irrigation officers
-
శాంతిస్తున్న ‘గోదావరి’
సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురి సౌత్: కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు మరింత తగ్గుతూ నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద శనివారం పూర్తిగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.40 అడుగులకు చేరుకుంది.తేరుకుంటున్న కోనసీమ లంకలుమరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ లంకలు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. కానీ, జిల్లాలో ప్రధాన కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.దీంతో ఆయా ప్రాంతాల లంకవాసులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం ముంపు మరింత తగ్గే అవకాశమున్నందున ఆదివారం నుంచి లంక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.శ్రీశైలానికీ తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికీ ఎగువ నుంచి వచ్చే వరద తగ్గింది. ఇక్కడకు గురువారం నుంచి శుక్రవారం వరకు 1,25,938 క్యూసెక్కుల నీరు రాగా.. శ్రీశైలం నుంచి దిగువకు 1,20,367 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 211.457 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వచ్చే నీటి చేరిక తగ్గింది. -
బుల్కాపూర్ నాలా మాయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న బుల్కాపూర్ నాలాను మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి తేజ, ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ లింగంలు సందర్శించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా.. కబ్జాకు గురైన బుల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటు వైపు వెళ్తోంది? ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది? ఎవరి కబ్జాలో ఉంది? వంటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. శంకర్పల్లి–ఖానాపూర్ రోడు్డలో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలావరకు కన్పించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్లు 2020 జూన్‌లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఫాంహౌస్ తూర్పు భాగంలో, నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయా విభాగాల అధికారులు బుధవారం మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. గతంలో రేవంత్‌పై కేసు, అరెస్టు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్ సందర్శనకు వెళ్లారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివసిస్తున్న ఈ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇటీవల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఇదే క్రమంలో జన్వాడ ఫాంహౌస్‌కు నోటీసులు జారీ చేయగా, హైడ్రా చర్యలను ఆపాల్సిందిగా కోరుతూ కేటీఆర్ సన్నిహితుడు బి.ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
‘కాళేశ్వరం’ విచారణ.. నేడు కమిషన్ ముందుకు 18 మంది మాజీలు
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో తాజా మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా.. కాళేశ్వరం కమిషన్ ముందుకు 18 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. ఈ ఇరిగేషన్ అధికారులు మధ్యాహ్నాంలోపే నేరుగా కమిషన్ కార్యాలయానికి వెళ్తారని, కమిషన్ అడిగిన వివరాలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు.నిన్నటి విచారణకు..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్‌సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది.జూన్‌లోపు పూర్తి కాదుకాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల భేటీజస్టిస్ పీసీ ఘోష్‌తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 54 ఫిర్యాదులు:జస్టిస్ పీసీ ఘోష్కాళేశ్వరం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్‌కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు. -
పని చేస్తున్నారా.. ఇంట్లో పడుకుంటున్నారా ?!
సాక్షి, వరంగల్: రూ.కోట్ల కొద్ది నిధులతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులును పరిశీలించకుండా ఇరిగేషన్ అధికారులు ఇంట్లో పడుకుంటున్నారా అని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు సమీప పాకాలవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు వడ్డెరగూడెం సమీపంలోని చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఇవేం పనులు.. అంటూ ఇరిగేషన్ డీఈ ఉపేందర్, ఏఈలు నిహారిక, శేఖర్‌ను పిలిచి ఆరా తీశారు. ‘అసలు మీరేం చేస్తున్నారు? మొత్తం మట్టి కనిపిస్తుంది. సిమెంట్‌తో కడుతున్నారా.. మట్టితోనా’ అని ప్రశ్నించారు. ‘మీరసలు పనుల వద్దకు వస్తున్నారా.. కమీషన్లు తీసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈ ఉపేందర్ కలగచేసుకుని ఇంతకాలం మరో డీఈ ఉండేవారని, తాను కొత్తగా వచ్చినట్లు చెప్పగా ఏఈలపై ఆగ్రహం చేశారు. మరో రెండు వారాల్లో డ్యాం చుట్టూ కట్టే రాతి కట్టడాలలో సిమెంట్ నింపి కట్టాలని, ఇలా మట్టితో కాదని సూచించారు. మళ్లీ వచ్చి చూసే వరకు నాణ్యత లేకుంటే బిల్లులు ఆపిస్తానని హెచ్ఛరించారు. చదవండి: భిక్కనూరులో పాజిటివ్.. నిజామాబాద్‌లో నెగెటివ్ -
ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు కడలి పాలయ్యాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలో కలసిపోయాయి. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. నీట మునిగిన దేవీపట్నం దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్ వాటర్‌తో చింతూరు–వీఆర్ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. స్థిరంగా వంశధార.. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
గుండె చెరువు
నీరు–చెట్టు పనుల్లో అధికారులు, టీడీపీ నాయకుల చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన పనుల్లో డొల్ల వెలుగుచూసింది. దీర్ఘకాలం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరోసారి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. కరువుతో నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్న తరుణంలో అనుకోని అతిథిగా వచ్చిన వర్షం నీరు చెరువుకు చేరినా ఫలితం లేకపోయింది. చెరువు కట్ట మరమ్మతులకు గత ఏడాది మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో వర్షంనీటి ఉధృతికి రింగ్‌బండ్ తెగి పంటపొలాలపై నీరు ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాక్షి, మార్కాపురం : వర్షాకాల మొచ్చినా చెరువుల అభివృద్ధి, వాటి పనులను పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బొందలపాడు చెరువు కింద 80 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు నీరు వచ్చిన ప్రతిసారీ కట్ట తెగిపోవటం సర్వసాధారణమైంది. ఇరిగేషన్ అధికారులు ఏటా నీరు చెట్టు కింది కట్ట మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా కూడా చెరువుకు వచ్చిన నీరు వృథాగా పోతోంది. నీరు చెట్టు కింద 2017–18 సంవత్సరంలో నూతన తూము ఏర్పాటు చేయటానికి రూ. 8 లక్షలు నిధులు ఖర్చు చేశారు. ఇదే చెరువుకు గత ఏడాది కూడా మళ్లీ రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో తూము ఏర్పాటు చేయటంలో అధికారులు, కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎట్టకేలకు ఇటీవల నెల కిందట నూతన తూమును ఏర్పాటు చేయటానికి పాత తూమును తొలగించారు. ఆ తూము ముందు రింగ్ బండ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ రింగ్ బండ్లో నాణ్యతో లోపించటంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువుకు నీరు రావటంతో రింగ్ బండ్ తెగిపోయింది. అలాగే దీంతో పాటు చెరువు కట్టకు రంధ్రం పడి నీరంతా పంట పొలాలపై ప్రవహించింది. దీంతో ఐదెకరాల పత్తి పంట దెబ్బతింది. తనకు దాదాపు రూ. 1.5 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబో అంటున్నారు. ప్రతి ఏటా నీరు చెట్టు కింద టీడీపీ నాయకులు పనులు చేపట్టడం. అవి నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షానికి తెగిన బొందలపాడు చెరువుకట్ట ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని బొందలపాడు చెరువుకు నీరు చేరింది. అయితే ఆ చెరువుకు కొంతమేర నీరు రావటం రింగ్ బండ్ తెగిపోయి అదంతా బయటకు వెళ్లిపోయింది. చెరువు కట్ట నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే రింగు బండ్ కొట్టుకు పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వృథాగా పోవటంతో దిగువన ఉన్న ఐదెకరాలు పత్తి పంట నష్టం వాటిల్లింది. దీంతో ఆ రైతు లబోదిబో మంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో కారకులపై ఫిర్యాదు చేయటం జరిగింది. రాకరాక వచ్చిన నీరు పోవడంతో పాటు, చెరువుకట్టకు రంధ్రం పడటం, రింగ్‌బండ్ తెగిపోవడం మళ్లీ నిర్మాణం చేపట్టాల్సి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లోపించే చెరువు రింగ్‌బండ్ తెగింది అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రింగ్ బండ్ నిర్మాణంలో నాణ్యతో లోపించటం వల్లనే తెగింది. ప్రతి ఏటా నీరు చెట్టు కింద రూ. లక్షోల్లో నిధులు మంజూరు చేస్తున్నారు. అయితే నాణ్యత లేకుండా జరిగే పనులు వల్ల ఆతర్వాత వచ్చే వర్షానికి చెరువు కట్ట తెగిపోవటం పరిపాటి అయింది. అధికారులు పచ్చచొక్కాదారులకు కొమ్ముకాయడం వల్లే రైతులు నష్టపోతున్నారు. ఈ చెరువు నిండుతే నాలుగు గ్రామాలకు నీరు వస్తుంది. ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించి సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయింలి. తుమ్మా వెకంటేశ్వర రెడ్డి, బొందలపాడు నీరు ఉధృతంగా రావటంతో రింగ్‌బండ్ తెగింది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం పడి చెరువుకు ఉధృతంగా నీరు రావటం వల్లే ఆ రింగ్ బండ్ తెగింది. నాణ్యతాప్రమాణాలను తప్పక పాటించి పనులు సదరు కాంట్రాక్టర్‌తో చేయించటం జరుగుతుంది. మరళా వర్షాలు పడేలోపే చెరువు రంధ్రానికి, తూము ఏర్పాటు చేసి ఇలా మరలా అలా జరకుండా చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ ఏఈ రమణి -
ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువులు, కుంటలను ప్రాజెక్టులకు అనుసంధానించి వాటిని ఆ నీటితో నింపాలని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పటిష్టమైన మైనర్ ఇరిగేషన్ నెట్వర్క్ సిస్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జలసౌధలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవసరాలకు అనుగణంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ–డిజైనింగ్ చేశారని, తెలంగాణలోని బీడు భూముల్లో నీరు పారించేలా ప్రణాళికలు తయారు చేశారని వివరించారు. జిల్లాల వారీగా మేజర్, మైనర్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గొళుసు కట్టు చెరువులను గుర్తించి వాటిని ఏ ప్రాజెక్టు నీటి ద్వారా నింపే అవకాశం ఉందో తెలుసుకోవాలన్నారు. ప్రతీ ప్రాజెక్టు నుంచి గొలుసు కట్టు చెరువులు నింపాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు సీఈలు, ఎస్ఈలు, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు నెల రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెరువులను నింపడం ద్వారా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నీటి భద్రత లభిస్తుందన్నారు. అంతకుముందు మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ, గొళుసు కట్టు చెరువుల తాజా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి మైనర్ ఇరిగేషన్ అధికారులు వివరించారు. -
లంచం తీసుకుంటూ ఇరిగేషన్ అధికారుల పట్టివేత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చిన్ననీటి పారుదల శాఖ కార్యాలయంలో అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాజీపేటకు చెందిన బదిరుల్లా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పనులు చేయించాడు. అందుకు సంబంధించిన బిల్లు మంజూరు కోసం ఏఈ వరప్రసాద్, డీఈ రమణారెడ్డి రూ.80వేలు డిమాండ్ చేయగా ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం వారికి కార్యాలయంలోనే రూ.80 వేలు లంచం ఇచ్చాడు. అదే సమయంలో అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు తీసుకున్న ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. -
ఆధునికీకరణకు సమగ్ర ప్రణాళిక
ఇరిగేషన్ అధికారుల, సమావేశంలో, కలెక్టర్ భాస్కర్ irrigation officers, meeting, collecter bhaskar ఏలూరు సిటీ : జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో డెల్టా ఆధునికీకరణ పనుల ప్రగతిపై ఇరిగేషన్ ఏఈలతో ఆయన సమీక్షించారు. జిల్లాలో రూ.76.57 కోట్లతో చేపట్టనున్న 76 పనులను ఏప్రిల్ 7 నుంచి మే 12 నాటికల్లా పూర్తి చేయాలన్నారు. ఈనెల 29న కాలువలను మూసివేస్తున్న దృష్ట్యా డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేసేందుకు ఇప్పటి నుంచే ఇరిగేషన్ అధికారుల బృందం సన్నద్ధం కావాలన్నారు. ఆధునికీకరణ పనులు కేవలం అధికారుల, కాంట్రాక్టర్ల బద్ధకం వల్లే ఆలస్యమయ్యాయని, ఈ సీజన్లో పనులు పూర్తి చేయకపోతే శాఖాపరమైన చర్యలు, ప్రభుత్వపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలవరం, చింతలపూడి సేద్యపునీటి ప్రాజెక్టు పనులు తప్ప జిల్లాలో ఇతర అన్ని ఇరిగేషన్ పనులు ఈ వేసవి సీజన్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు నెలలు కాలువల వెంట తిరుగుతా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షా సమావేశాలను రానున్న రెండు నెలల్లో నిర్వహించబోనని కాలువల వెంట పర్యటిస్తానని, డెల్టా ఆధునికీకరణ పనులు ప్రగతి తీరును స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు చేసే కార్మికులు కూడా మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట మధ్య మాత్రమే భోజన సమయాన్ని కేటాయించుకోవాలని చెప్పారు. గతేడాది ఎక్కడికి వెళ్లినా కార్మికులు భోజనానికి వెళ్లారని చెప్పారని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భోజనం చేస్తున్నారనే మాటే తప్ప ఎక్కడా కార్మికులు కనిపించలేదని ఈసారి అలా జరగడానికి వీల్లేదన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యాన తోటల అభివృద్ధికి ప్రణాళిక ఏలూరు సిటీ : జిల్లాలో నూతన ఆలోచనా విధానాలతో ఉద్యాన తోటల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఉద్యాన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యాన పంటల రకాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలన్నారు. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ ప్రసాద్, ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఇరిగేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం పేపర్ బోర్డు నీటి వినియోగంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోదావరి నుంచి రోజుకు ఎంత నీటిని వాడుకుంటున్నారో లెక్కించి చెప్పాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై మండిపడింది. ఒక దశలో కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసేందుకుసిద్ధమైంది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అదనపు అఫిడవిట్ దాఖలు నిమిత్తం 2 వారాల గడువు కోరడంతో కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. భద్రాచలం పేపర్ బోర్డు అక్రమంగా నీటిని వాడు కుంటోందని ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి 2012లో హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. -
ఇరిగేషన్ అధికారుల నిర్బంధం
బండారుపల్లి (తాడికొండ రూరల్): ఎండిపోతున్న మిరప పంటలకు సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఇరిగేషన్ అధికారులను నిర్బంధించిన ఘటన బండారుపల్లి మేజర్‌పై బుధవారం జరిగింది. అరకొరగా సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం పర్యవేక్షణ పేరుతో బండారుపల్లి మేజర్ వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు హుటాహుటిన అక్కడకు వచ్చి ఎస్ఈ రాంప్రసాద్‌ను చుట్టుముట్టారు. చివరి భూములకు సరిపడా నీటిని విడుదల చేయాలని ఆందోళన చేశారు. ఎంత సేపటికీ వదలకపోవడంతో అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మంత్రి దేవినేని ఉమా, ఇరిగేషన్ సీఈ వీర్రాజులతో ఫోన్లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో చివరి ఎకరం తడిసే వరకు తానే దగ్గరుండి నీటిని విడుదల చేయిస్తానని సీఈ వీర్రాజు హామీ ఇచ్చారు. అలాగే, ఈ ఆందోళనలో జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, టీడీపీ నాయకులు మానుకొండ శివరామకృష్ణ, రత్తయ్య, గుంటుపల్లి మధుసూధనరావు, పొన్నెకల్లు, రావెల, మందపాడు, మేడికొండూరు, బేజాత్పురం తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలి
కోడేరు (ఆచంట) : సాగు నీరు అందించకపోతే ఆయా రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం ఆచంట మండలం కోడేరు బ్యాంకు కెనాల్‌తో పాటు ఎ.వేమవరంలో పంట చేలను ఆయన పరిశీలించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ప్రధానంగా బ్యాంకు కెనాల్, జగ్గరాజు, దేవ కాలువల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని, బ్యాంకు కెనాల్ ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని వెంటనే బ్యాంకు కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు రైతులకు ఎటువంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకు కెనాల్‌పై ప్రొక్లైనర్లతో మట్టితీత, చెత్తా, తూడు తొలగింపు పనులు నిరంతరం కొనసాగుతూ ఉండాలని ఆదేశించారు. బ్యాంక్ కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే రైతులు ఒక పంటను వదులుకోవాల్సి ఉంటుందని, ఇందుకు రైతులు సిద్ధపడితే పూర్తిగా ప్రక్షాళన చేస్తానని రైతులకు, రైతు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, కోడేరు సర్పంచ్ పెచ్చెట్టి సత్యనారాయణ, సాగునీటి సంఘ నాయకులు సలాది రంగారావు, బొక్కా వెంకట నారాయణ, వైట్ల విద్యాధరరావు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకి శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకి 1,133 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,826, నర సాపురం(కాకరపర్రు) 1,983, జీ అండ్ వీ(గోస్తనీ) 636, అత్తిలి(గొడిచర్ల) కాలువకి 677 క్యూసెక్కులు విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆక్రమణల్ని తొలగించండి
ఏలూరు : జిల్లాలో పంటబోదెలు, డ్రెయిన్ల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంటబోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలకు గురి అవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పంట బోదెలను ఆక్రమించుకుని నీటిపారుదలకు ఆటంకం కలిగించడం వల్ల వచ్చే వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నష్టపోయే ప్రమాదముందన్నారు. డ్రెయిన్లను ఆక్రమించుకోవడం వల్ల మురుగునీరు రోడ్లపై చేరుకుని ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందన్నారు. పంట బోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన కాంకడ్రు రామకృష్ణ తమ గ్రామంలోని పొలాల నుంచి వర్షపునీరు వెళ్లే దారిని గౌరీపట్నంకు చెందిన రైతు పటార్ జబ్బర్ బాషా మూసివేయడం వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ఆకివీడు మండలం తరటాన గ్రామానికి చెందిన మల్లారెడ్డి వంశీ భాస్కర్, గ్రామ ప్రజలు తాగునీటి కోసం మంచినీటి చెరువుపై ఆధారపడుతున్నామని, అయితే చెరువుకు ఇరువైపులా రొయ్యల చెరువుల కారణంగా నీరు కలుషితమవుతోందని, రోగాల బారిన పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన కొల్లంశెట్టి కృష్ణ, యు.తరుణ్, కె.సూర్యకుమారి తదితరులు గ్రామంలో జనావాసాల మధ్య తోళ్ల పరిశ్రమ నిర్వహించడం వల్ల భరించరాని దుర్గంధంతో ఇబ్బందులు పడడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నామని చెప్పారు. మరికొంత మంది తమ సమస్యలను వివరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ట్రైనీ కలెక్టర్ ఎంఎ కిషోర్ పాల్గొన్నారు. పోస్ట్ కార్డుల ద్వారా సమాచారం పంపండి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించిన తర్వాత 15 రోజుల్లోగా పోస్టుకార్డు ద్వారా ప్రజలకు సమాచారాన్ని విధిగా అందించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించకుంటే ఎలా? జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీలకు డెల్టా మండలాల్లో 2 వేల రోజుల పనిదినాలు, అప్ల్యాండ్ మండలాల్లో 5 వేల రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఎంపీడీవోలకు ఇచ్చిన లక్ష్యాన్ని సాధించకపోవడంపై కలెక్టర్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాలపై ఆయన సమీక్షించారు. అంగన్వాడీ సిబ్బందికీ బయోమెట్రిక్ హాజరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని మహిళా శిశు,సంక్షేమశాఖ (ఐసీడీఎస్) పథకాల అమలుపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది సమీపంలోని పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి హాజరు వేయాలన్నారు. -
వరి పంటకు నీరు ఇవ్వలేం
కర్నూలు: తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సోమవారం కర్నూలులో వ్యవసాయ, సాగునీటి అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు. దిగువ కాల్వ కింద కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులకు అధికారులు తెలిపారు. వరిపంటకు నీరు విడదల చేసేందుకు ప్రాజెక్టులో నీరు లేదని వారు పేర్కొన్నారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరురాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు సాగర్ కిరువైపులా చేరారు. వారికి బందోబస్తుగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితుల్లో సాగర్ నుంచి కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించారు. దీనిని అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. -
కడప పర్యటనలో వైయస్ జగన్
-
వడ్డిపాళెంలో 30 ఇళ్ల కూల్చివేత
నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : కాలువ ఆక్రమణలు తొలగించనందుకు కలెక్టర్ స్వయంగా హాజరుకావాలంటూ హైకోర్టు ఇచ్చిన నోటీసులతో రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసులతో కలిసి రంగంలోకి దిగారు. నెల్లూరు శివారులో ముత్తుకూరురోడ్డు సమీపంలో ఉన్న వడ్డిపాళెం పంట కాలువల వద్ద పేదలు వేసుకున్న 30 ఇళ్లను బుధవారం కూల్చేశారు. ఒక్కసారిగా ఇళ్లు కూల్చేయడంతో అనేకమంది పేదలు వీధినపడ్డారు. వడ్డిపాళెం సమీపంలోని రెండు పంటకాలువల మధ్య 30 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలో కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని, పొలాలకు నీరు సరిగా పారడం లేదంటూ వడ్డిపాళేనికి చెందిన మల్లి సింహగిరి 2012లో హైకోర్టులో పిటీషన్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కాలువను ఆక్రమించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణలను తొలగించాలని రెండు నెలల క్రితం హైకోర్టు అధికారులను ఆదేశించింది. అప్పట్లోనే అధికారులు ఇళ్లను కూల్చే ప్రయత్నం చేయగా కొందరి ఒత్తిళ్ల మేరకు తాత్కాలికంగా ఆపారు. కోర్టు ఉత్తర్వులను రెవెన్యూ అధికారులు ఖాతరు చేయడం లేదంటూ, కలెక్టర్‌ను బాధ్యుడిగా చేస్తూ సింహగిరి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు ఆక్రమణలను తొలగించడం, పంట కాలువలో పూడిక తీయడంతో పాటు కలెక్టర్ ఫిబ్రవరి 3న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. బాధితులకు పునరావాసం కూడా కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులో జాప్యం తన మెడకు చుట్టుకోవడంతో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులపై కలెక్టర్ శ్రీకాంత్ మండిపడ్డారు. మంగళవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. మోహరించిన పోలీసులు ఆక్రమణల తొలగింపునకు మంగళవారం రాత్రే అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా బుధవారం వేకువజామున నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు సాంబశివరావు, జగన్మోహన్రావు, ఆరుగురు ఏఎస్సైలతో పాటు 100 మంది పోలీసులు వడ్డిపాళెంలో మోహరించారు. నెల్లూరు ఇన్చార్జి తహశీల్దార్ సాంబశివరావు, ఇందుకూరు పేట తహశీల్దార్ శీనానాయక్, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు వడ్డిపాళెం చేరుకుని ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు. పేదలమైన తమ ఇళ్లను కూల్చవద్దంటూ బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో 17 మందిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కన్నీరుమున్నీరైన పేదలు ఇళ్లను ఒక్కసారిగా అధికారులు కూ ల్చివేయడంతో నిరాశ్రయులైన పేద లు కన్నీరుమున్నీరయ్యారు. కూలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు హడావుడిగా పైకప్పు రేకులు పగలకుండా స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. ఇళ్ల కూల్చివేతకు కారకుడైన సింహగిరిపై మండిపడ్డారు. ఇళ్లకు ఏమీ ఇబ్బంది లేదని నిన్నమొన్నటి వరకు నమ్మించిన సింహగిరి, ఇలా నట్టేట్లో ముంచుతాడని అనుకోలేదని వాపోయారు. అధికారులు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో ఆరుబయటే సామగ్రితో పడిగాపులు కాస్తున్నారు. వీరికి కొత్తూరు వద్ద స్థలాలు కేటాయించే యోచనలో అధికారులు ఉన్నారు. ఇళ్ల తొలగింపు ఎవరి కోసం ! కాలువల మధ్య పేదలు కట్టుకున్న ఇళ్లతో రైతులకు ఎలాంటి నష్టం లేదు. సింహగిరికి చెందిన 4.25 ఎకరాలకు సంబంధించిన కాలువ నీటి పారుదలకు యోగ్యంగానే ఉంది. ఓ పార్టీ నేతగా చెలామణి అవుతున్న సింహగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు వేయడం పేదలకు శాపంగా మారింది. -
అన్నదాత ఆగ్రహం
సాగునీటి కోసం లోసరి కాలువ ఆయకట్టు రైతుల పోరాటం ఇరిగేషన్ అధికారుల తీరుపై నిరసన నేడు కలెక్టరేట్ ఎదుట బైఠారుుంపు సంఘీభావం ప్రకటించిన బీజేపీ భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం మండలంలోని లోసరి మెయిన్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని రైతులకు విత్తనాలిచ్చారు.. నారుమళ్లు పోసుకోమన్నారు.. నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఇరిగేషన్ అధికారులు కాలువకు అడ్డుకట్టలు వేసి సాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఇదేంటని అడిగితే.. అదంతే అంటున్నారు. దీంతో నాలుగు రోజు ల క్రితం ఆందోళనకు దిగిన అన్నదాతలు కాలువపై వేసిన అడ్డుకట్టలను తొలగిం చారు. ఆ మరుక్షణమే ఇరిగేషన్ అధికారులు మళ్లీ అడ్డుకట్టలు వేశారు. ఆవేదనకు గురైన రైతులు భీమవరం తహసిల్దార్ కార్యాల యూనికి చేరుకున్నారు. సాగునీరు ఇప్పించాలంటూ గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బైఠాయించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఇదేపని చేశారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. రైతులు వేసిన టెంట్‌ను రెవెన్యూ అధికారులు తొలగిం చారు. వంటావార్పు కోసం తెచ్చుకున్న సామగ్రిని బలవంతంగా లాక్కుని తహసిల్దార్ కార్యాలయంలో దాచేశారు. చివరకు రైతులందర్నీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పరిస్థితిని గమనిం చిన రైతులు ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించారు. శనివా రం ఏలూరు వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు గురువారం ఉదయం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయూరు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టూటౌన్ సీఐ జయసూర్య ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్సై విజయకుమార్, రూరల్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బందితోపాటు భీమవరంలో మకాం వేసిన సీఆర్పీఎఫ్ బలగాలను తహసిల్దార్ కార్యాలయం వద్ద మోహరించారు. రైతుల్ని నష్టపరుస్తారా? పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రుద్రరాజు సత్యనారాయణరాజు (పండురాజు) లబ్ధి కోసం రైతులను నష్టపరుస్తారా అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ శాఖ అధ్యక్షుడు రేవు రామకృష్ణ అధికారులను నిలదీ శారు. సార్వాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, దాళ్వాకు అనుమతి ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోసరి కెనాల్‌కు వేసిన అడ్డుకట్టను రైతులు తొలగిం చిన సమయంలో నరసాపురం ఆర్డీవో వసంతరావు వచ్చారని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు మరోసారి అడ్డుకట్ట వేయడం దారుణమన్నారు. సాగునీరు ఇవ్వలేనప్పుడు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను ఎందుకు సరఫరా చేశారని ప్రశ్నించారు. మొత్తం 3,500 ఎకరాల్లో రైతులు నారుమళ్లు వేశారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని, రైతుల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, పలువురు మహిళా రైతులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల సంఘీభావం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర గాంధీ తదితరులు కలిశారు. వారు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రైతులను నష్టాల పాల్జేసి కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చేవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని శ్రీనివాసవర్మ ధ్వజమెత్తారు. రైతులకు తాము అండగా ఉంటామని, కాంట్రాక్టర్ ఆటల్ని సాగనివ్వబోమని అన్నారు. -
నారుమడికి నీరేదీ?
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘రబీ సాగును ఆలస్యం చేయవద్దని మేము ముందు నుంచీ చెబుతున్నాం. అయినా సాగు ఆలస్యమవుతోంది. నీటి ఎద్దడి ఏర్పడితే మేమేం చేయలేం’ ఇవి ఇరిగేషన్ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు. ‘సాగు చేయాలని మాకూ లేదు. కానీ, పొలం వరకూ నీరిస్తే వెంటనే నారుమళ్లు వేస్తాం’ ఇది రైతులు అంటున్న మాట. వీరి మాటలు ఎలా ఉన్నా అటు తూర్పుడెల్టాకు, ఇటు మధ్యడెల్టాకు నారుమళ్ల సమయానికి ఇవ్వాల్సిన దానికన్నా అధికంగానే సాగునీరు విడుదల చేస్తున్నారు. అయితే ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెల వరకు పూడుకుపోవడంతో శివారు చేలకు నీరందడం లేదు. అసలే ఖరీఫ్ కోతలు ఆలస్యం కావడానికి తోడు నీరందని పరిస్థితి ఏర్పడడంతో డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. రెండు డెల్టాల్లో ఇప్పటి వరకూ కేవలం 40 శాతం మాత్రమే నారుమళ్లు వేయగా, వాటి పరిధిలోని శివారు మండలాల్లో 20 శాతానికి మించి వేయకపోవడం గమనార్హం. హెలెన్ తుపానుతో ఖరీఫ్ వరి పంట నష్టపోవడానికి తోడు రెండు డెల్టాల్లో ప్రధాన పంటకాలువల వ్యవస్థ అధ్వానంగా మారింది. అడిగే నాథులు లేరు.. ఏడాదిన్నర కాలంగా నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ చానళ్లు, పంటబోదెలు చెత్తాచెదారంతో నిండి, పూడుకుపోవడంతో నీరు పారడంలేదు. హెలెన్ తుపానుకు పంటకాలువలకు, చానళ్లకు అడ్డుగా కొబ్బరిచెట్లు, ఆకులు పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనితో నారుమళ్లు వేద్దామన్నా నీరు లేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీసాగుకు ముందు ఆయా కాలువల పరిధిలో ఇరిగేషన్ అధికారులు షార్ట్ క్లోజర్ పనులు చేయిస్తుంటారు. రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువాను ఇందుకు వెచ్చించి, నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేయించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో నీటి తీరువాతో పనులు చేయించాలనే నాథులే లేకుండా పోయారు. అధికారులు ఈ ఏడాది తూర్పు, మధ్యడెల్టాలలోని ప్రధాన పంటకాలువల్లో పూడిక, తూడు, గుర్రపుడెక్క, మొక్కలు తొలగించేందుకు కేవలం రూ.2.85 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిలో తూర్పుడెల్టాకు రూ.2.05 కోట్లు కేటాయించగా అందులో రూ.26 లక్షలతో లాకులపై షట్టర్ల మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. మధ్యడెల్టాకు కేవలం రూ.80 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇందుకు సంబంధించి టెండర్లు ఖరారైనా పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. సాగు ఆరంభానికి ముందే కాలువల్లో నీరు సక్రమంగా పారేందుకు గుర్రపుడెక్క, చెత్త తొలగించాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఆ పనులు పూర్తి చేయించకుండా తాపీగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సాగు ఆలస్యమై నీటి ఎద్దడి ఏర్పడితే తమకు సంబంధంలేదంటూ ఇరిగేషన్ అధికారులు ప్రకటనలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలువలను బాగు చేయించాలని నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు కోరుతున్నారు -
డెల్టా ఆధునికీకరణ లేనట్టే
సాక్షి, కాకినాడ : ఈసారి కూడా డెల్టా కాలువల ఆధునికీకరణ లేనట్టే. కేవలం డ్రెయిన్ల ఆధునికీకరణ.. అది కూడా ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 15కల్లా కాలువలను మూసివేస్తేనే చేయగలమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పేశారు. డెల్టా ఆధునికీకరణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గురువారం సమీక్షించారు. ఉభయగోదావరి జిల్లాల్లో రబీ షార్ట్ క్లోజర్లో రూ.150 కోట్ల విలువైన మీడియం, మైనర్ డ్రెయిన్ల ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు షార్ట్ క్లోజర్లో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేమని స్పష్టం చేశారు. ఆధునికీకరణ పనుల ప్రగతిని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి వివరించారు. తూర్పున రూ.250 కోట్ల పనులే.. ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా ఆధునికీకరణకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3360కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.550 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. తూర్పుగోదావరిలో రూ.1800 కోట్ల విలువైన పనులకు గాను రూ.824 కోట్ల పనులకు ప్యాకేజీలు ఖరారు కాగా, ఇప్పటి వరకు రూ.250 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని ఈస్ట్రన్ డెల్టాలో కాకినాడ, మండపేట కాలువల్లో 30 శాతం, సామర్లకోట, బ్యాంక్ కెనాల్‌లలో 15 శాతం, సెంట్రల్ డెల్టాలో గన్నవరం కెనాల్ పరిధిలో మాత్రమే 40 శాతం ఆధునికీకరణ పనులు జరిగాయి. ఇంకా సెంట్రల్ డెల్టాకు సంబంధించి బ్యాంకు కెనాల్‌తో పాటు అమలాపురం కెనాల్‌కు ప్యాకేజీలే ఖరారు కాలేదు. కోరంగి కెనాల్‌కు ఇటీవలే ప్యాకేజ్ ఖరారైంది. 2012లో సాగుసమ్మె కారణంగా తుల్యభాగ డ్రెయిన్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయగలిగామని సీఈ తెలిపారు. రెండు లాంగ్‌టెర్మ్ క్లోజర్లు అవసరం : సీఈ ఈఏడాది పశ్చిమగోదావరిలో 80 వేలఎకరాల్లో ఆయకట్టుకు విరామం ప్రకటించేందుకు రైతులు ముందుకొచ్చినందున వీఎన్డబ్ల్యూ, ఉండి కెనాల్‌లను పూర్తి స్థాయిలో ఆధునికీకరించనున్నామని, అదే రీతిలో ఇక్కడ కూడా ఒక లాంగ్‌టర్మ్ క్లోజర్ ఇవ్వగలిగితే మిగిలిన మేజర్ డ్రెయిన్ లతో పాటు కాలువల ఆధునికీకరణ పనులను కూడా చాలా వరకు పూర్తి చేయగలుగుతామని సీఈ చెప్పారు. తూర్పున 20 మేజర్ డ్రెయిన్లలో రెండింటి ఆధునికీకరణ పనులూ పూర్తికాగా, మరో ఏడు డ్రెయిన్స్ కు ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు. 45 మీడియం డ్రెయిన్లలో ఇప్పటి వరకు 29 డ్రెయిన్లలో పనులు పూర్తి కాగా మిగిలిన 13 డ్రెయిన్లకు ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు. 272 మెనర్ డ్రెయిన్లలో ఇప్పటి వరకు 99 పూర్తి కాగా మిగిలిన 172 డ్రెయిన్ల ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు. రానున్న రబీ షార్ట్క్లోజర్లో మీడియం, మైనర్ డ్రెయిన్స్‌కు సంబంధించి తూర్పుగోదావరిలో రూ.70 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు త్వరలోనే ఖరారు చేయనున్నామని తెలిపారు. అయితే కచ్చితంగా మార్చి 15 నాటికి కాలువలను మూసివేయగలిగితేనే ఈ పనులు చేయగలుగుతామని చెప్పారు. ఇక మేజర్ డ్రెయిన్లతో పాటు కాలువల ఆధునికీకరణ పనులను చేపట్టాలంటే కచ్చితంగా రెండు లాంగ్‌టర్మ్ క్లోజర్స్ అవసరమన్నారు. కాగా తూడు తొలగింపునకు డ్రెయిన్లకు రూ.కోటి, సెంట్రల్ డెల్టా పరిధిలోని కెనాల్లకు రూ.45లక్షలు, ఈస్ట్రన్ డెల్టా కెనాల్లకు రూ.80లక్షలతో టెండర్లు ఖరారయ్యాయని, రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని ఎస్ఈ కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు. రబీకి పూర్తి స్థాయిలో నీరివ్వండి కాగా రానున్న రబీ సీజన్లో పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కోరారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల న్నారు. మోటార్లు అవసరం లేకుండానే నీరందే యాజమాన్య పద్ధతులు పాటించేలా రైతులను చైతన్యపర్చాలని కోరారు. కాలువలను మూసి వేసే ముందుగా తాగునీటి అవసరాల కోసం చెరువులన్నీ నింపాలన్నారు. నీలం, భారీ వర్షాల సమయంలో పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలన్నారు. కాలువలు, డ్రెయిన్లలో చెత్తను, ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించేలా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఇందిరాసాగర్ ఎడమ కాల్వ ఎస్ఈ ఎంటీ రాజు, డ్రైనేజీ ఈఈ టీవీఎస్ నాగేశ్వరరావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.