గుంటూరు: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరురాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు సాగర్ కిరువైపులా చేరారు. వారికి బందోబస్తుగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితుల్లో సాగర్ నుంచి కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించారు. దీనిని అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు.