బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డిపై గతేడాది నవంబర్ 19న కాల్పులు జరిపిన గ్రేహౌండ్స్ మాజీ కానిస్టేబుల్ పి.ఓబులేసుకు హైకోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 19న హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద వాకింగ్ చేస్తున్న నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో ఓబులేసు ఆయనపై ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టైన ఓబులేసు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. ఈ బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
ఓబులేసుకు హైకోర్టులో చుక్కెదురు
Published Thu, Jul 2 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement