huge crowd
-
ఉద్యోగం కోసం తరలివచ్చిన వేల మంది
-
జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు
-
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన అనకాపల్లి
-
జన నాయకుడికి అడుగడుగునా జన నీరాజనం..
-
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవ
-
తిరుమలలో కొండంత రద్దీ
-
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
-
ఎన్నికల పండగ..కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
ఓటుహక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ఓటర్లు
-
సీఎం జగన్ సిద్ధం సభకు జన ప్రవాహం
-
అయోధ్యకు పోటెత్తిన భక్తులు..
-
Dr BR Ambedkar Statue: ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. కోలాహలంగా విజయవాడ (ఫొటోలు)
-
సాధికారతకు జయహో
-
ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు
-
ఓటు వేయడానికి ఉర్లకు వెళ్తున్న ప్రజల తిప్పలు
-
ఆ కంపెనీ ముందు ఒక్క పోస్ట్ కోసం వేల మంది తోపులాట
-
భక్త జనసంద్రంగా తిరుమల.. 5 కి.మీ మేర క్యూలైన్లు
సాక్షి, తిరుమల: భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. ఎటు చూసిన క్యూలైన్లో వేచి ఉన్న భక్తులే దర్శనం ఇస్తున్నారు. పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి క్యూ లైన్లలో వున్న భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్ స్టాండ్లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. చదవండి: చంద్రబాబుకు మరో షాక్.. సెప్టెంబర్ 30వ తేదీన వేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది. కావున ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సర్వదర్శనం టికెట్లు పొందిన భక్తులకు 7 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరో మూడు రోజులు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. -
జన సంద్రమైన విజయవాడ
-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్ సభకు తరలివచ్చిన జనసంద్రం
-
బోనాల జాతర
-
కిక్కిరిసిన సీఎం జగన్ సభా ప్రాంగణం
-
Tirumala : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ (ఫొటోలు)
-
సింహాచలం చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోటెత్తిన భక్తులు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
యాదాద్రిలో భక్తుల సందడి.. భారీగా క్యూ లైన్లు (ఫొటోలు)
-
పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం
-
గ్రహణ సమయంలో శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీకి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
-
నరసరావుపేటలో బహిరంగ సభ
-
యాదగిరీషుని సన్నిధిలో భక్తజన సందోహం
-
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం
-
సంక్రాంతికి ఊళ్ల బాట పట్టిన హైదరబాదీలు..
-
సంక్రాంతి: ఊళ్లకు పయనమవుతున్న నగర వాసులు
-
నేటితో ముగియనున్న మేడారం జాతర
-
కొత్త సంవత్సరం..దేవుడి దర్శనం
-
తిరుమలకు పోటెత్తిన భక్త జనం
-
నిమజ్జనం వేళ కిటకిటలాడిన మెట్రో రైళ్లు
-
కృష్ణమ్మ మెరిసె.. బెజవాడ మురిసె
-
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు
-
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల చేరుకున్నారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు వెలుపల క్యూలో కూడా వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులతోపాటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
కాశీ విశ్వనాధుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
కిటకిటలాడే జైళ్లట...
మనాలి: ఫిలిప్పీన్స్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ చేపట్టిన యుద్ధం వల్ల జైళ్లు, పునరావాస కేంద్రాలు కిక్కిర్సిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఒక్క జైలు గదిలో సామర్ధ్యానికి మించి మూడింతల మంది నిందితులను ఉంచుతున్నారు. వారు నిద్రపోవడానికి చోటులేక ఒకరిపై ఒకరు పడుకోవాల్సి వస్తోంది. రొడ్రిగో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేనాటికి వెలవెలబోయిన ప్రభుత్వ, ప్రైవేటు పునరావాస కేంద్రాలు ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దేశావ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల పరిస్థితి దాదాపు ఇలాగే తయారయింది. తమ పునరావాస కేంద్రానికి రోజుకు 30 మంది చొప్పున మాదక ద్రవ్యాలకు బానిసలైన రోగులు వస్తున్నారని మనీలా నగరంలోని బికుటాన్ పునరావాస కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే తమ కేంద్రంలో రోగుల సంఖ్య సామర్థ్యానికి మించి రెండింతలు దాటిందని పేర్కొంది. ప్రైవేటు పునరావాస కేంద్రంలో చార్జీలు విపరీతంగా ఉన్నప్పటికీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. మాదక ద్రవ్యాల మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రొడ్రిగో, మాఫియాపైనే కాకుండా దానికి బానిసలైన రోగులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో ఆరువేల మంది మరణించగా, వారిలో 2,051 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. మిగతావారు జనం జరిపిన కాల్పుల్లో మరణించారు. డ్రగ్‌కు బానిసైనా, డ్రగ్ వ్యాపారి అని తెలిసినా కాల్చి పారేయమని, ఎలాంటి కేసుల్లేకుండా తాను చూసుకుంటానని రొడ్రిగో ప్రజలకు నేరుగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. డ్రగ్ బానిసల చికిత్స కోసం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రొడ్రిగో రెండు కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డ్రగ్స్ నుంచి విముక్తి పొందాలని, ఇదే ఆఖరి అవకాశమని కూడా నిధుల విడుదల సందర్భంగా ఆయన చెప్పారు. ఆ తర్వాత తాను తాడు పంపిస్తానని, ఆ తాడుతో ఉరేసుకొని చనిపోవాలని కూడా ఆయన సూచించారు. -
పుష్కరఘాట్లకు పెరిగిన భక్తుల రద్దీ
-
సాయి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించడానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. రాజన్న దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఆర్జిత సేవలు, లఘు దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు. -
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామి వార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు క్యూ కట్టారు. ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్: జంట నగరాల్లోని ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. వైష్ణవాలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వరస్వామి, వనస్థలిపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల భక్తులతో కిక్కిరిసింది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తకోటి పోటెత్తింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 62 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగనున్నారు. గుంటూరు జిల్లా: మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు గంటల సమయానికే సుమారు 40వేల మంది స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ద్వారక తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామి నిజరూప అవతారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు. వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని శ్రీ వాసవీ కన్యాకపరమేశ్వరీ అమ్మవారిని సోమవారం 108 దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి వజ్రపుచీర, వజ్రపు కిరీటం ధరింపజేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి, బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తజనసందోహంతో కలకలలాడుతున్నాయి. శ్రీకల్పగిరి రంగనాథస్వామి, మూలాపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయాల్లో స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. సింహాచలం: సింహాచలం కొండపై అప్పన్న శ్రీమన్నారాయణుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు దర్శనం కోసం భారీగా క్యూ కట్టారు. కరీంనగర్ జిల్లా: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు రద్దీ కొనసాగుతుంది. భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచారించి స్వామి దర్శనానికి బారులు తీరారు. ఉత్తర ద్వారాన్ని అందంగా అలంకరించారు. గరుడవాహనరూడుడైన స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భక్తసంద్రమైంది. క్యూలైన్లు నిండిపోగా, వెలుపల కూడా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. -
వాడ వాడలా కొలువు తీరిన గణేశుడు
-
తీరని ట్రాఫిక్ కష్టాలు.. భక్తులకు తప్పని ఇక్కట్లు
-
ఏపీలో గోదావరి పుష్కర సంరంభం
-
పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట
-
భద్రాచలంలో బారులు తీరిన భక్తులు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో భక్తుల కిటకిట
-
తిరుమలలో భక్త జన సందోహం
-
తిరుమలలో భక్తుల కిటకిట!
-
గణేష్ నిమజ్జనానికి పొటెత్తిన భక్తులు
-
కడసారి చూపుకు పోటెత్తిన జనం
-
భక్తులతో పోటెత్తిన శ్రీశైల దైవక్షేత్రం
-
గీన్ సిగ్నల్‌పై ‘అనంతా’గ్రహం
ఏదైతే కాకూడదనుకున్నారో అదే అయ్యింది. సమైక్య వాదులు అలుపెరుగకుండా 129 రోజుల పాటు సాగించిన ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు ఇసుమంతైనా పట్టించుకోలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపిందంటూ ప్రకటించడంతో అనంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం అర్ధరాత్రి దాటినా నిరసన కొనసాగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేటి బంద్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగు ప్రజల మనోభావాలకన్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జన్మదినోత్సవ కానుక ఇవ్వడానికే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపడంపై ‘అనంత’ ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. 129 రోజులుగా సాగుతోన్న సమైక్యాంధ్ర మహోద్యమాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరశించారు. ఎస్కేయూ వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి సమైక్యాంధ్ర మహోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు పూనుకుంది. అధిక శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా జీవోఎంను కోరారు. సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం ఒకానొక దశలో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. రాయలసీమను నిలువునా చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసేందుకు పూనుకుంది. జీవోఎం కూడా రాయల తెలంగాణకే ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రాయలసీమ విభజనపై సీమ ప్రజానీకం భగ్గుమనడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసు బలగాలతో భారీ ఎత్తున కవాతు నిర్వహించి.. ప్రజలను భయోత్పాతానికి గురిచేసే యత్నం చేయడం గమనార్హం. కాగా కేంద్ర ప్రకటనపై ఉరవకొండ, కదిరి, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. -
జగన్‌ను కలిసేందుకు జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు
-
రాష్ట్రం నలు మూలల నుంచి హైదరాబాద్ కు సమైక్యవాదులు
-
ఇడుపులపాయకు పోటెత్తిన అభిమాన సంద్రం
-
లోటస్‌పాండ్ వద్ద బారులు తీరిన జనం
-
సికింద్రాబాద్ గణపతి ఆలయంలో రద్దీ
-
పోటెత్తిన దీక్షా శిబిరం