడెక్కడ కొనసాగుతుంది, ఎన్ని వాహనాలు వినియోగిస్తారు.. తదితర సమగ్ర సమాచారంతో పోలీసులకు టీజేఏసీ దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో స్ఫూర్తి యాత్ర జరిపేందుకు ఇప్పటికే చేసుకున్న దరఖా స్తును తోసిపుచ్చడానికి గల కారలేమిటో కౌంటర్ పిటి షన్ ద్వారా తెలపాలని పోలీసులను ఆదేశించింది.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం..
టీజేఏసీ సభ్యుల గత చరిత్రను గమనంలోకి తీసుకునే స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వలే దని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారు కూడా టీజేఏసీలో ఉన్నారని, శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. 27 నుంచి ప్రారం భం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పోలీసుల అవసరం ఉందని చెప్పారు. ఈ కారణాలతోనే స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వలేదని విన్నవించారు. మిగిలిన రెండు జిల్లాల్లో స్ఫూర్తి యాత్ర కోసం తిరిగి దరఖాస్తు చేసుకుంటే పోలీసులు పరిశీలిస్తారన్నారు.
తిరిగి టీజేఏసీ దరఖాస్తు చేసుకునేందుకు, దరఖాస్తును పరిష్కరించేం దుకు ఇరుపక్షాలు అంగీకారానికి రావడంతో అందుకు అనుగుణంగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం కౌంటర్ వేసేందుకు వారం సమయం కావా లని కోరడంతో విచారణ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment