
వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించడానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
రాజన్న దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఆర్జిత సేవలు, లఘు దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు.